You Are Here: Home » చిన్నారి » లేజర్ కిరణంతో లోహాలను ఎలా కోస్తారు?

లేజర్ కిరణంతో లోహాలను ఎలా కోస్తారు?

లేజర్ కిరణం సంగతి విన్నారు గదా! ఈ కిరణంతో ఎంతటి లోహాన్నయినా సరే కేక్‌ను కోసినట్లు తేలికగా కోసి పడేయచ్చు. ‘నిజమా!’ అని ఆశ్చర్యపోతారు కొంత మంది. నిజంగానే అలా కోయవచ్చు. మ్యాగ్నిఫయింగ్ గ్లాస్ (భూతద్దం) పెట్టి దాని గుండా సూర్యకిరణాన్ని కాగితం మీదకు ప్రసరింపచేస్తే కాగితం కాలుతుంది. కాంతితో కొయ్యడం, కాల్చడంలో ఇదొక పద్ధతి. అలాగే ఇనుపముక్కలను కొయ్యడం సాధ్యమే. ఇనుమును కొయ్యడానికి మరింత బలమైన కిరణం చాలు. సాధారణంగా ఒక కిరణం మరొక కిరణం మీదుగా పోతూ కిరణంలోని శక్తిని హరిస్తుంది. అదే లేజర్‌లో అయితే కిరణాలన్నీ ఒకే మార్గంలో తీక్షణంగా ప్రవాహశక్తిగా ప్రసరించగలిగితే అది ఎంత కఠినమైన లోహాన్నయినా సరే కోసి వేస్తుంది. ఈ కిరణాలను భూమి మీద ఎంత దూరమయినా పంపగలిగే వీలుంది. అలాగే వాతావరణం దాటి అంతరిక్షంలోకి పంపవచ్చు. అయితే లేజర్ కటింగ్‌ని ఎక్కువగా పరిశ్రమలలో ఉపయోగిస్తున్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top