You Are Here: Home » సఖి » వాలుజడ కోసం..!

వాలుజడ కోసం..!

ఆడవారి అందాన్ని మరింతగా పెంచేవాటిలో జుట్టు ఒకటి. వారి జుట్టును వివిధ రకాలుగా అలంకరించుకుంటారు. సాధారణంగా భారతీయ మహిళలు జడ వేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే ప్రాశ్చాత్య సంసృతి పెరిగిపోవడంతో ఇప్పుడు భారతీయ మహిళలు కూడా వివిధ రకాలుగా తమ జుట్టును అలంకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే జుట్టు అలంకరించుకోవాలంటే దాన్ని సంరక్షించుకోవలసిన అవసరం ఉంది. జుట్టు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నపుడే జుట్టు నిగనిగలాడుతుంటుంది. జుట్టు గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు మీకోసం….

longs

  • సాధారణ జుట్టు కంటే రింగుల జుట్టు పెళుసుగా ఉండడంతో పాటు పొడిగా ఉంటుంది. సాధారణ జుట్టు కంటే రింగుల జుట్టు వాతావరణ మార్పులకు వెంటనే ప్రభావితమవుతుంది కాబట్టి రింగుల జుట్టు ఉన్నవారు మరింత శ్రద్ధ తీసుకోవాలి. అందుకనే షాంపూతో వారానికోసారైనా తప్పకుండా తల స్నానం చేయాలి. దానివల్ల జిడ్డులేకుండా ఉంటుంది.
  • మాయిశ్చరైజింగ్‌ షాంపూ అయితే జుట్టుని పొడిగా ఉంచడానికి తోడ్పడుతుంది. వారంలో వీలయినన్ని సార్లు షాంపూతో తలస్నానం చేసినా జుట్టు జిడ్డులేకుండా ఆరోగ్యంగా కనిపిస్తుంది. షాంపూ వాడని రోజుల్లో జుట్టుని వేడినీటితో కడగాలి. దీనివల్ల పోషణ ఇచ్చే సహజనూనె పదార్థాలు కోల్పోకుండా జట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది.
  • స్నానం చేసిన తర్వాత జుట్టుని సహజంగా గాలికి ఆరనివ్వాలి. డ్రయ్యర్‌ను వాడితే జుట్టు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాడకపోవడం ఉత్తమం. జుట్టు మరీ గట్టిగా రింగులు తిరిగిపోకుండా ఉండాలంటే యాంటీ ప్రిజ్‌ సిరమ్‌ని వాడితే సరిపోతుంది. ఈ సిరమ్‌ను జుట్టు కుదళ్లనుంచి రాయాలి. గట్టిగా ఉన్న రింగుల జుట్టుపై మరింత బలప్రయోగం చేయకుండా కొంతవరకూ పొడవు తగ్గించుకుంటే మంచిది.
  • ఆల్కహాల్‌ కలిగి ఉన్న ఉత్పాదనలను వాడడం వల్ల జుట్టు పొడిగా మారుతుంది. అందువల్ల రింగుల జుట్టు ఉన్నవారు ఆల్కహాల్‌ ఉన్న ఉత్పాదనలను వాడకుండా ఉండడం మంచిది. రింగుల జుట్టుని మరింత ఆకర్షణీయంగా మార్చు కోవాలంటే నిపుణుల సహాయం తీసుకోవాలి.
Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top