You Are Here: Home » యువ » ఫ్యాషన్ » లేడీస్‌ వరల్డ్‌లో జినాల్‌పాడే

లేడీస్‌ వరల్డ్‌లో జినాల్‌పాడే

DSC_0124యువతరం కోసం సరికొత్త ఫ్యాషన్‌ దుస్తులు రూపుదిద్దుకుంటున్నాయి. యువత కోసం హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని కెపిహెచ్‌బి హౌసింగ్‌బోర్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లేడీస్‌ వరల్డ్‌ షోరూంను ప్రముఖ సినీతార జినాల్‌పాండే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్కప్పుడు మహిళలు నచ్చే ఫ్యాషన్‌ దుస్తులు కొనుగోలు చేయడానికి పలు ప్రాంతాలకు వెళ్లాల్సివచ్చేదని, ప్రస్తుతం ఆ అవసరం లేకుండా దాదాపు అన్ని ప్రాంతాలలో ఫ్యాషన్‌ దుస్తులు అందరికి అందబాటులోకి వచ్చాయన్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలో నటిస్తున్నానని, కన్నడలో దేవదాస్‌ తరువాత తెలుగులో ప్రస్తుతం హీరో శ్రీకాంత్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా సరసమైన ధరలకు సరికొత్త ఫ్యాషన్‌ డిజైనింగ్‌ దుస్తులను వినియోగదారులకు ఇక్కడ అందుబాటులో ఉంచినట్లు లేడీస్‌ వరల్డ్‌ నిర్వాహకులు తెలిపారు. దుస్తులతోపాటు లైఫ్‌స్టైల్‌ యాక్ససరీస్‌,, వన్‌గ్రామ్‌ గోల్డ్‌ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top