You Are Here: Home » ఇతర » వానొచ్చే వరదొచ్చే…!

వానొచ్చే వరదొచ్చే…!

studeవాన రాకడ, ప్రాణంపోకడ చెప్పలేమంటారు. వానలు పడితే మ్త్రాం నగర వాసుల పరిస్థితి మ్త్రాం అతలాకుతలం అవుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయ మవుతున్నాయి. ఒక మాదిరి వర్షానికే ఇళ్ళలోకి నీరు చేరి నానా అవస్థలు పడుతున్నారు. ఇంటిగోడలు ధారాపాతంగా పడుతున్న వర్షానికి నాని కూలుతుంటే, కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరికొందరు వికలాంగులుగా మిగిలిపోతున్నారు. ఇదిలావుంటే, కరంటు తీగలు తెగి నీళ్ళలో ప్రవహించే విధ్యుత్తువాత పడి మలమలా మాడుతున్నారు. ఈ బాధలు భరించడంలో పెద్దవాళ్ళు, పిల్లలు అనే కాకుండా అనేక మూగజీవాలు కూడా మృత్యువాత పడుతున్నాయి. ఇక మృత్యు కుహరాల్లా నాలాలు (భూ గర్భ కాలువలు) మూతలు లేకుండా పూడుకుపోయి మురికి నీరు వరదలెై పారుతోంది. వాటిలో పడి ఎన్నేళ్ళుగా ఎంతమంది అసువులు పోగొట్టుకుంటున్నారో మనకి తెలియనిది కాదు.

వీటన్నిటికీ కారణాలు: నూటికి 99% మనమే. మనం స్వార్ధంతోనో, అవసరంతోనో చేసే పనుల్లో అతి ముఖ్యమైనది కబ్జా. ఒకనాడు విశాలంగా ఉండి, నీరు యధేచ్ఛగా పారడానికి వీలుండేది. నీరుప్రవహించే నాలాలు కబ్జాచేసి, వాటిని ఆక్రమించుకుంటూ, నివాసాలు ఏర్పరుచుకుంటే, ఇక నీరు ఏ దారిలో ప్రవహిస్తుంది. దాని గమ్యస్థానాన్ని ఎలా చేరుకుంటుంది?! వరదనీరు యధేచ్ఛగా ప్రవహించడానికి నిర్మించిన కాలువలు పూడ్చి, ఇళ్ళు కట్టుకుని దొడ్డిదారిలో పట్టాలు తెచ్చుకుని మనం తిష్టవేస్తే మరి ఆ కాలవగుండా ప్రవహించే మురికి నీరు మనిళ్ళల్లోకి రాక ఎక్కడికి పోతుంది. ఇలా కబ్జా చేసుకుని నివాసం ఉంటున్న వారి ఆరోగ్యాలు కూడా అంతత మ్త్రాంగానే ఉంటున్నాయి. అంటువ్యాధులు ప్రబలిపోయి పిల్లలు, పెద్దలు ఆసుపత్రిపాలౌతున్నారు. దీనికి
ఎవరిని నిందించాలి? ప్రభుత్వాన్నా, ప్రజల్నా!.

మానవ తప్పిదాలు: ఎక్కడపడితే అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు మొన్నటిదాకా ఒక ఊపుఊపాయి. లక్షల మంది ఎగబడి 200, 300, 500 గజాల చొపన వాయిదా పద్దతుల్లో దొరుకుతున్నాయి కదాని కొనేసుకున్నారు. అంతే తప్ప ఆ భూమి దేనికి సంబంధించిందీ, రియాల్టర్‌ ఎటువంటి సదుపాయాలు ఏర్పరుస్తున్నాడు, ఆ భూమి లోతట్టు ప్రాంతమా, లీగల్‌ వ్యవహారాలు సక్రమంగా ఉన్నాయా లేవా అనే ప్రాధమిక పరిశీలనలు చేసుకోకపోడం ఒక తప. నాలాలు మీద ప్రభుత్వయంత్రాంగం ఏర్పరచిన ఇనుప మూతలు దొంగిలించి, అమ్ముకుని ఒక్కపూటకోసం కక్కుర్తి పడే చిల్లర దొంగల స్వార్ధం ఒకపక్కనుంటే, ఆ ఇనుముని చవగ్గా వస్తోంది కదాని కక్కుర్తి పడి కొనే దొంగవ్యాపారులు మరోపక్క ఉంటున్నారు. ఇటువంటి వాళ్ళు చేసే ఈ పనికిమాలిన పనుల వల్ల ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో ఆలోచించండి…

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top