You Are Here: Home » ఇతర » విజయానికి ఇవే మెట్లు…

విజయానికి ఇవే మెట్లు…

క్రమశిక్షణ లేని జీవితం చుక్కాని లేని నావలాంటిది. విజయ సాధనకు కీలక మైనది క్రమశిక్షణే. అందుకే ఒక నిర్దిష్ట ఫలితాన్ని సాధించే దిశగా నిరంతర సాధనకు క్రమశిక్షణను పాటించేవారు అనుకున్నది సాధించగలుగుతారు. ఇందుకు ఏం చేయాలీ… అంటే…
3fillerమీరు తప్పనిసరిగా చేయవలసి ఉన్న పనుల జాబితాను సిద్ధం చేసుకోండి. అదే పనిగా వినోదం కోసం అర్రులు చాచకండి. ఖాళీ సమయాన్ని నిర్మాణాత్మకమైన పనులకు వినియోగించండి. సమయపాలన చెయ్యండి. మాట నిలుపుకోండి. వాగ్దానాలు చేసినప్పుడు వాటిని నెరవేర్చండి. కష్టమైన పనులు ముందు చేపట్టండి. తేలికైన, తక్కువ ప్రాధాన్యం కలిగిన పనులు చేసి, కష్టంగా ఉన్నవాటిని వదిలేస్తారు చాలా మంది. దానివల్ల క్లిష్టమైన, అధిక ప్రాధాన్యంగల పనులను పూర్తి చేసేందుకు తగినంత శక్తీ, సమయమూ లేకుండా పోతాయి.

విమర్శను స్వాగతించండి. మీరు చేయకూడనిది ఏమిటో తద్వారా తెలిసి అది మీ క్రమశిక్షణను పెంచేది అవుతుంది. బాధ్యతలు స్వీకరించండి. చేయవలసిన పనులను చేసేందుకు సంసిద్ధులుకండి. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోకండి. అది మీకు సాయపడదు. ప్రస్తుతానికి మీరెక్కడున్నారో చూసుకోండి. జీవన గమనంలో మరింత మెరుగ్గా అయ్యేందుకు యత్నించండి. అంతిమ లక్ష్యాన్ని అందుకునేంతవరకూ అదే పద్ధతిని కొనసాగిస్తూ పొండి. అలా అంచెలంచెలుగా ఎదిగిన కొద్దీ ప్రతిసారీ మీరు మరింత శక్తిసంపన్ను లవుతారు. ప్రతి అవకాశాన్ని అంటిపెట్టుకుని ఒక సవాలు ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకుంటూ ఉండాలి. కొందరు ఈ సవాళ్లను విజయ సోపానాలుగా భావిస్తారు. అటువంటివారికి విజయం తథ్యం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top