You Are Here: Home » ఇతర » వర్షాకాలం ఆహారం

వర్షాకాలం ఆహారం

శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. వానాకాలం వచ్చే వర్షాలు, కలుషిత నీటివల్ల తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీల బారిన పడే అవకాశం ఉంది. వీటన్నింటి నుండి తప్పించు కోవాలంటే రోజూ తినే ఆహార పదార్థాల ద్వారానే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. సరెైన ఆహాహాన్ని తీసుకుంటే ఈ సమస్యను తేలికగా అధిగమించ వచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సరెైన పోషకాహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్‌, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

విటమిన్లు:
Rainవిటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల వెైరస్‌పెై పోరాడి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. టమాట, బంగాళ దుంప వంటి కూరగాయల్లో, నారింజ, నిమ్మ, కమలా, కివి పండ్లలో విటమిన్‌ సి ఉం టుంది.

జింక్‌:
శరీరం కోల్పోయిన యాంటీ బాడీ కణాలు తిరిగి పునఃనిర్మితం కావడంలో తోడ్పడు తుంది. గుడ్లు, మాసం, పెరుగు, పాలు, బీన్స్‌, సీఫుడ్‌లలో జింక్‌ లభిస్తుంది.

పెరుగు:
ప్రతిరోజూ ఒక కప్పు తాజా పెరుగును తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బాక్టీ రియాను నిర్మూలిస్తుంది.

కెరోటిన్‌‌‌:
ప్రతిరోజు అరకప్పు తాజా క్యారెట్‌ను తినాలి. దీనిలో ఉండే బీటా కెరోటిన్‌, విటమిన్‌ బి6లు యాంటీ బాడీ కణాలు ఉత్పత్తిని ఉత్తేజపరుస్తాయి.

వెల్లుల్లి:
Garlicదీనిలో ఉండే మినరల్స్‌ బాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌లపెై పోరాడేలా చేస్తాయి. ప్రతిరోజూ ఆహారంలో ఒక స్పూన్‌ వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

ఐరన్‌:
రోజూ నాలుగు లేదా ఐదు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరంలో సరిపడా ఐరన్‌ పెరుగుతుంది.

పొటాషియం:
దీనిలో విటమిన్‌ సి, పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. దీని వల్ల అధిక రక్తపోటుని తగ్గించి శక్తిని పెంచుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top