You Are Here: Home » చిన్నారి » కథలు » వజ్రాల హారం

వజ్రాల హారం

ఒకనాటి సాయంత్రం మటిల్డా లూయీ ఒక్కతే తన ఇంట్లో చాలా దిగాలుగా కూర్చుంది. మటిల్డ లూయీ చాల అందమైన అమ్మాయి, కాని భగవంతుని చిత్రం ఆ అమ్మాయి చాల పేదరికం లో పుట్టింది. ఏ ధనవంతుల ఇంట్లో పుట్టి ఉంటె మటిల్డ లూయీ అందం ఆ నగరం అంత తెలిసేది మంచి మంచి నగలు, కళ్ళు చేదేరే బట్టలతో , పాలరాతి భవనాలలో ఉన్నట్లు అయితే ఆమె అందం అందరికి అసూయ నిచ్చేదేమో . దానికి విరుద్ధంగా చాల పేదరికం లో పుట్టటం తో విరిగిన కుర్చీలు, చినిగిన దుస్తులు తో ఉన్న ఇంట్లో పెరిగి, మంచి ధనవంతుని చేసుకొని తన జీవిత కోరికలను తీర్చు కోవాలని , భాగ్యవంతుల అమ్మాయిల మాదిరి కలలు గని , వాళ్లతో వంతు పెట్టుకొనే గతిలేక , ఒక విద్యాశాఖ కార్యాలయం లోని చిరు గుమస్తాను పెళ్ళాడి , విచ్చల విడిగా ఖర్చు పెట్టటానికి కావలసిన నగలు , బట్టలు కొనే తాహతు లేక నిరాశగా జీవితాని వెళ్లదీస్తున్నది . తనకు స్నేహితులైన ఇద్దరు ముగ్గురు ఇళ్ళకి కూడా వెళ్ళటం మానుకున్నది వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ ఐశ్వర్యం చూసి , మళ్లీ ఇంటికొచ్చి పాత జీవితాన్ని చూసుకుంటే జరిగే భాధ కన్న అసలు పోకుండా ఉంటె ఉత్తమం అనుకున్నది

ఆమె తన జీవితాన్ని తలచుకొని అలా భాధ పడుతున్నా సమయం లోనే ఆమె భర్త లూయీ పని ముగుంచుకొని ఇంటికొచ్చాడు. ఆనందం తో తన భార్య కు ఒక పెద్ద కవర్ ఇచ్చాడు. ఆ కవర్ తెరిచి లోపల ఉన్న కార్డు ని చూసి నిరాశగా ఎదురుకుండా ఉన్న భోజన టేబుల్ మీద కు గిరాటు వేసింది. అది చూసి లూయీ హతాశుడై “అదేమిటి మటిల్డ నువ్వెంతో ఆనందిస్తావు అనుకున్నాను అటువంటిది, అలా నిరాశగా వున్నావేమిటి? అన్నాడు. అది ఒక పెద్ద డిన్నర్ పార్టీ కి లూయీ పనిచేసే విద్యశాఖ అధికారులకు సంభందించిన ఆహ్వానము. ఆ నగరం లోని ధనికులకు, పెద్ద పెద్ద అధికారులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం. అతి కొద్ది మంది కి మాత్రమె ఆ ఆహ్వానం అందింది. చిన్న గుమస్తా అయిన లూయీ అతికష్టం మీద తెలిసిన వారిని అడిగి తన భార్య కోసం ఒక ఆహ్వానం సంపాదించాడు . అటువంటిది గిరాటు వేసేసరికి భాధ పడ్డ లూయీ కారణమేంటో అడిగాడు.
అప్పుడు మటిల్డ కోపంతో , ఎర్రటి కళ్ళతో వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టింది.. దాంతో ఒక్క సారి ఉలిక్కిపడ్డ లూయీ గాభారతో “ఏమైంది ఏమైంది ” అని ఆత్రంగ అడిగాడు. నెమ్మది గ కళ్ళు తుడుచుకుంటూ ” నాకూ వేసుకోటానికి ఒక మంచి బట్ట కూడా లేదు. ఆ ధనవంతుల మధ్య కు ఇలా పేద దానిలాగా రావటం నాకూ ఇష్టం లేదు, అందుకని ఆ ఆహ్వానం ఎవరికైనా ధనవంతుల కివ్వండి , వాళ్ళు అయిన వెళతారు” అంది. దానికి లూయీ ” నీకు నీ పుట్టిన రోజుకు కొన్న దుస్తులు వేసుకో , ఆ గౌను చాల అందం గ ఉంది “. కాని మటిల్డ తన దుఖాన్ని ఆపక “ఈ పాత గౌను తో రావటం కన్న నేను అసలు పార్టీ కే రాను అన్నది”. భార్య పడుతున్నా భాధ ను చూసి లూయీ ” నా దగ్గర ఉన్న డబ్బు తో నీకు కావలసిన గౌన్ కొనుక్కో, ” అన్నాడు. కాని ఆ డబ్బుతో తను కట్టు కుందామనుకున్న కొత్త ఇంటికి బయాన ఇవ్వలనుకున్నాడు. అమితంగా భార్యను ప్రేమించే లూయీ , ఇంటి ని త్యాగం చేసి భార్య గౌను కోసం తన దగ్గర ఉన్న 800 ఫ్రాన్క్స్ఇచ్చాడు. ఆ మరునాడే నీలం రంగు తో తళ తళ చమ్కీలతో మెరిసే గౌను కొని రాబోయే పార్టీ ని తలుచుకుంటూ ఆనందం లో తెలియాడుతున్నది.మటిల్డ.
ఆ రోజు రానే వచ్చింది. ఆనందంతో తన అందానికి తగ్గ అలంకరణ చేసుకుంది . లూయీ మంచి సూట్ ధరించాడు. అసలే అందమైన అమ్మాయీ , దానికి తోడూ బంగారు రంగు జుట్టు , తెల్లని శరీరం, నీలం కళ్ళతో , కొత్తగ కొన్న నీలం రంగు గౌను తో దేవకన్యలాగా మెర్సిపోతున్నది మటిల్డ .చక్కటి భార్య ను, ఆ భార్య మొహం లో ఆనందం చూసి మనసు లోనే సంతోష పడ్తున్నాడు లూయీ.. ఆమె ఆనందం ఎంతో సేపు నిలవలేదు. బోసిగా ఉన్న తన మెడను చూసి , తన బీదతనం గుర్తుకు వచ్చి చిన్న బుచ్చుకొని కూర్చుంది . అది గమనించి లూయీ “ఏమైంది” అని అడిగాడు. “తన మెడ బోసిగా ఉంది అక్కడకు వచ్చే ధనవంతుల స్త్రీలు వజ్రాలు, బంగారం తో వస్తారు, వాళ్ళమధ్య తను బీదరికం తో ఉండలేను ” అన్నది మటిల్డ . హటాత్తుగా , లూయీ మెదడులో ఒక ఆలోచన వచ్చింది. మటిల్డ తో ” నీ స్నేహితురాలు ఫోరేస్టే పక్క వీధి లో ఉంది కదా. ఆమె దగ్గర తప్పకుండ వజ్రాల హారం ఉంటుంది. ఈరోజుకి ఉపయోగించుకొని రేపు ఆమెకు ఇవ్వవచ్చు” అన్నాడు. లూయీ ఆలోచన అమితంగా నచ్చిన మటిల్డ , పక్క వీధిలో ఉన్న తన స్నేహితురాలు ఫోరేస్టే , ఇంటికి వెళ్లి , సంగతంతా చెప్పి ఆమె వజ్రాల హారం ఇవ్వమని అడిగింది. దానికి సంతోషంగా తన స్నేహితురాలికి వజ్రాల హారం ఉన్న పెట్టెను ఇచ్చింది ఫోరేస్టే అది తీసుకొని ఇంటికి వచ్చి, భార్య భర్తలిద్దరూ ఆనందం గ పార్టీ కి వెళ్లారు. ధఘ దఘ ల కాంతులు , సువాసనలు వెదజల్లే పరిమాలు , బంగారు కాంతులతో మెరిసే బట్టలతో ఉన్న స్త్రీలు ఆ సాయంత్రం ప్రపంచాన్ని మర్చిపోయి ఆనందించింది మటిల్డ.

చలి పులి నగరాన్ని కప్పేసింది. మరునాడు ఉద్యోగాని కి వెళ్ళాలని పార్టీ అవగానే తొందరగా ఇంటికి వెళ్ళాలని వడి వడి గ ఆ పార్టీ జరిగిన హోటల్ మెట్లు దిగుతూ టాక్సీ కోసం ప్రయత్నించాడు లూయీ. చలి భయం తో ఇంటికి పోవాలనే తొందరతో. ఏ టాక్సీ వాళ్ళు రాలేదు. ఆ చలికి తన చలి కోట్ ని భుజం నిండుగా కప్పుకొని కంఠం కి ఉన్న వజ్రాల హారం చూసుకుంది మటిల్డ. చివరకి ఒక టాక్సీ దొరికి బ్రతుకు జీవుడా అని ఇంటికి వచ్చారు భార్య భర్తలిద్దరూ. ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుంటూ ఆ పార్టీ సంగతులు చెప్పుకుంటూ వున్నసమయంలో, తన చలి కోట్ విప్పుతూ కెవ్వున కేక వేసింది మిటిల్డా. “ఏమయింది ” అన్నాడు లూయీ. ” నా వజ్రాల హారం కనబట్టం లేదు ” అని అరుస్తూ తన కోట్, విప్పేసిన బట్టలు , దుప్పట్లు, దిళ్ళు అన్ని వెతకసాగింది మిటిల్డా. ” పార్టీ ఆయీ మెట్లు దిగుతున్నప్ప్దుడు ఉన్నదా?” అని అడిగాడు లూయీ. దానికి మిటిల్డా” టాక్సీ లో ఎక్కేటప్పుడు కూడా ఉన్నది”, అని ఏడుస్తూ చెప్తున్నది. అది విని లూయీ “తప్పకుండ ఇది టాక్సీ లోనో లేక దారి లో నో పడిఉంటుంది. నేను వెళ్లి వెతికి వస్తాను” అని ,విప్పేసిన బట్టలు మళ్లీ వేసుకొని వెతకటానికి వెళ్ళాడు బయటికి. దిగాలు పడి భర్త కోసం ఎదురుచూస్తూ సోఫా లో కూలపడింది మటిల్డ.

రెండు గంటల తరువాత ఇంటికి దిగాలు గ వచ్చాడు లూయీ . ఎక్కడ దొరకలేదని దిగులుగా చెప్పాడు . ఏమి చేయాలో తెలియక , భార్య భర్త లిద్దరూ రేపు ఫోరేస్టే కి ఏమి సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నారు. చివరికి లూయీ భార్య కి ఒక సలహా ఇచ్చాడు. ” ఆ హారం కి కొక్కెం వదులు అయింది, రేపు బాగు చేయించి ఇస్తానని ” చెప్పమన్నాడు. ఈ కాస్త సమయం లో ఎట్లాగయిన వెతికి ఇవ్వచ్చు అనే ఉద్దేశం తో. ఆ సంగతే ఫోరేస్టే కి చెప్పింది మటిల్డ. “నాకూ ఆ హారం తో పని ఉన్నది, దయచేసి తొందరగా ఇవ్వమని” చెప్పింది ఫోరేస్టే. ఆ రోజే పోలీసు రిపోర్ట్, టీవీ, పేపర్స్ లో ప్రకటన వేయించాడు లూయీ. ఎవరు తెస్తారో వారికి బహుమతి కూడా ప్రకటించాడు. ప్రకటన చేసి అప్పటికి పది రోజులు అయింది, కాని ఏ ప్రక్కనించి శుభవార్త రాలేదు. ఏమి చేయాలో తోచక, ఎట్టి పరిస్థితిల్లో అయిన ఆ వజ్రాల హారం ఫోరేస్టే కి ఇవ్వాలి అని నిశ్చయించుకున్నారు లూయీ, మటిల్డ లిద్దరూ . ఆ మరునాడే తమ దగ్గర ఉన్న వజ్రాల హారం పెట్టెలో చిరునామా చూసి ఆ దుకాణం కి వెళ్లి ఇటువంటి వజ్రాలు గురించి అడిగారు . అటువంటివి తమ దగ్గర లేవన్న ఆ దుకాణం యజమాని మాటలకు హతాశులై ఆ నగరం లో ఉన్న అన్ని దుకాణాలు తిరిగి , ఎక్కడ లేదని తెలిసి నిరాశ చెందుతున్న సమయం లో ఒక దుకాణం లో వీళ్ళ కు కావలసిన వజ్రాలు దొరికినై. ఆ వజ్రాల హారం అచ్చంగా తము పొగుట్టిన ఫోరేస్టే హారం లాగ వుంది. ఫోరేస్టే కూడా అది ఇంకో హారం అని గుర్తించలేదు. అందుకని మటిల్డ సంతోషం తో అది కొంటామని దాని ధర అడిగింది. ” దీని ధర 40 000, ఫ్రాన్క్స్” అని చెప్పాడు దుకాణం యజమాని . ఆ ధర కు గుండె గుభిల్లుమన్న మటిల్డ తమాయించుకొని బేరం ఆడటం మొదలు పెట్టింది. చివరకు ఆ దుకాణం యజమాని 35,000 ఫ్రాన్క్స్ కు ఒప్పుకున్నాడు. మటిల్డ , లూయీ లు ఆ షాపు యజమానిని బ్రతిమిలాడి ఒక వారం రోజులలో డబ్బు మొత్తం ఇస్తాము , అప్పటిదాకా ఎవరికీ అమ్మకుండా ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఆ వెంటనే లూయీ తన తండ్రి నించి సంక్రమించిన ఆస్తిని అమ్మేసి సగం సొమ్ము సంపాదించాడు, అదే రకంగా కనపడిన స్నేహితుని దగ్గర అప్పు చేసాడు. తను పనిచేసి కంపెనీలో రుణాలు, అప్పులు చేసాడు. తను పదవీ విరమణ తరువాత వచ్చే ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ అన్ని తీసేసు కున్నాడు . వారం రోజుల్లో కనపడ్డ వాళ్ళ దగ్గర అప్పుచేసి , ఇంట్లో మిగిలిఉన్న ఖరీదు వస్తువులను కూడా అమ్మేసి ,మొత్తానికి 35000 ఫ్రాన్క్స్ పోగుచేసి , ఆ రోజే ఆ వజ్రాల హారం కొని ఫోరేస్టే కి పెట్టె తో సహా ఇచ్చారు. ఎక్కడ ఫోరేస్టే కనిపెడ్తుందో అని భయ పడిన మటిల్డ , సంతోషం గ “నేను దీనికోసమే ఎదురుచూస్తున్నాను . నేను ఒక పెళ్లి కి అలంకరించుకొని వెళ్ళాలి ” అన్న ఫోరేస్టే మాటలకు ఊపిరి పీల్చుకుంది ఇక ఆ రోజునుంచి అసలు కస్టాలు మొదలు ఆయినాయీ మటిల్డ , లూయీ లకు.

అంత పెద్ద మొత్తం అప్పు తీర్చటానికి వారిద్దరూ తమ ఇంటి నుండి ఒక గుడిసెలోకి మకాము మార్చారు. ఇంట్లో పనులన్నీ మటిల్డ చేసేది, అప్పటి దాక పని మనుషులను పిలిపించుకొనే శక్తి అన్న ఉండేది. ఇంటి పనులు, స్నానాల గదులు అన్ని తనే కడుక్కునేది. రోజు కూరగాయలు, బ్రెడ్ కొనటానికి రెండు మైళ్ళు నడచి , అక్కడ చవకగా దొరికే దుకాణం లోంచి కొనేది. ఇది కాక మిగిలిన సమయాలలో చిన్న చిన్న పనులు చేసి డబ్బు కూడా బెట్టేది. ఇక లూయీ పగలు చేసే ఉద్యోగం కాక, రాత్రి పూట టాక్సీ నడుపుతూ, ఇంకా మిగిలిన సమయాలలో దొరికిన పని చేస్తూ డబ్బు కూడపెట్టటం చేస్తున్నాడు. ఒక రకంగా గడియారం లాగ కష్టపడి డబ్బు కూడా పెడ్తున్నారు ఇద్దరు.

కాలం ఎవరి కోసం ఆగదు . ఇట్లా కాల గర్భం లో పది సంవశ్చరాలు గడిచిపోయినాయీ. ఆ రోజుతో వారు 35,000 ఫ్రాన్క్స్ కూడపెట్టారు. ఆ డబ్బుతో తమ అప్పులన్నీ ఒకటి ఒకటి గ తీరుస్తున్నారు. ఆ రోజు ఉదయాన్నే కిటికీ లో నుంచి గడ్డం కింద చేయీ పెట్టుకొని బయట వచ్చే పోయే జనాలను, వాహనాలను చూస్తూ గడచినా పది సంవస్చారాలను , తమ కష్టాలను తలచుకొని దుఖిస్తున్నది మటిల్డ . ఎంతో అందమైన మటిల్డ, చుట్టుపక్కల అమ్మయీలకు అసూయ కలిగించిన మటిల్డ ఈరోజు తన వయసు కి రెట్టింపు వయసు దాని లాగ కనిపిస్తున్నది. బంగారు రంగు వెంట్రుకల్లని కళా విహినంగా కనపడ్తున్నై. పాలరాయీ లాంటి మోము అంత ముడతలతో, కంటి క్రింద చారలతో, ఉబ్బిపోయీ ఆనాటి మటిల్డ , ఈనాటి మటిల్డ ఏనా అని ఎవరికైనా అనిపించక మానదు. వీధి లో మ్రోగిన వాహన ధ్వని కి ఈలోకం లోకి వచ్చింది మటిల్డ. గడచినా పది సంవస్తరాల జీవితం లో జరిగిన పరిణామాలని తలుచుకొని బరువెక్కిన గుండె తో కాసేపు చల్ల గాలి కోసం వీధి లోకి వచ్చింది. దూరంగా ఒక దుకాణం నుండి వస్తున్న అమ్మాయీ ని ఎక్కడో చూసి నట్లనిపించింది. ఆత్రం తో దగ్గరకు పోయీ చూస్తె ఆమె మరెవరో కాదు., ఫోరేస్టే . అంత అందంగా ఉన్న ఫోరేస్టే తో ఇప్పుడైనా నిజం చెప్పాలని ఆమె గుండె ఘోషిస్తోంది చెప్పాలా , వద్ద అని ఆలోచిస్తూ చివరకు నిజం చెప్పాలని నిశ్చయించుకొని అడిగింది. “నీకు నేన్నిచిన వజ్రాల హారం లో ఎ అనుమానం రాలేదా”, మటిల్డ ని గుర్తుపట్టలేని ఫోరేస్టే ఒక్క సారి మటిల్డ ని చూసి ఆశ్చర్య పోయీ ఆనందం తో “ఎట్లా వున్నావు ఇన్నాళ్ళు కనబడ లేదెందుకని” అడిగింది. అప్పుడు జరిగిన దంత చెప్పింది మటిల్డ. తనకు ఇవ్వాల్సిన వజ్రాల హారం కోసం ఇంత కష్టపడింది అని విన్న ఫోరేస్టే, కనుల నుంచి కారుతున్న దుఖ్హాన్ని ఆపుకోలేక , భాధతో మటిల్డ రెండు చేతులు పట్టుకొని ” అయ్యో! మటిల్డ ఒక్క మాట నాతొ చెప్పాల్సింది . ఆ వజ్రాల హారం వీధి లో అమ్మే ఇమిటేషన్ సరుకు, దాని విలువ 200 ఫ్రాన్క్స్ కన్న .తక్కువ “

“ఆ “….., అని తెరుచుకున్న నోరు మూయలేదు మటిల్డ . ——–

—– శ్యాం సుందర్ కాట్రపాటి OHIO, USA

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top