You Are Here: Home » ఇతర » వినోభా స్ఫూర్తితో…

వినోభా స్ఫూర్తితో…

Vinobభూదానోద్యమం సందర్భంగా వినోభా బావే కారంచేడు గ్రామాన్ని సందర్శించారు. అక్క డున్న వారంతా ఎకరా, రెండు ఎకరాలు అంటూ భూమిని దానంగా ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయ సాగారు. తొమ్మిదేళ్ళ వయస్సు ఉన్న రామానాయుడు కూడా అప్పుడు అక్కడే ఉన్నాడు. రెండున్నర ఎకరాలు దానం చేస్తా అంటూ ముందుకొచ్చాడు. అందుకు మీ నాన్న అంగీకరిస్తాడా అని కొంత మంది ప్రశ్నించగా, మా నాన్న అంగీకరించకపోతే, మా అమ్మ పేరిట ఉన్న పొలంలో నుంచి ఇస్తానంటూ జవాబిచ్చాడు. ఆనాడు ప్రారంభమైన సేవాయజ్ఞం అప్రతిహతంగా నేటికీ కొనసాగుతోంది.

సినిమా సక్సెస్‌తో…
రాముడు – భీముడు సినిమా సక్సెస్‌ కావడంతో ఆ విజయానికి గుర్తుగా తల్లిదండ్రుల పేరిట రామానాయు డు కారంచేడులో కల్యాణమండపం నిర్మించారు. ఆ తరువాత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన జన్మభూమి స్ఫూర్తితో ఎన్నో సేవా కార్యకలాపా లు చేపట్టారు. జన్మభూమి కార్యక్రమం స్ఫూర్తితో రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. సొంతడబ్బుతో, ప్రభుత్వ నిధులతో ఎన్నో పనులు చేపట్టారు. రామా నాయుడు చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి రూ. కోట్ల వ్యయంతో ఎన్నో సేవాకార్యకలాపాలు నిర్వహించారు.

పొట్ట కొట్టవద్దు…
సేవా కార్యకలాపాలకు రూ.కోట్లు వెచ్చించే అవకాశం లభించడం తన అదృష్టమని రామానాయుడు అ టారు. ఆ విధంగా సేవ చేయడంలో తాను ఎంతో ఆనందం పొం దుతానని చెప్పారు. ఎవరి పొట్ట కూడా కొట్టవద్దు అనేదే ప్రాథమికంగా తాను నమ్మిన సూత్రమని అంటారు.

రెైతన్నకు అండగా…
విద్యారంగంలో తమ ప్రయోగాలు విజయవంతమై నప్పటికీ, విజ్ఞానజ్యోతి సంస్థను ఏదో తెలియని వెలితి వేధిస్తూనే ఉంది. జాతికి అన్నం పెట్టే అన్నదాతలెైన రాష్ట్ర రెైతాంగానికి చేతనెైనంత ఊతం అందించాలనే ఆలో చనతో బహుశా దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు రంగంలో నిస్వార్థంగా, నిజాయితీగా ఓ చిరు ప్రయ త్నానికి అంకురార్పణ జరిగింది. అదే డాక్టర్‌ డి.రామా నాయుడు విజ్ఞానజ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యాసంస్థ. హైదరాబాద్‌ నగరానికి 67 కి.మీ దూరంలో ఉన్న మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామం ఈ మహత్తర ప్రయోగానికి వేదిక అయింది. అక్కడ డాక్టర్‌ రామానాయుడు విరాళంగా ఇచ్చిన 33 ఎకరాల విశాల క్షేత్రంలో, ఆయనే చీఫ్‌ ప్యాట్రన్‌గా గ్రామీణాభి వృద్ధి విద్యాసంస్థను నెలకొల్పేందుకు విజ్ఞానజ్యోతి సంస్థల యాజమాన్యం నిర్ణయించింది.

ఎందుకీ ప్రయత్నం
తనకున్న కొద్దిపాటి వనరులను పూర్తిస్థాయిలో విని యోగించుకోలేకపోవడం వలన, తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేనందువల్ల, వాతావరణ పరిస్థితుల మా ర్పుపెై సరెైన అవగాహన లేకపోవడం వల్ల, సంప్రదాయ సేద్యం రెైతుకు గిట్టుబాటుగా లేదు. వ్యవసాయాన్ని లాభసాటిగా మలుచుకునేందుకు సమా యత్తపరచాలనే సదాశయంతో విజ్ఞాన జ్యోతి గ్రామీణా భివృద్ధి విద్యాసంస్థ ఓ నిరంతర శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అలా రూపుదిద్దుకున్నదే బాయర్‌- రామానా యుడు విజ్ఞానజ్యోతి స్కూల్‌ ఆఫ్‌ అగ్రిల్చర్‌.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top