You Are Here: Home » సినిమా » సినిమా రివ్యూ » లో బ్యాటరీతో ‘మిస్టర్ నూకయ్య’…

లో బ్యాటరీతో ‘మిస్టర్ నూకయ్య’…

మిస్టర్ నూకయ్య

ప్రతి సినిమాకి ఏదో ఒక కొత్తదనం చూపించే మనోజ్ ఈసారి ‘మిస్టర్ నూకయ్య’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘నో క్యాప్షన్ ఓన్లీ యాక్షన్’ అంటూ ఫుల్‌ఛార్జ్‌తో కనిపించాడు. అయితే సినిమా అతడు అనుకున్న రేంజ్‌లో ఉందా? లేదా? అనేది ఓ సారి సమీక్షిద్దాం. బ్యాంక్ మేనేజర్ అయిన అను (కృతి కర్బందా) భర్తని (రాజా) కిడ్నాప్ చేస్తాడు షాజహాన్(మురళీ శర్మ). రెండు కోట్లు తీసుకొస్తే అతడిని విడిచిపెడతానని అనుని బెదిరిస్తాడు. దాంతో తన బ్యాంక్‌లోనే దొంగతనం చేసి ఆ డబ్బుతో బయలుదేరుతుంది అను. ఫోన్లు దొంగతనం చేసే నొకియా ఉరఫ్ నూకయ్య(మనోజ్) అను దగ్గర్నుంచి డబ్బు కాజేస్తాడు. ఆ డబ్బుతో తన ప్రేయసి(సనాఖాన్)తో సెటిల్ అయిపోవాలనుకుంటాడు కానీ అదే సమయంలో ఆమె గురించి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. మరోవైపు తను కొట్టేసిన డబ్బు వల్ల అను ఎంత ఇబ్బంది పడుతుందనేది తెలుస్తుంది నొకియాకు. అది చూసి చలించిన నొకియా అను భర్తను తీసుకొచ్చే బాధ్యత తీసుకుని ఆమెతో పాటే వెళ్తాడు. ఆ తరువాత వాళ్లిద్దరి ప్రయాణంలో ఏం జరిగింది? ఎవరి గురించి ఏమేం నిజాలు బయటపడ్డాయనేది మిగతా కథ!

కథ, కథనాల పరంగా చూస్తే ఇది సాదాసీదా సినిమానే. అయితే సినిమా అంతా గ్రాండ్‌గా, స్టయిలిష్ కనిపిస్తుంది. సినిమా మొత్తం ఓన్లీ యాక్షన్ అన్నట్టుగానే సాగుతుంది. కొన్ని సంభాషణలు బాగున్నాయి. సంగీతం యావరేజ్‌గానే అనిపిస్తుంది. దర్శకుడు అని గురించి చెప్పాలంటే అతని మొదటి చిత్రం అసాధ్యుడు. అయితే రెండో చిత్రం మరింత మెరుగ్గా తీయగలిగాడు. సినిమా అసాంతం మాస్‌గా ఉంటుంది కానీ హీరో క్యారెక్టర్ చాలా స్టయిలిష్‌గా చూపించడం వల్ల మాస్ సినిమానా? క్లాస్ సినిమానా? అనే విషయం అర్థం కాదు.

నటీనటుల విషయానికొస్తే… మనోజ్ చాలా ఎనర్జిటిక్‌గా నటించాడు. ఈ చిత్రంలో నటుడిగా భావోద్వేగాలు పలికించే అవకాశం ఎక్కువగా దొరికింది అతనికి. ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు కూడా. నటుడిగా ఆయనకు తృప్తినిచ్చే సినిమా ఇది. అయితే ద్వంద్వార్థాపు మాటలు తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది. ఫైట్స్ విషయంలో మనోజ్‌ను ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. కృతి కర్బందా చూడటానికి చక్కగా ఉంది. ఆమె పాత్ర పెద్దదే అయినా బాగానే చేసింది. సనాఖాన్ గురించి పట్టించుకోనవసరం లేదు. కామెడీ పార్ట్‌లో వెన్నెల కిషోర్ పరవాలేదనిపిస్తాడు. మిగతా నటీనటులంతా ఓకే!ఓవరాల్‌గా మిస్టర్ నూకయ్యకు సరిపడా ఛార్జింగ్ లేనట్టే అనిపిస్తుంది. మనోజ్ ఆశించిన విజయాన్ని ఈ చిత్రం అతనికి అందించకపోవచ్చు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top