You Are Here: Home » ఇతర » వాణిజ్య వ్యాసాల పట్టు‘గీత’

వాణిజ్య వ్యాసాల పట్టు‘గీత’

వృత్తిని, ప్రవృత్తిని ఒేక తాటిమీద నడపడం అందరి వల్ల అయ్యే పనికాదు. కొందరిేక అది సాధ్యమౌ తుంది. రెండూ వేరు వేరు కోణాల్లో గనక ఉంటే ఆ రెండింటికీ సమాన సమయా న్ని కేటారుుంచడం కుదరదు. ఈనాటి మహిళ అన్నిటికీ అతీతంగా ఎన్నో ఘనవిజయాలు సాధిస్తూ చరిత్ర సృష్టిస్తోందనడంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు. వీటన్నిటితో పాటు ఇంటి బాధ్యతలు నిర్వర్తించడంలో కూడా వీరికి వీరే సాటి అనిపించుకుంటున్నారు. ఇలా రెండు పడవల మీద సునాయాసంగా ప్రయాణించా లంటే అందుకు తగిన కృషి, పట్టుదలతో పాటు ఓర్పు కూడా ఉండాలి. వీటన్నిటినీ నేర్పుతో నిర్వహించాలి. అది సాధ్యమయ్యే పనేనా..అంటే, సాధ్యమే అంటోంది గీతా పిరమల్‌.

125ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా, నవలా రచయిత్రిగా రెండు విభిన్న కోణాల్లో ప్రయాణం చేస్తూ తన సత్తా చాటు కుంటోంది. ఈమె ఒక మీడియా వ్యక్తిగా, స్వేచ్ఛా రచయిత్రిగా, వ్యాపార చరిత్రకారిణిగా, స్మార్ట్‌ మానేజర్‌ పత్రిక సంపాదకురాలిగా, విఐపి ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు డైరక్టర్‌గా కూడా పనిచేస్తూ జాతీయ అంతర్జాతీయ గుర్తింపుని సాధించింది. ఈమె ముంబాయిలోని ప్రముఖ వ్యాపార వేత్త విఐపి సంస్థ అధిపతి దిలీప్‌ పిరమాల్‌ని వివాహమాడింది. 2004 సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన భారతీయ వ్యాపార మహిళగా (మోస్ట్‌ పవర్‌ఫుల్‌ వుమెన్‌ ఇన్‌ ఇండియన్‌ బిజినెస్‌) అవార్డ్‌ పొందింది. 1954లో పుట్టిన గీత, 1989 లో బొంబై యూనివర్శిటీలో హిస్టరీలో ఎంఏ పూర్తిచేసి, బిజినెస్‌ హిష్టరీలో పిహెచ్‌డి పట్టాపొందింది. గీత తన చిన్న తనం అంతా లండన్‌లోనే గడిపింది.

1988 నుండి 1992 వరకూ ఫైనాన్షియల్‌ టైమ్స్‌కి బొంబై ప్రతినిధిగా పనిచేసింది. అలాగే ‘ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌’ (ఐఎస్‌బి)లో హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌గా పనిచేసింది. వీటికి సారధ్యం వహిస్తూనే ఎల్‌బిఎస్‌కి ప్రాంతీయ సలహా సంఘ సభ్యురాలిగా కూడా తనవంతు సేవలందించింది. 2002 నుండి ముంబాయిలోని ‘ది స్మార్ట్‌ మేనేజర్‌’ అనే మేనేజ్‌మెంట్‌ మేగజైన్‌కి కార్యనిర్వాహక సంపాదకురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ది ఫైనాన్షియల్‌ టైమ్స్‌, ది ఎకనామిక్‌ టైమ్స్‌ వంటి ప్రముఖ పత్రికలకి ఎన్నో సంవత్సరాలపాటు ‘కార్పొరేట్‌ సెక్టార్‌’కి సంబంధించిన వ్యాసాలు రాసింది. అంతేకాక ఈమె ‘ది వరల్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైజెస్ట్‌’ ముఖ్య సలహా సంపాదకురాలిగా కూడా తన సేవలందిస్తోంది. మరోపక్క బిబిసి, స్టార్‌ ప్లస్‌ చానెళ్ళలో భారతీయ వాణిజ్యం మీద ఎన్నో టెలివిజన్‌ కార్యక్రమాలు రూపొందించింది.

గీతా పిరమల్‌ రచనలు
gitaeఈమె ఎన్నో రచనలు చేసింది. వ్యాసా లు రాసింది. వాటిలో బిజినెస్‌ మహారా జాస్‌ ఎంతో పాఠకాదరణ పొందడమే కాకుండా అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు పొందింది. ఇందులో భారత దేశంలో ఎనిమిది మంది పారి శ్రామిక వేత్తల వివరాలు, విషయాలు, విశేషా లు పొందుపరిచింది. వారి ఉమ్మడి వ్యాపార లావాదేవీలు బిలియ న్‌ల రూపాయలు దాటిఉన్నాయి. ఈ ఎనిమిది మంది సంస్థలోను సుమారు గా 6 లక్షల 50 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ విధంగా కొన్ని మిలియన్ల జనాభా వీరి మీద ఆధా రపడి ఉంది. 1999లో బిజినెస్‌ లెజండ్స్‌ అనే పుస్తకం కూడా ఈమెకి ఎనలేని గుర్తింపుని అందిం చింది. ఈ పుస్తకంలో జి.డి. బిర్లా, జెఆర్‌డి టాటా, వాల్‌చంద్‌ హీరాచంద్‌, కస్తూరీబాయ్‌ లాల్‌బాయ్‌ ఈ నలు గురు మార్గదర్శకులూ ఎటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవ డానికైనా వెనుకంజ వేయరు. ఆకాలంలోనే వీరు జాతీయ అంతర్జాతీయ వాణిజ్యంలో ఆరితేరినవారు. వీరి పూర్తి వివరాలతో కూడిన ఈ పుస్తకం ఎంతో జనాదరణ పొందింది.

సహ రచయిత్రి సుమంత్రా ఘోషాల్‌తో కలిసి రాసిన ‘మేనేజింగ్‌ రాడికల్‌ చేంజ్‌’ అనే పుస్తకం ఉత్తమ మేనేజ్‌మెంట్‌ పుస్తకంగా ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ అసోషియేషన్‌ బహుమతిని పొందింది. ఈ పుస్తకంలో భారతీయ కంపెనీలు అంతర్జాతీయంగా ఎదగడానికి ఎటువంటి వనరులు ఉండాలి. సమస్యల్ని, సవాళ్ళని సాంకేతిక పరంగా ఏ విధంగా ఎదుర్కోవాలి. అందుకు కంపెనీలు ఏ సిద్ధాంతాల్ని అమలుచేస్తే అనుకున్న అభివృద్ధిని సాధించడం వీలుపడుతుంది అనే అంశాల మీద చేసిన పరిశోధనాత్మక రచన.ఇదే విథంగా సుమంత్రా ఘోషాల్‌తో కలిసి రాసిన మరో పుస్తకం ‘వరల్డ్‌ క్లాస్‌ ఇన్‌ ఇండియా’ కూడా ఇదే బహుమతిని అందు కుంది. ఇందులో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న భారతీయ కంపెనీల కథలు పొందుపరిచారు. కంపెనీలు తమ మేనేజర్ల శక్తి సామర్ధ్యాలు తగిన ప్రోత్సాహంతో ఇనుమడింపచేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయికి చేరుకునే విధానం గురించి చర్చించడం జరిగింది.

gita5ఈ గ్రంధం కుటీర పరిశ్రమల దగ్గర్నుండి అంతర్జాతీయ సంస్థల వరకూ ప్రయివేట్‌, ప్రభుత్వ సంస్థలతో సహా అందరికీ ఉపయోగపడే విధంగా పరిశోధనాత్మకంగా రచింప బడింది. ఇదే కోవలో ఈమె రచించిన బిజినెస్‌ మంత్ర ఎంతో మందికి ఉపయుక్తంగా ఉందంటే ఆ పుస్తకం విలువ ఎటువంటిదో అంచనా వేయవచ్చు. ఇక 2005లో ఈమె రాసిన స్మార్ట్‌ లీడర్‌ షిప్‌ పుస్తకం అత్యధికంగా అమ్ముడుపోయింది. ఇక మార్గరెట్‌ హర్డక్‌తో పాటు కలిసి రాసిన మరో గ్రంధం ‘ఇండియాస్‌ ఇండస్ట్రీయలిస్ట్‌‌స’. ఇది కొన్ని భాగాలుగా ప్రచురింపబడ్డ సుదీర్ఘరచన. ఈమె రచనలు 90% పరిశోధనా త్మకంగా రాసినవే. అందుకే వీటికి ఎనలేని విలువ పెరిగింది. దేశవిదేశాల్లో ఈమె రచనలకి ఎంతో గుర్తింపు రావడానికి ఈమె పరిశోధనలే కీలకం.

ఈనాడు ఎంతోమంది మహిళలు వాణిజ్యరంగంలో అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నారు. ఈమధ్యనే ప్రంపంచ వ్యాపార సంస్థల్లో రెండవ స్థానాన్ని సాధించిన ముంబాయిలోని గీతా పిరమాల్‌ సంస్థ ఫర్నిచర్‌ని 95%వరకూ విక్రయించేసింది. అమెరికాకు చెందిన ఓ సంస్థ కొనుగోలు చేసింది.

గుర్తింపు, గౌరవం
2004 సంవత్సరానికి గాను అత్యంత శక్తివంతమైన 25 మహిళల జాబితాలో ఒకరుగా బిజినెస్‌ టుడే అవార్డ్‌ని సొంతం చేసుకుంది. ఇదే సంవత్సరంలో పూనెలోని నెస్‌ వాడియా కాలేజ్‌ నుండి స్కాలర్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డ్‌ అందుకుంది. ఈమె రచించిన రెండు పుస్తకాలకు ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ అసోషియేషన్‌ ఉత్తమ పుస్తకాలుగా గుర్తించి సన్మానించింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top