You Are Here: Home » చిన్నారి » విమానాల టైర్లలో ఏ వాయువును నింపుతారు?

విమానాల టైర్లలో ఏ వాయువును నింపుతారు?

సైకిళ్లు, మోటార్‌బైక్‌లు రోడ్లపై తిరిగే వాహనాల్లో గాలి నింపటం చూస్తూనే ఉంటాం. అయితే విమానాల టైర్లలో ఏ వాయును నింపుతారో తెలుసుకుందాం. విమానాల టైర్లలో హీలియం అనే వాయువును నింపుతారు. ఇది తేలికైన జడ వాయువు. జడ వాయువు అంటే ఇతర పదార్థాలతో ఎటువంటి రసాయనికచర్య జరపనివి.

హీలియం వాయువు తేలికగా ఉండటం వలన దీనిని వాతావరణ బెలూన్లలో కూడా నింపుతారు. విమానాల టైర్లలో కూడా వాడతారు. ఆస్తమా రోగులకు ఆక్సిజన్, హీలియం వాయువుల మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. సముద్రపు లోతుల్లోకి వెళ్లేవారికి కూడా ఆక్సిజన్, హీలియం మిశ్రమాన్ని శ్వాస పీల్చుకోవడం కోసం ఉపయోగిస్తారు. హీలియం వాయువుకు చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్య గోళంలో జరిగే కేంద్రక సంలీన చర్యలో ఏర్పడే వాయువు కూడా హీలియమే.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top