You Are Here: Home » ఇతర » వహ్వా.. నెహ్వాల్‌!

వహ్వా.. నెహ్వాల్‌!

ప్రత్యర్థికి ఏ మాత్రం ఛాన్స్‌ ఇవ్వని సైనా ఒలింపిక్స్‌లో రజతం అందుకుంది. భారత్‌ తరపున ముచ్చటగా మూడో పతకాన్ని అందుకుంది. లండన్‌ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల మెరుపులు కొనసాగుతూనే ఉన్నారుు. గగన్‌, విజయ్‌ తెచ్చిన విజయాలను ఆస్వాదిస్తుండగానే సైనా మరో పతకం తెచ్చింది. భారీ అంచనాల తో వెళ్లిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ మహిళల సింగిల్స్‌లో కాంస్యం గెలిచింది. నాలుగేళ్ల క్రితం బీజింగ్‌లో క్వార్టర్స్‌లో ఓడి కన్నీరు పెట్టుకుంది. లండన్‌లో ఆనంద భాష్పాలు రాల్చింది. కొత్త చరిత్ర సృష్టించి యావత్‌ భారతావనిని ఆనందడోలికల్లో ముంచింది. భారత ఒలింపిక్‌ చరిత్రలో మూడు పతకాలు సాధించిన బీజింగ్‌ రికార్డు సమమైంది.

ప్రొఫైల్

పూర్తి పేరు		: సైనా నెహ్వాల్‌
పుట్టిన తేది : 17-03-1990
తండ్రి పేరు : హార్వీర్‌ సింగ్‌ నెహ్వాల్‌
తల్లి పేరు : ఉషా నెహ్వాల్‌
పుట్టిన రాష్ర్టం : హర్యానా

saiinaప్రతిభకు అదృష్టం తోడైంది. మన సైనా పతకం సాధించింది. లండన్‌లో మరోమారు త్రివర్ణం రెపరెపలాడింది. ఒలింపిక్స్‌ మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో హైదరాబాదీ సైనా నెహ్వాల్‌ కాంస్యాన్ని అందుకుంది. దీంతో ఒలింపిక్స్‌లో ముచ్చటగా మూడో పతకం భారత్‌ ఖాతాలో చేరింది. సైనా విజయాలకు ఎప్పుడూ అడ్డుగా ఉండే చైనీయులు అనూహ్యంగా దెబ్బతింది. కాంస్యం కోసం సైనాతో పోటీపడ్డ చైనాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్‌ జిన్‌ వాంగ్‌ ఆధిక్యంలో ఉండగా గాయంతో వైదొలిగింది. మ్యాచ్‌ సాగితే విజయం ఎవరిని వరించేదో తెలియదు గానీ, ఇన్నేళ్లు తాను పడ్డ శ్రమకు పతక రూపంలో ఫలితం దక్కడం సైనాను ఆనందంతో ముంచెత్తింది. ఇప్పటి వరకూ భారత్‌ తరపున ఒలింపిక్‌ పతకాలు సాధించిన ఇద్దరు క్రీడాకారిణుల్లో ఒకరైన కరణం మల్లేశ్వరి, సైనా మన రాష్ట్రానికి చెందినవారే కావడం విశేషం. కాగా బాక్సింగ్‌ మినహా ఇతర విభాగాల్లో భారత ఆటగాళ్లు నిరాశపరిచారు.

పతకం సైనాకే రాసిపెట్టి ఉందేమో…. గతంలో ఇలా తానెప్పుడూ గెలవలేదు. ఒలింపిక్‌ మెడల్‌ తన ఖాతాలో చేరింది. పోటీలో గెలుపొంది.. పోడియంలో జాతీయ పతాకాన్ని చూడాలన్న సైనా కల నెర వేరింది. బ్యాడ్మింటన్‌లో భారత క్రీడాకారిణి పతకం గెలుస్తుందని ఏనాడు ఊహించలేదు. ఎందుకంటే తీవ్రమైన పోటీ ఉంటుంది. ఒలింపిక్స్‌ కోసం చాలా శ్రమించింది. సైనాపై అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ మ్యాచ్‌ సైనాకు అత్యంత కీలకంగా మారింది. మ్యాచ్‌లోకి దిగాక గెలుపు కోసం ప్రయత్నించింది. అదృష్టం కలసి వచ్చింది. చైనా ప్లేయర్‌ జిన్‌కు గాయమైయ్యింది. పోటీ లేకుండా… ఇది నిరాశ కలిగించే అంశమే అయినా సైనాకు అనుకూలంగా మారింది. ఏదైమైనా ఈ పతకం భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహనిస్తుంది.

సైనా నెహ్వాల్‌ విజయాలు
photaసైనా 8 సంవత్సరాల వయస్సులోనే కరాటే బ్రౌన్‌ బెల్ట్‌ సాధించింది. ఆ తరువాత బ్యాడ్మింటన్‌ ప్రాక్టీస్‌ చేసేది. తల్లిదండ్రులు ఇద్దరూ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులే. హర్యానా రాష్ర్ట బ్యాడ్మింటన్‌ ఛాంపియన్లే. తల్లి ఉషా నెహ్వాల్‌ భారత బ్యాడ్మింటన్‌ చర్త్రిలో టాప్‌ ప్లేయర్‌. 2002 సంవత్సరంలో స్టో్పర్ట్‌ బ్రాండ్‌ యునిక్స్‌ బ్యాడ్మింటన్‌ కిట్‌ అందించింది. అక్కడ నుంచే ఆమె విజయాలను అందిపుచ్చుకుంది. 2004లో భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ తరపున ఆడటానికి ఒప్పందం కుదుర్చుకుంది. అండర్‌19 విభాగంలో సైనా నెహ్వాల్‌ నేషనల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తరువాత ఆసియన్‌ శాటిలైట్‌ బ్యాడ్మింటన్‌ టోర్మమెంటులో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2006లో ఫిలిఫైన్స్‌లో జరిగిన బ్యాడ్మింటన్‌ మహామహులతో పోటీపడింది. రెండవ స్థానం సాధించింది. అప్పటి నుండి పోటీ లేకుండగానే సైనా తనదైన శైలిలో దూసుకుపోయింది.

సైనా కేరియర్‌ రికార్డ్‌
2003 చకొస్లేవికియా జూనియర్‌ ఓపెన్‌లో గోల్డ్‌ మెడల్‌, 2004 కామన్‌వెల్త్‌ యూత్‌ గేమ్స్‌లో రజతపతకం, 2005లో ఆసియా శాటిలైట్‌ బ్యాడ్మింటన్‌ టోర్మమెంట్‌లో బంగారు పతకాన్మి, 2006లో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని అందుకుంది. 2006లో జరిగిన ఫిలిఫైన్స్‌ ఓపెన్‌లో బంగారుపతకాన్ని, 2006, ఇండియన్‌ నేషనల్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియ న్‌షిప్‌, 2007లోనూ ఇండియన్‌ నేషనల్‌ బ్యాడ్మిం టన్‌ ఛాంపియన్‌ షిప్‌ను, ఇండియన్‌ నేషనల్‌ గేమ్స్‌లోనూ, 2008 చైనీ తైపీ ఓపెన్‌ గ్రాండ్‌ ఫ్రిక్స్‌ గోల్డ్‌ పోటీలు, బిడబ్యుఎఫ్‌ ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో వరుస గా బంగారు పతకాలను కైవసం చేసుకుంది. 2008 సమ్మర్‌ ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌ వరకూ దూసుకుపోగా, 2008 బిడబ్యుఎఫ్‌ సూపర్‌ సీరీస్‌ మాస్టర్‌ ఫైనల్స్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకుంది. 2009లో ఇండోనేషియాలో జరిగిన సూపర్‌ సీరీస్‌లో బంగారు పతకాన్ని అందుకుంది. అక్కడి నుండి సైనాకు విజయాలు బంగారు పతకాలు అందుకుంటూనే ఉంది.

2012 ఒలింపిక్స్‌లో విజయయాత్ర
గ్రూప్‌ స్టేజ్‌లో జుక్చిట్‌, ఎల్‌ టాన్‌పై విజయం సాధించి, ఫ్రీ క్వార్టర్‌ ఫైనల్స్‌ యాజీ, క్వార్టర్‌ ఫైనల్స్‌లో టిని బయిన్‌పై విజయ పరంపర కొనసాగించింది. సెమీ ఫైనల్స్‌లో మ్త్రాం చైనా క్రీడాకారిణి యాంగ్‌ యహన్‌ చేతిలో పరాభవం ఎదురైయ్యింది. క్యాంస పతకం రేసులో చైనాకు చెందిన యాంగ్‌ జిన్‌ పై విజయం సాధించి భారత్‌ పతాకాన్ని ఎగురవేసింది.

గురువు గోపిచంద్‌ కృషి
5Goaసైనా నెహ్వాల్‌ విజయంలో తెరవెనుక ఆమె గురువు పుల్లెల గోపిచంద్‌ కృషి ఉంది. భారతబ్యాడ్మింటన్‌కు కొత్త ఉత్తేజాన్ని నింపిన వ్యక్తి పుల్లెల గోపిచంద్‌. సాధారణంగా తాను సాధించలేనిదానిని తమ పిల్లల ద్వారా సాధించాలనే తపన తల్లిదండ్రులలో ఉంటుంది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో ఫ్రీ క్వార్టర్‌లోనే గెలిచే సత్తా ఉన్న షట్లర్లను తీర్చి దిద్దాలని నిర్ణయించుకుని హైదరాబాద్‌లో గోపిచంద్‌ అకాడమీని స్థాపించారు. అందులో భాగంగానే సైనాను తీర్చిదిద్దారు. ఆటగాడిగా మిగిలిపోయిన లక్ష్యాలను కోచ్‌లుగా మారి సాధించేవారు చాలా మంది కనిపిస్తారు. గోపీచంద్‌ ఇప్పుడు అదే చేసి చూపించాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top