You Are Here: Home » భవిత » విద్య » వస్తువు ధర, డిమాండ్ మధ్య ఉన్న సంబంధం?

వస్తువు ధర, డిమాండ్ మధ్య ఉన్న సంబంధం?

పేపర్-2: సాంఘిక శాస్త్రం – కంటెంట్

ఉత్పత్తి సంబంధిత మౌలికాంశాలు,
మారకం

1. వీరిలో ఆర్థిక ప్రతినిధులు కానివారు?
1) ఉత్పత్తిదారులు 2) వినియోగదారులు
3) ప్రభుత్వాలు 4) విద్యార్థులు

2. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల పరిధికి లోబడి నియమాలు, చట్టాలు రూపొందించి ప్రజలకు మార్గదర్శనాన్ని చేకూర్చే వ్యవస్థ?
1) పెట్టుబడిదారీ 2) సామ్యవాద
3) ప్రభుత్వం 4) ఏదీ కాదు

3. రాజకీయ నాయకులు విమానయానం చేయడం?
1) అవసరం 2) సౌకర్యం
3) అత్యవసరం 4) విలాసం

4. {పస్తుతం ప్రతి ఒక్కరు సెల్‌ఫోన్ వాడుతున్నారు. ఇది ఒక…?
1) సౌకర్యం 2) విలాసం
3) అవసరం 4) అత్యవసరం

5. వీటిలో విలాసం?
1) దేశ నాయకులు విమానాల్లో ప్రయాణించడం
2) కళాశాల విద్యార్థి మోటార్ సైకిల్ వాడడం
3) పేద ప్రజలకు టీవీ ఉండడం
4) అధికారుల కార్యాలయాల్లో ఎ.సి. ఉండడం

6. వీటిలో సౌకర్య వస్తువుకు ఉదాహరణ?
1) ఫ్యాన్ 2) టీవీ 3) ఫ్రిజ్ 4) పైవన్నీ

7. ఉత్పాదక వస్తువులకు మరొక పేరు?
1) యాంత్రిక వస్తువులు
2) మూలధన వస్తువులు
3) మాధ్యమిక వస్తువులు
4) పబ్లిక్ వస్తువులు

8. ‘మూలధన విలువ’ అంటే?
1) యంత్రాల విలువ
2) భవనాల విలువ
3) మూలధన ఉత్పత్తికి చేసే వ్యయం
4) ముడి పదార్థాల విలువ

9. ‘మూలధనం’ అంటే?
1) వినియోగం కోసం వాడే ద్రవ్యం
2) ఉత్పత్తికి వాడే ద్రవ్యం
3) పెట్టుబడి ద్రవ్యం 4) 2,3

10. వ్యాపార నిర్వహణలో ప్రతి సభ్యుడికీ సమ ప్రాధాన్యం ఉండి, అందరూ సమాన ప్రతిఫలం పొందితే అది ఎలాంటి వ్యవస్థాపనం?
1) జట్టుపని 2) బహుళ విరాజిత రూపం
3) అంతరంగిక వ్యవస్థాపనం 4) పైవన్నీ

11. ఏక యాజమాన్యం లక్షణం?
1) వ్యాపారాన్ని సులువుగా మార్చడం
2) అపరిమిత బాధ్యత
3) ఒక్కడే వ్యాపారాన్ని నిర్వహించడం
4) పైవన్నీ

12. వ్యాపార నిర్వహణలో కొందరు ఇతరులకు లోబడి పని చేస్తూ, ఎవరి కింద పని చేస్తారో వారి ఆదేశాలను పొందుతూ తమ విధులు నిర్వహిస్తే అది?
1) ఉద్యమ దారిత్వం
2) బహుళ విరాజితరూపం
3) అంతరంగిక వ్యవస్థాపనం
4) జట్టుపని

13. ఒక వ్యాపారంలో పెట్టుబడి మాత్రమే పెట్టి ఎలాంటి పనిని చేయనివారు?
1) మౌన యజమానులు
2) మౌన వ్యవస్థాపకులు
3) మౌన భాగస్వాములు
4) క్రియాశీలక భాగస్వాములు

14. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోని సభ్యుల సంఖ్య ఎంతకు మించరాదు?
1) 100 2) 75 3) 50 4) అపరిమితం

15. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లక్షణం?
1) కుటుంబాల వ్యాపార నిర్వహణ
2) పరిమిత భాగస్వామ్యం
3) వాటాలను స్వేచ్ఛగా అమ్మడానికి వీలుండదు
4) అపరిమిత భాగస్వామ్యం

16. పెట్టుబడిని వాటాలుగా విభజించి వాటిని ఎంపిక చేసిన ఏదో కొద్దిమందికి లేదా ప్రజలకు అమ్మి, ఆ ధనంతో వ్యాపార వ్యవస్థను నిర్వహించడాన్ని ఏమంటారు?
1) భాగస్వామ్యం
2) ఏక యాజమాన్యం
3) పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ
4) జాయింట్ స్టాక్ కంపెనీ

17. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో సభ్యుడు తన వాటాలను బదిలీ చేయడానికి?
1) డెరైక్టర్ల బోర్డు అనుమతి కావాలి
2) పూర్తి స్వేచ్ఛ ఉంటుంది
3) మిగిలిన భాగస్వాముల అనుమతి కావాలి 4) అవకాశం లేదు

18. సహకార సంస్థల ముఖ్య సిద్ధాంతం?
1) {పజా సంక్షేమం
2) అందరి కోసం తాము, తమ కోసం అందరూ
3) వాటాలను ప్రోత్సహించడం
4) లాభార్జన

19. వస్తు, సేవల ధరలను నిర్ణయించేది?
1) ఉత్పత్తిదారుడు 2)వినియోగదారుడు
3) వర్తకులు 4) పై అందరూ

20. వస్తువు ధర తగ్గి మిగిలిన అంశాలు నిలకడగా ఉన్నప్పుడు ఆ వస్తువు డిమాండ్?
1) తగ్గుతుంది 2) పెరుగుతుంది
3) మార్పు ఉండదు 4) సంబంధం లేదు

21. వస్తు మార్పిడి పద్ధతిలో ఒక వస్తువును ఇతర వస్తువులతో మార్పిడి చేయడానికి దేని ఆధారంగా నిర్ణయించేవారు?
1) వస్తువును ఉత్పత్తి చేయడానికి పట్టే వ్యవధి
2) వస్తువును ఉత్పత్తి చేయడానికి అయ్యే శ్రమ
3) మార్పిడి చేయాల్సిన వస్తువుల ఉపయోగాన్ని బట్టి 4) 1, 2

22. అర్థశాస్త్ర రీత్యా వస్తువుకున్న డిమాండ్ అంటే?
1) ఆ వస్తువును కోరుకునే వ్యక్తుల సంఖ్య
2) వ్యక్తుల కొనుగోలు శక్తి
3) కొనాలనే ఆసక్తితో పాటు కొనుగోలు శక్తి పరిమాణం
4) అమ్మకానికి అందుబాటులో ఉన్న వస్తు పరిమాణం

23. ఒక వస్తువు లేదా సేవకు డిమాండ్‌ను నిర్ణయించడంలో ఉపయోగపడే ఆర్థిక కారకం?
1) అభిరుచులు, వస్తువు ధర
2) ఆదాయ స్థాయి
3) ప్రత్యామ్నాయ వస్తువుల లభ్యత
4) పైవన్నీ

24. వైయక్తిక డిమాండ్ అంటే?
1) మార్కెట్ డిమాండ్
2) దేశం మొత్తం డిమాండ్
3) ఒక వ్యక్తి వస్తువుపై చేసే వ్యక్తిగత డిమాండ్
4) ఒక వస్తువుకు ఒక ప్రాంతంలో ఉండే డిమాండ్

25. డిమాండ్ వక్రరేఖను గీయడానికి x అక్షంపై డిమాండ్, y అక్షంపై ధరను సూచిస్తే (150, 85) అనే బిందువు దేన్ని సూచిస్తుంది?
1) రూ. 85 ధర వద్ద డిమాండ్ 150
2) రూ. 150 వద్ద డిమాండ్ రూ.85
3) వస్తువు ధర రూ. 150 నుంచి రూ. 85కి తగ్గింది
4) వస్తువు డిమాండ్ పరిమాణం రూ.150 నుంచి రూ. 85కి తగ్గింది

26. వస్తువు ధర, డిమాండ్ మధ్య ఉన్న సంబంధం?
1) అనులోమ 2) విలోమ
3) సంబంధం ఉండదు 4) ఏదీ కాదు

27. వస్తువుల సరఫరా (సప్లై) అంటే?
1) వస్తువుల ఉత్పత్తి మొత్తం
2) వినియోగదారుడు కొన్న వస్తు పరిమాణం
3) అమ్మకం దారుని వద్ద ఉన్న వస్తు పరిమాణం
4) మార్కెట్‌లో వినియోగదారుడికి అమ్మజూపిన వస్తు పరిమాణం

సమాధానాలు
1) 4 2) 3 3) 1 4) 3 5) 2
6) 4 7) 2 8) 3 9) 4 10) 1
11) 4 12) 2 13) 3 14) 3 15) 4
16) 4 17) 2 18) 2 19) 4 20) 2
21) 4 22) 3 23) 4 24) 3 25) 1
26) 2 27) 4

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top