You Are Here: Home » ఇతర » విజ్ఞాన గని మోక్షగుండం

విజ్ఞాన గని మోక్షగుండం

ఏడుకొండలవాడిని చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతు న్న భక్తుల వ్యధలను చూసి శ్రీవారిని చేరుకునేందుకు సులువైన రోడ్డు మార్గానికి సంబంధించిన డిజైన్‌ రూపొం దించిన మహనీ యుడెవరు?… నేడు మన దేశం సుభిక్షంగా పంట పొలాలతో…వరద ముంపు లేని ప్రాంతాలతో తుల తూగడానికి కారణం ఓ మహామనిషి.

Enginaఊళ్ళకు ఊళ్లనే తన గర్భంలో కలిపేసుకునే ఉగ్ర గంగను ఆపిన మహా శక్తివంతు డాయన. ఏడుకొండల వాడా ఎక్కుడున్నావయ్యా అంటూ అలిసి సొలిసిన భక్తునికి వేంకటేశుని పాదాల చెంతకు వెళ్ళే అతి తేలికైన దారిని చూపించిన మహామేథావి. ఆయనే మెక్ష గుండం విశ్వేశ్వరయ్య. సాంకేతిక రంగానికి పుట్టిల్లయినటు వంటి కర్ణాటక రాష్ర్టంలోని చిక్‌బళాపూర్‌ జిల్లాలోని ముద్దెన హళ్లిలో సెప్టెంబరు 15, 1861న జన్మించారు విశ్వేశ్వర య్య. ఒక్కసారి ఆ మహనీయుని చరి త్రను ఈ సెప్టెంబరు 15న ఒకసారి అవలోకిద్దాం. విశ్వేశ్వ రయ్య తన బాల్యంలో అనేక ఆటుపోట్లను చవి చూశారు. సంస్కృతంలో ఉద్దండు లైన తండ్రి శ్రీనివాసశాస్త్రిని విశ్వేశ్వరయ్య కేవలం పదేళ్ళ ప్రాయంలోనే పోగొట్టుకున్నాడు.

నిజానికి విశ్వేశ్వరయ్య తాత ముత్తాతల ఊరు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు సమీప లోని మోక్షగుండం గ్రామం. ఆయన కుటుంబ సభ్యులు మైసూరుకు వలస వెళ్ళారు. అయితే వారి జన్మస్థలి నామ ధేయ మైన మోక్షగుండం మాత్రం వారి వెన్నంటే వెళ్ళింది. అందుకే మోక్షగుండం వారి ఇంటిపేరు అయింది. చదు వు పూర్తి అయ్యాక ఆయన ప్రతిభను గుర్తించి ఇండియన్‌ ఇరిగేషన్‌ కమిషన్‌లోకి ప్రభుత్వం తీసుకువెళ్ళింది. దక్కను ప్రాంతంలో సాగునీటి సమస్యపై తీవ్రంగా కృషి చేశారు. తొలిసారి 1903లో ఆటోమేటిక్‌ గేట్ల పద్దతిని కనుగొన్నారు. వరద ముప్పుతో అల్లాడే హైదరాబాద్‌ నగరానికి శాశ్వత ప్రాతిపదికన ఆయన రూపొందించిన డిజైన్‌ సత్పలితాలివ్వ డంతో ఆయనకు గుర్తింపు వచ్చింది. విశ్వేశ్వరయ్య రూపొం దించిన డిజైన్లు, వాటి వల్ల కలిగిన ప్రయోజనాలు చెప్పుకుం టూ పోతే చాలా ఉన్నాయి. ఆయన మేథస్సుకు అంతేలేదు.ఆయన ఓ విజ్ఞాన గని. ఆయన మెదడు ప్రణాళికలమయం. ఆయన పుట్టినరోజును ‘‘ఇంజనీర్స్‌ డే’’గా ప్రభుత్వం ప్రక టించి ఆయనపై ఉన్న గౌరవాన్ని చూటుకుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top