You Are Here: Home » సినిమా » పాటలు » విప్రనారాయణ (1954)- పాలించరా రంగా పరిపాలించరా రంగా

విప్రనారాయణ (1954)- పాలించరా రంగా పరిపాలించరా రంగా

పల్లవి :
పాలించరా రంగా పరిపాలించరా రంగా
కరుణాంతరంగ శ్రీరంగా (2)
పాలించర రంగా

చరణం : 1
మరువని తల్లివి తండ్రివి నీవని
మరువని తల్లివి తండ్రివి నీవని
నెరనమ్మితిరా రంగా
మొరవిని పాలించే దొరవని
మొరవిని పాలించే దొరవని
శరణంటినిరా శ్రీరంగా
పాలించర రంగా

చరణం : 2
మనసున నీ స్మృతి మాయకమునుపే (2)
కనులను పొరలూ మూయకమునుపే
కనరారా… ఆ… ఆ…
కనరారా నీ కమనీయాకృతి
కనియద మనసారా రంగా
కనియద మనసారా…
పాలించరా రంగా పరిపాలించరా రంగా

చరణం : 3
కరులును హరులును మణిమందిరములు (2)
సురభోగాలను కోరనురా (2)
దరి కనరానీ భవసాగరమును
దాటించుమురా గరుడ తురంగా

చిత్రం : విప్రనారాయణ (1954)
రచన : సముద్రాల రాఘవాచార్యులు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఎ.ఎం.రాజా

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top