You Are Here: Home » చిన్నారి » వింతజబ్బు

వింతజబ్బు

పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఒక వింతజబ్బు పట్టుకుంది. ఆయన కడుపునిండా తినేవాడు. కంటినిండా నిద్రపోయేవాడు. బయటకాని, లోపలకాని ఎలాంటి ఆనారోగ్యపు ఛాయలు కనిపించేవి కావు. ఎంతోమంది వైద్యులు వచ్చారు. రాజును రకరకాలుగా పరీక్షించారు. కానీ ఆయనకు వచ్చిన ఆ వింత జబ్బు ఏమిటో కనిపెట్టలేక పోయారు.

ఒకరోజు సూర్యశర్మ అనే ఒక తెలివైన వైద్యుడు రాజును చూడటానికి వచ్చాడు. రాజుకు వచ్చిన ఆ వింతజబ్బు ఏమిటో అతనికి అర్థమైపోయింది.

‘‘రాజా! మీ జబ్బేమిటో తెలిసింది. ఏ చింతా లేకుండా చాలా సంతోషంగా ఉండే వ్యక్తి దుస్తులు ఒకరోజు ధరించండి. మీ సమస్యలన్నీ తీరిపోతాయి’’ అని సూచించాడు.రాజు వెంటనే తన భటులను ‘రాజ్యమంతా వెతికి అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతన్ని తీసుకురండి’ అని పురమాయించాడు. ఆ మరునాడు భటులు ఒక వ్యక్తిని రాజు ముందు ప్రవేశపెట్టారు. ఆ వ్యక్తి ముఖం చాలా ప్రశాంతంగా ఉంది.

‘‘ఎందుకు నువ్వింత ఆనందంగా ఉన్నావు?’’ అని వైద్యుడు ఆ వ్యక్తిని అడిగాడు.‘‘నేను దేని గురించీ చింతించను. అందుకే ఆనందంగా ఉన్నాను’’ అన్నాడు నవ్వుతూ.తన వింతజబ్బుకు కారణం ‘తృప్తి లేకపోవడమే’ అన్న విషయం రాజుకు అర్థమైంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top