You Are Here: Home » ఇతర » వారసులోస్తున్నారు యువభారతం

వారసులోస్తున్నారు యువభారతం

దేశ రాజకీయాల్లోకి యువత దూసుకువస్తోంది. అన్ని రంగాలతో పాటే పాలిటిక్స్‌ను ెకరీర్‌గా ఎంచుకుంటున్నారు. కొందరు ఇప్పటిేక శాసనసభ్యులుగా, పార్లమెంట్‌ మెంటర్లుగా బాధ్యతలు నిర్వహిస్తూ మిగతావారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి కొందరు ఇంకో అడుగు ముందుకు వేసి ేకంద్ర మంత్రులుగా, పార్టీ అధ్యక్షులుగా క్రీయాశీల పాత్ర పోషిసున్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లో యువత పాత్ర మరింత పెరిగే సూచనలు కనిపిసున్నారుు. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో(ఆంధ్రప్రదేశ్‌ కాక) చక్రం తిప్పుతున్న యువ నాయకుల గురించి నేటి కలర్స్‌…

soniaసోనియా…
సోనియా గాంధీ అసలు పేరు ఎడ్విజె ఆంటోనియా అల్బినా మైనో.
1946లో ఇటలీ దేశంలోని లూసియానా ప్రాంతంలో డిసెంబర్‌ 9వ తేదీన జన్మించింది.
భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ భార్య. ప్రస్తుతం లోక్‌ సభలో యునైటెడ్‌ ప్రోగ్రెస్సివ్‌ అలయెన్స్‌ అధ్యక్షురాలిగా, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీకి నాయకురాలిగా వ్యవహరిస్తోంది.
ఫోర్బ్‌‌స పత్రిక ఈమెను భారత రాజకీయాల్లో అత్యంత ప్రాబల్యం ఉన్న వ్యక్తిగా మూడో స్థానం, 2004వ సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత శక్తి ఉన్న స్ర్తీగా 6వ స్థానాన్ని కేటాయించింది.
2007వ సంవత్సరం అత్యంత ప్రభావశీల వ్యక్తులలో మొదటి 100 మంది జాబితాలో టైమ్‌ పత్రిక ఆమె పేరును చేర్చింది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

rahulరాహుల్‌ గాంధీ…
రాహుల్‌ గాంధీ 19 జూన్‌ 1970లో జన్మించారు.
అమేథి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
పార్టీలోని యువతపై ఈయన ప్రభావం ఎక్కువగా ఉంది.
పార్టీలో ఈయనకంటూ ఓ బలమైన వర్గం పనిచేస్తోంది.
ప్రధాని, కాంగ్రెస్‌ అధ్యక్ష పదవులను తిరస్కరించి పేరుప్రఖ్యాతలు పొందారు.
ప్రస్తుతం కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

priyankaప్రియాంక…
1972 జనవరి 12న ప్రియాంక జన్మించింది. రాబర్ట్‌ వాద్రాను వివాహం చేసుకుంది.
దేశ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
నానమ్మ ఇందిరాగాంధీ పోలికలు ఎక్కువగా ఉండడంతో ఈమెను క్రీయాశీల రాజకీయాల్లోకి రావాల్సిందిగా పలువురు నేతలు ఎప్పటి నుంచో కోరుతున్నారు.
అయితే ప్రియాంక మాత్రం విన్నపాలను తిరస్కరిస్తూ వస్తోంది.్ట

sharad-pawarశరద్‌ పవార్‌…
1940 డిసెంబర్‌ 12న జన్మించిన రాజీయ వృద్ధుడు.
సోనియా కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు చేప్పట్టడడంతో కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చారు.
మాజీ లోక్‌సభ స్పీకర్‌ సంగ్మాతో కలిసి జాతీయ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు.
మహారాష్టక్రు చెందిన శరద్‌పవార్‌ అనంతరం యుపిఏ కూటమిలో చేరారు.
ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సంక్లిష్ట పరిస్థితుల్లో వ్యూహరచనతో చక్రం తిప్పగల నేర్పరి.

supriyaసుప్రియా సూలే…1969 జూన్‌ 30న జన్మించింది. సదానంద్‌ సూలేను పెళ్లి చేసుకుంది.
2006లో మహరాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికై రాజకీయ అరంగేట్రం చేశారు.
2009లో తండ్రి గతంలో పోటీచేసిన బారమతి స్థానం నుంచి గెలుపొంది పార్లమెంట్‌కు ఎన్నికయింది.
శరద్‌పవార్‌కు ఒక్కగానొక్క కుమార్తెకావడంతో రాబోయే రోజుల్లో ఎన్‌సిపి పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయి.

Karunanidhi11కరుణానిధి…
తంజావూర్‌లోని తిరుక్కువైలో 3 జూన్‌ 1924న జన్మించారు.1969లో సి.ఎన్‌.అన్నాదురై మరణించినప్పటి నుండి నేటి వరకు ద్రవిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడుగా ఉన్నారు. పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు.తమిళనాడుకు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.(1969-71, 1971-74, 1989-91, 1996-2001 మరియు 2006-2011). 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీచేసిన ప్రతి ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించాడు.ప్రస్తుతం యూపిఏ కూటమిలో భాగస్వామిగా ీలకపాత్ర పోషిస్తున్నారు.

stalinస్టాలిన్‌…
2011లో కొలతూర్‌ నుంచి శాసనసభ్యుడిగా గెలుపొంది పార్టీ తరుపున సభా నాయకుడిగా ఎన్నికయ్యారు.భవిష్యత్తు డిఎంకె అధ్యక్షుడు స్టాలినే అంటూ కరుణానిధి ప్రకటించడంతో రాజకీయ ప్రాధాన్యత, బాధ్యత మరింత పెరిగింది.అధ్యక్ష స్థానం విషయంలో సోదరుడు ఆళగిరి నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.భవిష్యత్‌తో డిఎంకె పార్టీలో అత్యంత క్రీయాశీల పాత్ర పోషించే అవకాశాలున్నాయి.

kanimoliకనిమొళి…
1965 జనవరి 5న జన్మించారు. డిఎంకె అధినేత కరుణానిధి ఒక్కగానొక్క కుమార్తె.
కళ, సాహిత్యం, అహేతుకత కోసం డిఎంకె పార్టీకి ఉన్న విభాగానికి ఈమె అధ్యక్షురాలు.
జర్నలిజం, కవితలు రాయడం ద్వారా కరుణానిధికి సాహిత్య వారసురాలుగా పేరుపొందారు.
ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్‌లో డిఎంకెలో పార్టీ నుంచి రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించనున్నారు.

PA-Sangmaపిఎ సంగ్మా…
1947 సెప్టెంబర్‌ 1న మేఘాలయా రాష్ట్రంలో జన్మించారు.
కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్య నాయకుడిగా పనిచేసి స్పీకర్‌గా, మేఘాలయా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సోనియా కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టడంతో బయటికి వచ్చి శరద్‌పవార్‌తో కలిసి ఎన్‌సిపి ఏర్పాటు చేశారు.అదనంతరం ఎన్‌సిపి నుంచి కూడా బయటికివచ్చారు. తాజాగా జరిగిన రాష్టప్రతి ఎన్నికల్లో ప్రణబ్‌కు ప్రత్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.2013లో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీని స్థాపించి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Madhav-Raoమాధవరావ్‌ సింధియా..1945 మార్చి 10న గ్వాలియర్‌ (మహారాష్టల్రో ఉంది)లో జన్మించారు.కాంగ్రెస్‌ పార్టీలో య్రాశీలకంగా పనిచేసి కేంద్ర మంత్రి విధులు నిర్వహించారు. ఇతనికి గ్వాలియర్‌ మహరాజు అనే బిరుదు ఉంది.26 ఏళ్లకే పార్లమెంట్‌కు పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి ఓటమి అంటూ లేకుండా తొమ్మిదిసార్లు విజయం సాధించారు.2001లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.

madavraoజ్యోతిరాధిత్యా సింధియా…1971 జనవరి 1న ముంబయ్‌లో జన్మించారు.తండ్రి మాధవరావ్‌ సింధియా మరణానంతరం రాజకీయాల్లో వచ్చారు.కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపిగా గెలుపొంది కేంద్ర విద్యుత్‌ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు.అదేవిధంగా మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన కూడా ఎంపి రాహుల్‌ గాంధీకి సన్నిహితుడు కావడంతో భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Farooqఫరూక్‌ అబ్దుల్లా…1937 అక్టోబర్‌ 21న జమ్మూ కాశ్మీర్‌లో జన్మించారు.
1981లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
జమ్మూ కాశ్మీర్‌కు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యారు.
తండ్రి మరణాంతరం ఫరూక్‌ సిఎంగా బాధ్యతలు స్వీకరించారు.

omarఒమర్‌ అబ్దుల్లా…1970 మార్చి 10న జుమ్మూ కాశ్మీర్‌లో జన్మించారు.
శ్రీనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి గెలుపొంది కేంద్ర మంత్రిగా పని చేశారు.
2002లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు.
2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.
జమ్మూ కాశ్మీర్‌ రాజకీయాల్లో ఒమర్‌ పాత్ర ఎనలేనిది.

Rajesh-Pilotరాజేశ్‌ పైలెట్‌…
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని వైద్‌పురా గ్రామంలో 1945లో జన్మించారు.కాంగ్రెస్‌ పార్టీలో క్రీయశీల నాయకుడిగా పనిచేసి కేంద్రమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.పేద కుటుంబం నుంచి వచ్చిన ఈయన భారత ఎయిర్‌ ఫోర్స్‌లో పైలెట్‌గా ఉద్యోగం చేశారు. అందుకే రాజేశ్‌ పైలెట్‌ అంటారు.
జాతీయ స్థాయిలో ప్రముఖ నేత ఎదుగుతున్న రాజేశ్‌ పైలెట్‌ 2000లో జైపూర్‌లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు.

బాల్‌థాక్రే…
మరాఠీల ఆరాధ్య దైవం, శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్‌ థాకరే జనవరి 23, 1926న పూనేలో జన్మించాడు.ఐదు దశాబ్దాల పాటు మహారాష్ట్ర రాజకీయాలలో కాకుండా దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన విలక్షణ వ్యక్తి. 2012లో బాల్‌థాక్రే అనారోగ్యంతో మృతిచెందారు.

ఉద్దవ్‌థాక్రే…
1960 జులై 27న జన్మించాడు. శివ సేన రైట్‌ వ్యాండ్‌గా భావించే మరాఠీ స్వ ధర్మ అభిమానుల పార్టీ నిర్వహణ బాధ్యతలు చూసేవారు. శివ సేన పార్టీ పత్రిక అయిన సామ్నాను నిర్వహిస్తూ ఎన్నిక సమయంలో కీలక పాత్ర పోషించేవారు.2002 ముంబయ్‌ ఎన్నికల తరువాత పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. బాల్‌ థాక్రే మృతిచెందడంతో 2013 జనవరిలో శివసేన అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు.

Agatha2అగాధ సంగ్మా…1980 జులై 24న మేఘాలయా రాష్ట్రంలో జన్మించారు.2009లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మేఘాలయా రాష్ట్రంలోని తుర నియోజకవర్గం నుంచి ఎన్‌సిపి పార్టీ లీడర్‌గా పోటీ చేసి గెలుపొందారు.ఇప్పటి వరకు లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థుల్లో అగాధ అతి పిన్నవయస్కురాలిగా రికార్డు సృష్టించారు. అంతేకాదు కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇది కూడా రికార్డే.భవిష్యత్తు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారనడంలో ఆతిశయోక్తి లేదు.

ములాయం సింగ్‌…1939 నవంబర్‌ 22న ఉత్తరప్రదేశ్‌లో జన్మించారు. సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు. ప్రజలు ఈయనను నేతాజీ, భూమిపుత్ర అని సంభోదిస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన యోధుడు. కేంద్రంలోనూ చక్రం తిప్పగల నేర్పరి. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి మూడు పర్యాయాలు పనిచేశారు. ఇప్పుడు ఎంపిగా పోటీ చేసి గెలిచి కేంద్ర రాజకీయాలవైపు మళ్లారు.

akileshఅఖిలేష్‌ యాదవ్‌… :
1973 జులై 1న ఉత్తరప్రదేశ్‌లో జన్మించారు. 2000 సంవత్స రం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎంపిగా బాధ్యతలు నిర్వహించారు. ములాయం లోక్‌సభకు వెళుతూ రాష్ట్ర పగ్గాలు అఖిలేష్‌కు అప్పగించారు. 2012లో ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు అఖిలేష్‌ చుట్టే తిరుగుతుంటాయని విశ్లేషకుల అభిప్రాయం.

sachin-సచిన్‌ పైలెట్‌…
1977 సెప్టెంబర్‌ 7న ఉత్తరప్రదేవ్‌లోని సహరన్‌పూర్‌లో జన్మించారు.తండ్రి మరణాంతరం ఆయన పార్టీ అయిన కాంగ్రెస్‌ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.రాజస్థాన్‌లోని అజ్మీర్‌ నుంచి ఎంపిగా గెలుపొందారు.ప్రస్తుతం కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన ఎంపి రాహుల్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో భవిష్యత్తు రాజకీయాలు ఈయనకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువే.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top