You Are Here: Home » యాత్ర » తీర్ధ యాత్రలు » వరాలిచ్చే వైకుంఠనాథుడు

వరాలిచ్చే వైకుంఠనాథుడు

వరాలిచ్చే వైకుంఠనాథుడు

 

nathudu3కలియుగ వైకుంఠధాముడు క్రౌంచగిరి పర్వత శ్రేణుల్లో కొలువు దీరి భక్తుల కొంగుబంగారమై పూజలందుకుంటున్నాడు. చిన్నా, పెద్దా అనే తారతమ్యం లేకుండా అందరినీ తన కొండకు రప్పించుకుని వారి కోర్కెలను ఇట్టే నెరవేరస్తున్నాడు ఈ వెంకటేశ్వరుడు. గుంటూరు జిల్లా అమరావతి మండల ేకంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో క్రౌంచగిరి పర్వతాలుగా పిలువబడే ఈ వైకుంఠపురం గ్రామ కొండ శిఖరంలో స్వామి కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఎగుడుదిగుడుగా ఉండే మెట్లనే ఆధారం చేసుకుని వెళితేనే స్వామి దర్శన భాగ్యం. సుమారు రెండు వందల మెట్లతో ఉన్న ఈ కొండ పై భాగానికి ేకవలం 15 నిముషాల్లో చేరుకోవచ్చు.

స్వామి కొండకు పడమర భాగంలో కృష్ణా నది ఉత్తర వాహనిగా ప్రవిహస్తోంది. అమరావతి నుంచి కృష్ణమ్మ రెండు పాయలుగా చీలి ఒక పాయ ఈ కొండకు వెనుక భాగం నుంచి అంటే ఉత్తర దిశగా సుమారు కిలోమీటరు దూరం ప్రయాణించి మళ్లీ తూర్పు దిక్కునకు మరలుతుంది. కొండకు పై నుంచి సుమారు 15 కిలోమీటర్ల మేర నాలుగు దిశలు కనిపిస్తారుు. అద్భుతమైన ఈ సుందర దృశ్యం భక్తులను కనువిందు చేస్తుంది. కొండ పై నుంచి చూస్తే నదిలో ఇసుకపాయలు, కృష్ణమ్మ నీటి హొయలు.. అబ్బో అద్భుతమైన సుందర దృశ్యం ఇక్కడ ఆవిష్కృతమౌతుంది. మనస్సు కట్టిపడవేస్తుంది.
స్థలపురాణం
nathudu2సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మహారాజుకు వెంకటేశ్వర స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి తాను కొండపై కొలువుదీరి ఉన్న విషయాన్ని చెప్పారట. దీంతో రాజు స్వామి కొండను గ్రహించి అక్కడ స్వామికి విగ్రహాన్ని తయారు చేయించాలని నిర్ణయిం చారట. ఓ శిలను ఇందుకోసం శిల్పి తయారు చేస్తుంటే ఆ ఉలి దెబ్బలకు శిల నుంచి రక్తం ధారలుగా కారిందని, అనంతరం స్వామి ప్రత్యక్షమై ఈ కొండపై తనకు విగ్రహ రూపం వద్దని, సాలగ్రామ రూపంలోనే దర్శనమిస్తానంటూ సెలవిచ్చారట. దీంతో నేటికీ ఇక్కడ స్వామి అదే సాలగ్రామ రూపుడై భక్తులకు దర్శనమిస్తూ అందరినీ అనుగ్రహిస్తు న్నాడు. గొప్ప మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ఈ ప్రదేశాన్ని ఈ ప్రాంత వాసులు చెప్పుకుంటారు.

పర్యాటక కేంద్రంగా మార్చాలి
ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మారిస్తే ఎంతో బావుంటుంది. కొండకు అన్నివైపులా సుందరమైన దృశ్యాలుండటం వల్ల కొండపై విశాలమైన ప్రాంతం ఉండటం వల్ల అభివృద్ధి చేస్తే మరింత మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేవలం మంచినీటి సదుపాయం మాత్రం స్ధానిక గ్రామస్తులు, అధికారులు ఏర్పాటు చేశారు. కొద్దిపాటి షెల్టరు మాత్రమే కొండపై ఉండటం వల్ల ఎండ, వానల నుంచి రక్షణ కొంచెం కష్టతరంగా ఉంటోంది. దేవాలయం ఉదయం తెరిచింది మొదలు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఇక సాయంత్రం స్వామికి సేవలు అర్చక స్వామి చేయరు.

nathuduదేవతలు, యక్షులు వంటి వారు ఈ కొండకు వేంచేసి సాయంత్రం స్వామిని సేవిస్తారని పురాణ కథనం. అందువల్ల కొండపై నుంచి మధ్యాహ్నం అర్చకస్వామి వచ్చేస్తే మళ్లీ మరునాటి ఉదయమే ఎవ్వరైనా పైకి వెళ్లేది. కొండపై పాములు, తేళ్లు విరివిగా సంచరిస్తుంటాయి. భక్తులను చూస్తే అవే పక్కకు వెళతాయని ఇక్కడి వాసుల విశ్వాసం. మొత్తం మీద విశాఖపట్టణంలోని కైలాసగిరి తరహాలో ఈ ప్రాంతాన్ని తయారు చేస్తే మరో వైకుంఠగిరిగా ప్రసిద్ధి కెక్కుతుంది.

ఇలా వెళ్లాలి…
విజయవాడ నుంచి అమరావతి వెళ్లే బస్సులో గంట పాటు ప్రయాణిస్తే ఈ వైకుంఠపురానికి చేరుకోవచ్చు. అలాగే గుంటూరు నుంచి అయితే అమరావతి వచ్చి అక్కడి నుంచి విజయవాడ వెళ్లే బస్సులో వెళితే కొండకు చేరుకోవచ్చు. రైలు మార్గంలోనైతే గుంటూరు, విజయవాడల మీదుగా ఇక్కడకు చేరుకోవచ్చు. జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాన్ని అందరూ సందర్శించాల్సిందే.

ఓ శిలను ఇందుకోసం శిల్పి తయారు చేస్తుంటే ఆ ఉలి దెబ్బలకు శిల నుంచి రక్తం ధారలుగా కారిందని, అనంతరం స్వామి ప్రత్యక్షమై ఈ కొండపై తనకు విగ్రహ రూపం వద్దని, సాలగ్రామ రూపంలోనే దర్శనమిస్తానంటూ సెలవిచ్చారట. దీంతో నేటికీ ఇక్కడ స్వామి అదే సాలగ్రామ రూపుడై భక్తులకు దర్శనమిస్తూ అందరినీ అనుగ్రహిస్తున్నాడు.

ఉత్సవాలు ఇలా…
nathudu0ప్రతి సంవత్సరం ముక్కోటి, ధనుర్మాస ఉత్సవాలతోపాటు, శ్రీరామనవమి, దసరా, అధ్యయనోత్సవాలను నిర్వహిస్తామని ఆలయ అర్చకులు కోసూరి భావ నారాయణాచార్యులు తెలియచేశారు. తన తాత ముత్తాతలు 13 తరాల వారు ఈ స్వామికి సేవలందించారని, అదే పరంపరను తాను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ స్వామికి సేవలందించేందుకు పెద్ద సంఖ్యలో మాగాణీ పొలాలు ఉన్నాయి. వాటిపై వచ్చే ఆదాయంతో ప్రతి సంవత్సరం సేవలందిస్తుంటారు.

ఉత్తర వాహినిగా కృష్ణమ్మ
కృష్ణమ్మ తన ప్రవాహంలో ఎక్కడా ఉత్తర వాహినిగా ప్రవహించదని, ఒక్క ఈ వైకుంఠపురం గ్రామంలో మాత్రమే కొండ వెనుక భాగంలో ప్రవహిస్తూ అందరినీ తరింప చేస్తోందని చెబుతారు. ఈ నదిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని చెబుతున్నారు వారు. ఒకానొక సమయంలో అన్నా, చెల్లెలు చిన్నప్పుడు విడిపోయి పెరిగి పెద్దయి పొరపాటున వివాహం చేసుకున్నారని, ఆ దోష నివృత్తి కోసం వైకుంఠపురంలో కొండపై కొలువున్న స్వామి వద్దకు వచ్చి పక్కనే ప్రవహిస్తున్న నదిలో స్నానం చేసి దోష నివృత్తి చేసుకున్నారని చరిత్ర చెబుతోంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top