You Are Here: Home » చిన్నారి » విటమిన్ ‘సి’ ఉపయోగం ఏమిటి?

విటమిన్ ‘సి’ ఉపయోగం ఏమిటి?

రోగాన్ని నిలువరించి ఆరోగ్యాన్ని అన్నివిధాలా కాపాడేందుకు ‘సి’ విటమిన్ అతి ముఖ్యమైనది. ఈ ‘సి’ విటమిన్ ఉండే పళ్లలో నారింజ, నిమ్మ, బత్తాయి, కమలాపండు ముఖ్యమైనవి. వీటినే ‘సిట్రస్’ పండ్లు అంటారు. వీటిలో ‘సి’ విటమిన్ అధికంగా ఉంటుంది.

నాలుగు ఔన్స్‌ల నారింజ పండులో 66 మిల్లీగ్రాములు, ఒక నిమ్మకాయలో 39 మిల్ల్లీగ్రాముల ‘సి’ విటమిన్ ఉంటుంది. శరీరంలోని కణజాలంలో కణాలు దగ్గరగా చేరి ఉండటానికి రక్తనాళాల్లో టిష్యూలని కాపాడటానికి అవసరమయ్యే ‘కొల్లాజెన్’ పదార్థం కోసం విటమిన్ ‘సి’ అత్యవసరం. ఎముకలకు, దంతాలకు ‘సి’ విటమిన్ అవసరం. విటమిన్ ‘సి’ లోపిస్తే పళ్లు ఊడిపోతాయి. రక్తహీనత ఏర్పడుతుంది. సూక్ష్మజీవులతో పోరాడే శక్తి హరించిపోతుంది. అందుకే నారింజ, నిమ్మ వంటి పండ్లు తరచూ వాడుతుండాలి. ‘సి’ విటమిన్ ఆరోగ్యాన్నే కాక చర్మసౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top