You Are Here: Home » ఇతర » వింత పక్షులు

వింత పక్షులు

పాటలు పాడే థ్రాషర్‌
birdsఏ కొమ్మపైన్నో ఆకుల మధ్యనో దాగి హాయిగా పాడుతూంటుంది సేజ్‌ థ్రాషర్‌! మాకింగ్‌ బర్డ్‌లా మిమిక్రీ చేయదు. ఈ పక్షి థ్రాషర్‌, మాకింగ్‌బర్డ్‌కీ పుట్టినా థ్రాషర్‌ లానే ఉంటుంది. ఏదైనా ప్రమాదం పొంచి వుందని అనుమానిస్తే వెంటనే దగ్గర్లోని పొదల్లోకి రివ్వున ఎగిరి దాక్కుంటుంది. పళ్లు, కూరగాయలు తింటుంది. అప్పుడప్పుడు పురుగులను పట్టి తింటుంటుంది. 22 సెంటీమీటర్లు ఉండే ఈ పక్షి గోధుమ రంగులో ఉండి వీపు మీద నల్లని చారికలు కలిగి ఉంటుంది. తోక చిన్నగా ఉండి చివర్లో తెల్లని చారికలు కలిగి ఉంటుంది.

ఆనందం శాండ్ హిల్ సొంతం
crainsకొంగల జాతిలో ఇదో రకం. ఇవి చాలా దూర ప్రాంతాలకు తరలిపోతూంటాయి. ఎక్కువగా నబ్రస్కాలోని ప్లాటీ నదీతీరాన్ని చేరుకుంటాయి. ఎక్కువగా అమెరికాలో కనపడతాయి. ఈ కొంగ జంట డాన్స్‌ను చూసి తీరాల్సిందే. రెక్కలు విప్పార్చి పైకి ఎగురుతూ గట్టిగా అరుస్తూ ఆడుతూంటాయి. మరికొన్ని నేలమీదనే ఆనందంగా పరుగులు తీస్తుంటాయి. దూరంగా ఉన్న స్నేహితుల్ని పిలిచినట్టు అరుస్తుంటాయి. 86 నుంచి 122 సెంటీమీటర్ల ఎత్తు వుండే ఈ కొంగల మెడ, కాళ్లు పొడవుగా ఉంటాయి. ఎక్కువగా ఇవి గోధుమ రంగులో ఉంటాయి. నుదురు మాత్రం ఎర్రగా ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top