You Are Here: Home » ఇతర » విప్లవిస్తే విజయం

విప్లవిస్తే విజయం

ఒక దేశంలో విప్లవం రావడం కొత్తేమీ కాదు..ఒేక దేశంలో వందేళ్ళ కాలంలో మూడు విప్లవాలు రావడం…అంతర్జాతీయంగా అవన్నీ కూడా పెను ప్రభావాన్ని కలిగి ఉండడం మాత్రం విశేషమే. అలా వందేళ్ళ కాలవ్యవధిలో మూడు పెనువిప్లవాలు చోటు చేసుకున్న దేశం ఈజిప్ట్‌. మెుదటి విప్లవం చోటు చేసుకున్న 30 ఏళ్ళకు మరో విప్లవం, అది వచ్చిన సుమారు 60 ఏళ్ళకు మరో విప్లవం అక్కడ చోటు చేసుకున్నారుు. ఈ విప్లవాలన్నీ కూడా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే రీతిలో విజయాన్ని సాధించారుు. ఒక విప్లవంతో పాక్షిక స్వాతంత్య్రాన్ని, మరో విప్లవంతో పూర్తి స్వాతంత్య్రాన్ని సాధిస్తే, తాజా విప్లవంతో ఒక నియంతృత్వ ప్రభుత్వాన్ని ఈజిప్ట్‌ ప్రజలు పడగొట్టగ లిగారు. ఈ మూడు కూడా వేటికవే సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించదగ్గవి అనడంలో అతిశయోక్తి కాదు.

మరీ ముఖ్యంగా ఈజిప్ట్‌ మూడో విప్లవం యావత్‌ ప్రపంచంలోని ఉద్యమకారులందరికీ స్ఫూర్తినిచ్చే దిలా కొనసాగింది. కొత్త కొత్త పోరాటరూపాలను ప్రవేశపెట్టింది. ప్రజాస్వామ్యవాదులకు సరికొత్త ఆయుధాలను అందించింది. ఈ పోరాటం సందర్భంగా ప్రభుత్వ దమనకాండను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఈజిప్ట్‌ ఉద్యమకారులు ప్రచురించిన కరపత్రం నేడు ఎందరో ఉద్యమకారులకు కరదీపికగా నిలిచింది. ఈజిప్ట్‌లో రెండో విప్లవం చోటు చేసుకున్నది 1952 జులై 23న. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈజిప్ట్‌ విప్లవాలపై కలర్స్‌ ప్రత్యేక కథనం….

ఇదీ మొదటి విప్లవం…
ఈజిప్ట్‌ అనగానే పిరమిడ్లు గుర్తుకు వస్తాయి. అతి ప్రాచీన నాగరికతలు విరాజిల్లిన ఈ దేశం నేడు విప్లవాలకు, ప్రజాస్వామిక పోరాటాలకు నిలయంగా మారింది.
తొలివిప్లవం
ఈజిప్ట్‌లో తొలి విప్లవం చోటు చేసుకున్నది 1919లో. ఈజిప్ట్‌, సూడాన్‌లను బ్రిటిష్‌ వారు ఆక్ర మించుకున్నందుకు నిరసనగా ఈ ఉద్యమం చోటు చేసుకుంది. ఈ విప్లవం నేపథ్యంలో బ్రిటిష్‌ ప్రభుత్వం 1922లో ఈజిప్ట్‌ స్వాతంత్య్రాన్ని గుర్తించింది. 1923 లో నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అదే సమయంలో సూడాన్‌పై ఈజిప్ట్‌ సార్వభౌమాధికారాన్ని గుర్తించేందుకు మాత్రం బ్రిటన్‌ నిరాకరించింది. సూయజ్‌ కాలువ ప్రాంతం నుంచి తన బలగాలను ఉపసంహరించేం దుకు తిరస్కరించింది. క్రమంగా అది 1952 నాటి విప్లవానికి కూడా కారణమైంది.

రెండో విప్లవం…1952 జూలై 23
Unaమహమ్మద్‌ నజీబ్‌, గమల్‌ అబ్దుల్‌ నాజర్‌ నేతృత్వంలో ‘ఫ్రీ ఆఫీసర్స్‌ మూవ్‌మెంట్‌’ పేరిట జరిగిన సైనిక కుట్ర చివరకు 1952 జూలై 23 విప్లవంగా పేరొం దింది. రాజు ఫారూఖ్‌ను గద్దె దించడం లక్ష్యంగా ఈ విప్లవం చోటుచేసుకున్నా తరువాత అది విసృ్ తత రూపం దాల్చింది. రాజ్యాంగబద్ధమైన రాజరికాన్ని రద్దు చేసేం దుకు, రిపబ్లిక్‌ ఏర్పాటుకు, బ్రిటన్‌ పరోక్ష దురాక్రమణ తొలగి పోయేందుకూ దారి తీసింది. అదే సమయంలో సూడాన్‌ స్వాతం త్య్రం పొందింది. ఈజిప్ట్‌లో ఏర్పడిన విప్లవ ప్రభుత్వం జాతీయ వాద ధోరణితో సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించింది. అరబ్‌ జాతీయ తను ప్రోత్సహిస్తూ, అలీన వైఖరిని అవలంబించింది.

మూడో విప్లవం…2011 జనవరి 25
ఇటీవల ఈజిప్ట్‌లో చోటుచేసుకున్న మూడో విప్లవం యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భారత్‌ తో సహా వివిధ దేశాల్లో పలు ప్రజాస్వామిక పోరాటాలకు అది స్ఫూర్తిగా నిలిచింది. ప్రపం చంలోనే అతిగొప్ప అహింసాయుత, సహాయనిరాకరణ ఉద్యమం గా ఇది పేరొందింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లక్షలాది మం ది ప్రజలు రోడ్లపైకి వచ్చి కూడలి ప్రాంతాలను, ప్రభుత్వ కార్యాల యాలను ఆక్రమించుకున్నారు. విభిన్న రాజకీయ అభిప్రాయాలు కలిగిన వారు, అతివాదులు, మితవాదులు, మతవాదులు, మహి ళలు, విద్యార్థులు, ఉద్యోగులు చివరకు పోలీసులు కూడా ఈ ఉద్య మంలో ప్రజల పక్షాన నిలిచారు.

వివిధ అంశాల పట్ల తమ మధ్య ఉన్న అభిప్రాయ బేధాలను పక్కన బెట్టి ప్రభుత్వాన్ని గద్దె దింపాల న్న ఏకైక లక్ష్యంతో వారు ఉద్యమించారు. ఉద్యమం ఎంత శాంతి యుతంగా జరిగినప్పటికీ కనీసం 850 మంది ప్రాణాలు కోల్పో యారు. సుమారు 6000 మంది గాయాలపాలయ్యారు. ఉద్యమం ధాటికి ముబారక్‌ దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేయకతప్పింది కాదు.

తాజా ఉద్యమంలో కీలకాంశాలు
ఇటీవలి ఉద్యమంలో మీడియా, ఇంటర్నెట్‌, సోషల్‌ నెట్‌వర్క్‌ వెబ్‌ సైట్లు కీలకపాత్ర వహించాయి. అన్ని వర్గాల వారు ఒక్కసారిగా ఉద్యమించారు. అంతర్జాతీయ మీడియా కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి మద్దతు పలకడం విశేషం. వారసత్వ పాలన ప్రయ త్నాలు, అవినీతి, ప్రజాభిప్రాయా న్ని ప్రతిబింబించ ఎన్నికలు, వివిధ సామాజిక అంశాలు, పోలీసుల క్రూరత్వం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, పేదరికం, విద్య, ఉద్యోగావకాశాలు లభించక పోవడం… లాంటి వన్నీ ఒక్కసారిగా పెల్లుబికి ఉద్యమ రూపం దాల్చాయి. ఆత్మాహు తుల ఉద్యమ తీవ్రతను పెంచాయి.

గైడ్గ టు రివల్యూషన్‌
Untaఈజిప్ట్‌ ఉద్యమం సందర్భంగా ఉద్యమకారులు ‘గైడ్‌ టు రివల్యూషన్‌’ పేరిట కరపత్రాలను రూపొం దించి విసృ్తతంగా పంచిపెట్టారు. పోలీసుల బారి నుంచి తప్పించుకోవడం మొదలుకొని ఉద్యమ రూపాలు ఎలా ఉండాలి అనే దాకా వివిధ అంశాలపై అందు లో సమాచారాన్ని అందించారు. నిఘా కెమెరా లు పని చేయకుండా వాటికి రంగు పూయడం మొదలు కొని సమాచారాన్ని రహ స్యంగా అందించడం వరకు, కొట్టేందుకు వచ్చే పోలీసులపై వారిని చీకాకు పరిచే ద్రవాలు, పౌడర్లు చల్లడం, నిర్దేశించుకున్న ప్రాంతానికి పోలీసుల కళ్ళుగప్పి చేరు కోవడం, ఆందోళనల్లో పాల్గొనేటప్పుడు ఏ విధమైన దుస్తులు వేసుకోవాలి, ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి, నీరు, ఆహారం, వైద్యసదు పాయాల కల్పన లాంటి అంశాలన్నింటినీ ఇందులో చర్చించారు. ఇంటర్నెట్‌లో ఈ కరపత్రం విసృ్తతంగా వ్యాప్తిలో ఉన్నప్పటికీ, కొన్ని వెబ్‌సైట్‌లను క్లిక్‌ చేసినప్పు డు డాట్‌ ఆదేశాల మేరకు యాక్సెస్‌ కల్పించడం లేదు అనే సందేశం వస్తుంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top