You Are Here: Home » చిన్నారి » వర్షం పడడానికి ముందు చెమట పడుతుంది… ఎందుకు?

వర్షం పడడానికి ముందు చెమట పడుతుంది… ఎందుకు?

వర్షాన్ని చూడడానికీ, వర్షంలో తడవడానికీ చాలా మంది ఉత్సాహం చూపిస్తారు. కానీ వర్షం పడే ముందు మాత్రం అంత హాయిగా ఉండదు. ఏదైనా పనిలో ఉంటే చెమటపోస్తూ చిరాగ్గా అనిపిస్తుంది. అందుకు కారణం ఉంది. వాతావరణం వేడిగా ఉన్నపుడు చెమట ఆవిరైపోతుంటుంది.

ఆ సమయంలో శరీరం నుంచి వేడిమిని గ్రహించి చెమట ఆవిరవుతుంది కాబట్టి మనకూ ఉపశమనంగా ఉంటుంది. కానీ వర్షం పడే ముందు మబ్బులు పట్టి, గాలిలో తేమ ఉండడం వల్ల చెమట ఆవిరి కాదు. అందువల్లే చర్మంపైనే ఉండిపోయి ఉక్కగా, చిరాకుగా అనిపిస్తుంది. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పటి కంటే, మేఘాలు ఉన్నపుడు వాతావరణం వేడిగా ఉంటుంది. కారణం భూమి నుంచి ఉష్ణం వాతావరణంలోకి వెళ్లకుండా మేఘాలు అడ్డుకుంటాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top