You Are Here: Home » భవిత » విద్య » విద్య

విద్య

విమానాలు ఏ సూత్రం ఆధారంగా గాలిలోకి ఎగురుతాయి?
ఫిజికల్ సైన్స్
– ఎ.వి.సుధాకర్, సీనియర్ ఉపాధ్యాయులు, నెల్లూరు
కొలతలు, సహజ వనరులు
1. ఒక మాధ్యమిక సౌరదినం?
ఎ) 86400 సెకన్లు బి) 8640 సెకన్లు
సి) 864 సెకన్లు డి) 1/86400 సెకన్లు
2. నియమిత ఘనపరిమాణం ఉన్న ద్రవాలను తీసుకోవడానికి వాడే పరికరం?
ఎ) బ్యూరెట్ బి) కోనికల్ ప్లాస్క్
సి) పిపెట్ డి) కొలజాడీ
3. కాలానికి ప్రమాణం?
ఎ) కాంతి సంవత్సరం బి) సెకన్
సి) గడియారం డి) లఘులోలకం
4. {Vహాల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించేది?
ఎ) సర్వే గొలుసు బి) త్రిభుజీకరణ పద్ధతి
సి) పెద్ద టేపు డి) దూరదర్శిని
5. 1 సెం.మీ.కి ఎన్ని మిల్లీ మీటర్లు?
ఎ) 10 బి) 1000 సి) 100 డి) 10000
6. {తిభుజీకరణ పద్ధతిని దేన్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తారు?
ఎ) బెంచి వెడల్పు బి) నది వెడల్పు
సి) గది పొడవు డి) పుస్తకం మందం
7. రైల్వేస్టేషన్‌లో ఉపయోగించే త్రాసు?
ఎ) సున్నితపు బి) సామాన్య
సి) త్రిదండ డి) ఫ్లాట్‌ఫాం కాటా
8. అత్యంత కచ్చితంగా కాలాన్ని కొలిచే గడియారం?
ఎ) గోడ బి) పరమాణు
సి) నీటి డి) నీడ
9. కాంతి ఉద్దీపన తీవ్రతకు ప్రమాణం?
ఎ) ఆంపియర్ బి) కేండిలా
సి) కెల్విన్ డి) జౌల్
10. 1 ఆంగ్‌స్ట్రాం ఎన్ని మీటర్లకు సమానం?
ఎ) 10(టు ద పవర్ ఆఫ్ -10) బి) 10(టు ద పవర్ ఆఫ్ -8)
సి) 10(టు ద పవర్ ఆఫ్ -7) డి) 10(టు ద పవర్ ఆఫ్ -12)
11. F.P.S. పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణం?
ఎ) గ్రాము బి) అడుగు
సి) కిలోగ్రాం డి) పౌండు
12. Z.R.P. కంటే తక్కువ విరామ స్థానానికి పేరు?
ఎ) ఆర్.పి. బి) ఎల్.ఆర్.పి.
సి) హెచ్.ఆర్.పి. డి) టి.పి.
13. స్కేలు ఉపయోగించి కొలవగలిగే అతి చిన్న కొలత?
ఎ) మిల్లీమీటర్ బి) సెంటీమీటర్
సి) మీటర్ డి) ఆంగ్‌స్ట్రాం
14. 1 మైక్రాన్‌కు ఎన్ని మిల్లీ మీటర్లు?
ఎ) 10(టు ద పవర్ ఆఫ్ 3) బి) 10(టు ద పవర్ ఆఫ్ -6)
సి) 10(టు ద పవర్ ఆఫ్-8) డి) 10(టు ద పవర్ ఆఫ్-3)
15. రాగి తారతమ్య సాంద్రత?
ఎ) 0.8 బి) 8.9 సి) 19.3 డి) 13.6
16. సాపేక్ష సాంద్రతకు ప్రమాణాలు?
ఎ) సెం.మీ/సెకన్ బి) కెల్విన్
సి) ఆంపియర్ డి) ప్రమాణాలు లేవు
17. అక్రమాకార వస్తువు (ఆకు) వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఉపయోగించేది?
ఎ) స్క్రూగేజి బి) వెర్నియర్ కాలిపర్‌‌స
సి) గ్రాఫ్ కాగితం డి) స్పెరా మీటర్
18. విద్యుత్ ప్రవాహ తీవ్రతకు ప్రమాణం?
ఎ) కెల్విన్ బి) వోల్ట్
సి) ఆంపియర్ డి) కేండిలా
19. వ్యక్తుల భారాలను త్వరగా కనుక్కో వడానికి డాక్టర్లు వాడే త్రాసు?
ఎ) స్ప్రింగ్ బి) సున్నితపు
సి) టేబుల్ డి) సంపీడన స్ప్రింగ్
20. పాదరసం సాంద్రత?
ఎ) 1.00 బి) 19.3 సి) 13.6 డి) 8.9
21. గాలిలో ఆక్సిజన్, నైట్రోజన్‌ల నిష్పత్తి?
ఎ) 1:3 బి) 2:4 సి) 4:1 డి) 1:4
22. ఎత్తై ప్రదేశాలకు వెళ్లే కొద్దీ వాతావరణ పీడనం?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) మార్పు ఉండదు డి) ఏదీ కాదు
23. తొట్టి భారమితిని నిర్మించిన శాస్త్రజ్ఞుడు?
ఎ) సి.వి. రామన్ బి) నీల్స్ బోర్
సి) టారిసెల్లి డి) రూథర్ ఫర్‌‌డ
24. లెగ్యుమినేసి మొక్కల వేరు బుడిపెల్లో ఉండేవి?
ఎ) వేళ్లు బి) నైట్రేట్ గుళికలు
సి) రైజోబియం బ్యాక్టీరియా
డి) జిగురు పదార్థం
25. సాధారణ వాతావరణ పీడనం?
ఎ) 7.6 సెం.మీ. బి) 86 సెం.మీ.
సి) 760 సెం.మీ. డి) 76 సెం.మీ.
26. ఇంధనం మండడం వల్ల వెలువడే వాయువు?
ఎ) ఆక్సిజన్ బి) సీఓ2
సి) నైట్రోజన్ డి) హైడ్రోజన్
27. వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనం?
ఎ) థర్మామీటర్ బి) పెరిస్కోపు
సి) భారమితి డి) సెస్మోగ్రాఫ్
28. పాస్కల్ దేనికి ప్రమాణం?
ఎ) సాంద్రత బి) ఒత్తిడి
సి) ఘనపరిమాణం డి) పీడనం
29. విమానాల ఎత్తు కొలవడానికి ఉపయోగించే పరికరం?
ఎ) బ్రామాప్రెస్ బి) మైక్రోస్కోప్
సి) ఆల్టీమీటర్ డి) భారమితి
30. {దవాల ఘనపరిమాణాలను కొలవడానికి ఉపయోగించే పరికరం?
ఎ) కొలజాడి బి) పిపెట్
సి) థర్మామీటర్ డి) బ్యూరెట్
31. వీటిలో వేరుగా ఉన్న భౌతిక రాశి?
ఎ) సాంద్రత బి) పీడనం
సి) ఒత్తిడి డి) ఘనపరిమాణం
32. 1 గ్రామ్ భారం =
ఎ) 9.8 డైనులు బి) 9.8 న్యూటన్‌‌స
సి) 98 డైనులు డి) 980 డైనులు
33. పాత్ర పక్కతలంపై నీరు కలిగించే పీడనాన్ని ఏమంటారు?
ఎ) అథోపీడనం బి) పార్శ్వపీడనం
సి) ఊర్థ్వ పీడనం డి) పైవన్నీ
34. {పామాణిక భారమితిగా దేన్ని ఉపయోగిస్తారు?
ఎ) అనార్థ్ర భారమితి
బి) ఫార్టిన్ భారమితి
సి) ఎ, బి డి) ఏదీ కాదు
35. సముద్రమట్టం నుంచి ప్రతి 272.7 మీ. ఎత్తుకు ఎన్ని సెం.మీ. పీడనం తగ్గు తుంది?
ఎ) 3.52 బి) 25.4 సి) 2.54 డి) 2.72
36. కేన్యర్ వ్యాధికి కారణం?
ఎ) సి.ఎఫ్.సి. బి) స్ట్రాన్షియం-90
సి) CO2 డి) CO
37. పత్రహరితాన్ని నాశనం చేసేది?
ఎ) CO బి) NO2 సి) SO2 డి) Zn
38. నీటిలో ఫ్లోరిన్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే వ్యాధి?
ఎ) రికెట్స్ బి) ఫ్లోరోసిస్
సి) ఫాసీజా డి) రేచీకటి
39. శీతాకాలంలో పొగమంచు ఏర్పడడానికి కారణం?
ఎ) గాలిలో నీటి ఆవిరి ఎక్కువ కావడం
బి) గాలిలో నీటి ఆవిరి తక్కువ కావడం
సి) వాతావరణం చల్లగా ఉండడం
డి) పైవేవీ కావు
40. విమానాలు ఏ సూత్రం ఆధారంగా గాలిలోకి ఎగురుతాయి?
ఎ) బాయిల్ బి) పాస్కల్
సి) ఆర్కిమెడిస్ డి) బెర్నోలీ
41. {దవాల విశిష్ట సాంద్రతను కనుక్కోవడానికి ఉపయోగించేది?
ఎ) థర్మామీటర్ బి) సాంద్రత బుడ్డీ
సి) హైడ్రోమీటర్ డి) బ్రామాప్రెస్
42. PV = స్థిరరాశి ఇది ఏ నియమం?
ఎ) బాయిల్ బి) చార్లెస్
సి) గెలూసాయిక్ డి) గ్రాహం
43. {బామాప్రెస్ ఏ సూత్రంపై ఆధారపడి పని చేస్తుంది?
ఎ) పాస్కల్ బి) ఆర్కిమెడిస్
సి) బాయిల్ డి) బెర్నోలీ
44. హైడ్రాలిక్ యంత్రాలు ఏ సూత్రం ఆధారంగా పని చేస్తాయి?
ఎ) ఆర్కిమెడిస్ బి) బెర్నోలీ
సి) పాస్కల్ డి) బాయిల్
45. సముద్రతీరంలోని గాలిలో ఎక్కువగా ఉండేది?
ఎ) ఆక్సిజన్ బి) నైట్రోజన్
సి) నీటి ఆవిరి డి) CO2
సమాధానాలు
1) ఎ 2) సి 3) బి 4) బి 5) ఎ
6) బి 7) డి 8) బి 9) బి 10) ఎ
11) డి 12) డి 13) ఎ 14) డి 15) బి
16) డి 17) సి 18) సి 19) డి 20) సి
21) డి 22) బి 23) సి 24) సి 25) డి
26) బి 27) సి 28) డి 29) సి 30) సి
31) డి 32) డి 33) బి 34) బి 35) సి
36) బి 37) సి 38) బి 39) సి 40) డి
41) సి 42) ఎ 43) ఎ 44) సి 45) సి
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top