You Are Here: Home » ఇతర » లెక్క తప్పదు..

లెక్క తప్పదు..

2fillerమగవారి కన్నా ఆడవారికే డబ్బు ఎక్కడ ఎంత ఖర్చుపెట్టాలో, ఎందులో పెట్టుబడులు పెట్టాలో, ఏది కొంటే ఎంతలాభమో చెప్పగల సామర్ధ్యం ఎక్కువగా ఉంటుందిట. సంపాదనలో కొంత భాగం పెట్టుబడుల కింద మదుపు చేసే విషయంలో ఆడవారే ఎక్కువ మంది ఉన్నారట. ఈ విషయంలో కొందరు గృహిణులు కూడా ఇప్పుడు తెలివిగా వ్యవహరిస్తున్నారట. గోల్డ్‌ బాండ్స్‌లో పురుషుల పెట్టుబడులతో సమానంగా మహిళలు కూడా ఎక్కువ మొత్తాల్లో పెట్టుబడులు పెట్టినట్టు గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఇవే కాకుండా స్థిరాస్తిని పెంచుకునే దిశలో మహిళలు విశేషంగా ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే షేర్‌ బిజినెస్‌లో కూడా కొనుగోళ్ళు, అమ్మకాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ లాభాలు అర్జించడంలో కూడా మహిళలు ముందుంటున్నారని షేర్‌ బ్రోకర్స్‌ కూడా అంటున్నారు. పెట్టుబడి పెట్టిన ప్రతి పెైసాకీ లాభాన్ని అర్జిస్తున్నారు నేటి మహిళలు. బంగారం పెట్టుబడులు మరింత ఎక్కువగా వీరిని ఆకర్షిస్తున్నాయట.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top