You Are Here: Home » ఇతర » విండోస్‌ 7 యూజర్ల కోసం…

విండోస్‌ 7 యూజర్ల కోసం…

విండోస్‌ 7 యూజర్ల కోసం ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ (ఐఈ) 10 బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. ఈ సరికొత్త ఐఈ 10 బ్రౌజర్‌ పాత బ్రౌజర్‌ వర్షన్‌లతో పోలిస్తే మెరుగైన బ్రౌజింగ్‌ అనుభూతులను చేరువచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లచే ఉత్తమమైన కంప్యూటింగ్‌ ఆపరేటింగ్‌ సిస్టంగా గుర్తింపు తెచ్చుకున్న విండోస్‌ 7 వినియోగం విషయంలో ఇటీవలే విండోస్‌ ఎక్స్‌పీని అధిగమించింది.

inteaఈ సరికొత్త బ్రౌజర్‌ను విండోస్‌ 8 ఆవిష్కరణ సమయంలో అధికారికంగా ప్రకటించారు. కొత్త వర్షన్‌ ఐఈ10 బ్రౌజర్‌ విండోస్‌7 ఇంకా విండోస్‌8లను మ్త్రామే సపోర్ట్‌ చేస్తుంది. 2009లో విడుదలైన విండోస్‌ 7 ప్రపంచవ్యాప్తంగా 670 మిలియన్ల లైసెన్సులను పొందినట్లు మైక్రోసాఫ్ట్‌ వివేదికలు వెల్లడించాయి. విండోస్‌ 8 ఈ లైసెన్సుల సంఖ్యను అధిగమించడానికి 2014 వరకూ సమయం పడుతుందని సదరు నివేదికలు అంచనా వేస్తున్నాయి. విండోస్‌ 8 ఆధిరితంగా స్పందించే లెటెస్ట్‌ వర్షన్‌ ల్యాప్‌టాప్‌లు, పీసీలు, టాబ్లెట్‌లలో ఐఈ 10 బ్రౌజర్‌ను ముందుగానే లోడ్గ చేయడం జరిగింది. విండోస్‌ 7 యూజర్లు ఐఈ 10 బ్రౌజర్‌ను డౌన్‌లోడ్గ చేసుకుని తదుపరి చర్యగా ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

విండోస్‌ ఫోన్‌ 8 ఆధారితంగా…
లూమియా 920 విండోస్‌ ఫోన్‌ 8 ఆపరేటింగ్‌ సిస్టం. నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌ (ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీ, వైఫై, 8 మెగా పిక్సల్‌ రేర్‌ కెమెరా,(నోకియా ప్యూర్‌ వ్యూ టెక్నాలజీ) 1.3 మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, 4.5 అంగుళాల టచ్‌స్క్రీన్‌, 1 జీబి ర్యామ్‌, 32జీబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మైక్రోయూఎస్బీ పోర్ట్‌, శక్తివంత మైన 2,000ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, క్యఐ వైర్‌లెస్‌ పవర్‌ స్టాండర్డ్‌. లూమియా 920 ఎల్లో, రెడ్గ,వైట్‌, గ్రే, బ్లాక్‌ వంటి వైబ్రెండ్గ కలర్‌ వేరియంట్‌లలో లభ్యం కానుంది. లూమియా 820 4.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే, క్లియర్‌ బ్లాక్‌ టెక్నాలజీ, విండోస్‌ ఫోన్‌ 8 ఆపరేటింగ్‌ సిస్టం, డ్యూయల్‌కోర్‌ స్నాప్‌డ్రాగెన్‌ ఎస్‌4 ప్రాసెసర్‌ 1జీబి ర్యామ్‌, 8.7 మెగా పిక్సల్‌ కెమెరా, 0.3 మెగా పిక్సల్‌ వీజీఏ ఫ్రంట్‌ కెమెరా, రెడ్గ, ఎల్లో, గ్రే, సియాన్‌, పర్పిల్‌, వైట్‌ ఇంకా బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌, 1080 పిక్సల్‌ వీడియో రికార్డింగ్‌, 8 జీబి ఇన్‌బుల్ట్‌ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్‌ ద్వారా 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వైర్‌లెస్‌ చార్జింగ్‌, బ్లూటూత్‌, వైఫై, జీపీఎస్‌ ఉన్నాయి.

హెచ్‌టీసీ 8ఎక్స్‌ విండోస్‌ ఫోన్‌ 8 ఆపరేటింగ్‌ సిస్టం, 4.3 అంగుళాల సూపర్‌ ఎల్‌సీడీ 2 డిస్‌ప్లే, క్వాల్కమ్‌ స్మాప్‌డ్రాగెన్‌ ఎస్‌4 చిప్‌సెట్‌, 1జీబి ర్యామ్‌, 8 మెగా పిక్సల్‌ బీఎస్‌ఐ సెన్సార్‌, హెచ్‌టీసి ఇమ్‌జ్‌ చిప్‌ టెక్నాలజీ, 1080 పిక్సల్‌ హైడెఫినిషన్‌ వీడియో రికార్డింగ్‌ సామర్థ్యం, 2.1 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా, 16జీబి ఇన్‌బుల్ట్‌ స్టోరేజ్‌, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్‌ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, బీట్‌, ఆడియో, ఇక సామ్‌సంగ్‌ ఏటీఐవీఎస్‌ విండోస్‌ ఫోన్‌ 8 8 మెగాపిక్సల్‌ రేర్‌ కెమెరా, 2300ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, విండోస్‌ ఫోన్‌ 8 ఆపరేటింగ్‌ సిస్టం, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్‌, 8.7మిల్లీమీటర్ల మందం, 1.5 గిగాహెర్జ్‌ ప్రాసెసర్‌, 1 జీబి ర్యామ్‌, ఫోన్‌ మెమెరీ 16 జీబి, 32జీబి, స్మాప్‌డ్రాగెన్‌ ఎస్‌4 ప్రాసెసర్‌, 4.8 అంగుళాల సూపర్‌ ఆమోల్డ్‌ టచ్‌ డిస్‌ప్లే, నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌ ఉన్నాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top