You Are Here: Home » సఖి » రుచి » వాహ్‌వా.. ఐస్‌క్రీం వర్శిటీ

వాహ్‌వా.. ఐస్‌క్రీం వర్శిటీ

cookingఏంటి వింటుంటేనే నోరూరిపోతోంది కదూ. అవునండీ ఇది నిజమే. ఐస్‌క్రీం తయారీలో శిక్షణనిచ్చేందుకూ కార్పిగ్యానీ గెలాటో పేరుతో ఓ యూనివర్శిటీ ఉందండోయ్‌. సెంట్రల్‌ ఇటలీలోని బొలొగ్నా సమీపంలో ఉన్నదిది. దీని స్పెషాలిటీ ఏంటంటారా? అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ ఐస్‌క్రీం తయారీలో శిక్షణ పొందుతున్నారు. ఐస్‌ క్రీం సెమినార్లు, కన్సల్టింగ్‌ బుక్స్‌, ఫ్లేవర్‌, ప్రొడక్ట్‌ రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌పై ఇందులో శిక్షణ ఇస్తారు.అంతేకాదండోయ్‌… అన్ని యూనివర్శిటీల్లోలాగే ఇక్కడా ప్రాక్టికల్‌, టెక్నికల్‌ కోర్సులతో పాటు ఐస్‌క్రీం తయారీలో సంప్రదాయ పద్ధతులు, మార్కెటింగ్‌, మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో నిపుణులు తర్ఫీదునిస్తారు. ఒక వారం నుంచి నాలుగు వారాల పాటు కోర్సులను ఆఫర్‌ చేస్తున్న వీరు… గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత పట్టాలు కూడా ఇస్తారట.
ఒక్కొక్కటిగా….

  • icecream ఈ గెలాటో యూనివర్శిటీని ఇటలీలో 1995 సంవత్సరంలో మాల్కోల్మ్‌ స్టోగో అనే వ్యక్తి ప్రారంభించారు.
  • ఈయన 25 ఏళ్ల నుంచి ఐస్‌క్రీం తయారీ బిజినెస్‌లో ఉన్నారు.
  • ఐస్‌క్రీం తయారీపై పరిశోధనలు చేసి ఎన్నో పుస్తకాలు రాశారు. ఇటీవలే ‘ఇన్‌క్రెడిబుల్‌ ఐస్‌క్రీం’ అన్న పుస్తకాన్ని రచించారు.
  • వివిధ రకాల ఫ్లేవర్లతో సంప్రదాయ పద్ధతుల్లో ఐస్‌క్రీం తయారీ ఇక్కడి స్పెషాలిటీ.
  • సెంట్రల్‌ ఇటలీలోని బొలొగ్నా సమీపంలో ఈ వర్శిటీ ఉంది.
  • రస్ప్‌బెర్రీ, హసెల్‌నట్‌, లెమన్‌, ఫెన్నెల్‌, మోర్టాడెల్లా ఫ్లేవర్స్‌ ఇక్కడి స్పెషాలిటీ.
  • ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయంలో 12 వేల మంది శిక్షణ పొందుతున్నారు.
  • చైనా, స్పెయిన్‌, యునైటెడ్‌ స్టేట్స్‌లో వీరి శాఖలున్నాయి. ఇందులో 400 మంది ఉద్యోగులున్నారు.
  • అమెరికా సహా ప్రపంచంలోని అన్ని మూలల నుంచి విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్‌, ఐస్‌క్రీం ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు.
  • ఈ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఇటలీకి గెలాటో టూర్‌ నిర్వహిస్తారు.
  • అన్ని కేటగిరీల్లో ఒక నెల కోర్సుకు 1,138 యూరోలు (ఇండియన్‌ కరెన్సీలో 18 లక్షలు) ఖర్చవుతాయి. దీనికి వ్యాట్‌ అదనం.
  • gelato-univఒక వారం కోర్సుకు రూ.5.50 లక్షలు, రెండు వారాల కోర్సుకు రూ.9.50 లక్షలు తీసుకుంటారు.
  • ఈ కోర్సుల్లో చేరిన వారికి వారే ఉచిత గృహ వసతి కల్పిస్తారు.
  • వచ్చే ఏడాదిలో గెలాటో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
    ఇవన్నీ చదివాక వెంటనే వెళ్లి ఆ యూనివర్శిటీలో చేరిపోవాలనుందా… కనీసం అక్కడికి వెళ్లి ఆ వెరైటీ ఐస్‌క్రీం ఫ్లేవర్లను రుచి చూడాలనైనా అనిపిస్తోంది కదూ. అయితే వెంటనే ఈ వెబ్‌సైట్‌ www.gelatouniversity.com కి లాగిన్‌ అవ్వండి.
  • – నాగసిరి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top