You Are Here: Home » ఇతర » లిబేరియాలో ‘నీల’వేణులు

లిబేరియాలో ‘నీల’వేణులు

నాగరికత గురించి బల్లగుద్ది ఉపన్యాసాలు చెప్పే అనేక సంపన్నదేశాలు, అభివృద్దిలేని చిన్నదేశాల మీద ఆధిపత్యం కోసం ఏళ్ళ తరబడీ పోరుసాగిస్తూ, అక్కడి ప్రజల్ని అనాగరీ కంగా, ఆటవిక, పాశవికంగా ఘోరాలకు తెగబడుతున్నారుు. ముఖ్యంగా ఇటువంటి సందర్భాల్లో ఎక్కువ ధన, మాన, ప్రాణాల్ని నష్టపోతున్నవారు మహిళలే అని చెప్పడం అతిశయోక్తి కాదు. అత్యాచారం అనేది ఇప్పుడు అన్ని దేశాల్నీ పట్టిపీడుస్తున్న అతిపెద్ద జాఢ్యం. ఇందుకు బలవుతున్నది మాత్రం యువతులు, మహిళలే. ఎక్కడో అనే పనిలేదు. మెున్న మన రాజధాని నగరంలో 23 ఏళ్ళ వయసున్న అభంశుభం తెలియని అమ్మారుుని ఆరుగురు దుండగులు మానభంగం చేయడం, అందుకు భారతదేశ ప్రజలంతా నిరసనలు తెలియచేయడం మనకు తెలిసినదే. ప్రత్యేక చట్టాలు తెచ్చి, కఠినంగా శిక్షించాలంటూ నేటికీ అనేక మహిళా సంఘాలు నినదిస్తున్నారుు. ఇంతకన్నా దారుణంగా హింసలు అనుభవిస్తున్న లిబేరియాని ఒక తాటికి తెచ్చిన ఘనత మన మహిళలేక దక్కింది. మరి అటువంటి మహిళలకి మనం ఇస్తున్న గౌరవం ఏమిటీ?
blue22004 – 2005 సంవత్సరంలో ఆఫ్రికా దేశాలకి ఐక్యరాజ్య సమితి శాంతి దళాల్ని పంపితే, అక్కడ అవి అరాచకాన్ని సృష్టిం చాయి. అనేక అత్యాచారాలకు పాల్ప డ్డాయి. పిల్లా పాపలుతో సహా ఆఫ్రికాలోని మూడు దేశాల మహిళలు శాంతి దళాలు చేసిన అత్యాచారాలకు బలయ్యారు. ఇందులో ప్రధానంగా లిబేరియాలో ఆడవారిపై జరిగిన దమనకాండ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిందంటే నాగరిక ప్రపంచం తలదించు కునే పరిస్థితి. కంచే చేను మేయడం అంటే ఇదే అని రుజువు చేసింది శాంతి దళం. గట్టిగా 40 లక్షలు కూడా జనాభా ఉండని ఆ దేశంలో సైనికుల అత్యాచా రానికి గరవ్వని ఆడది లేదంటే ఎంతటి దయనీయ పరిస్థితుల్లో వారు మనుగడ సాగించారో వేరే చెప్ప నవసరం లేదు. మారణాయుధాలతో బెదింరించి, డబ్బుల ఆశచూపించి, ఆహారాన్ని ఎరవేసి ఎందరో యువతుల్ని లొంగదీసుకుని రోజుల తరబడీ వారి మీద అత్యాచారం సాగించారు. ఈ మిలటరీ సైనిక దళాలు చేసిన ఈ చర్యల వల్ల పిల్లల్ని కన్న యువతులు కూడా ఉన్నారు.

సరిహద్దు పోరాటాలతో పాటు 14 ఏళ్ళగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడు తున్న ఈ లిబేరియా దేశంలో శాంతి స్థాపన చేయడం కోసం వెళ్ళిన సైనిక దళాలు వారి అకృత్యాలతో మరింత అశాంతిని సృష్టించడం పట్ల ప్రపంచ దేశాలు కన్నెర్రచేసాయి. మరో వింత ఏమిటంటే, వీరితో పాటు ఇతర ఆఫ్రికా దేశాల వారుకూడా వీరిమీద అత్యాచారాలకు పాల్పడ్డాయి. ఈ శాంతి దళాల్ని ఉపసంహరించాలని మిగిలిన దేశాలు తెచ్చిన ఒత్తిడికి ఐక్యరాజ్య సమితి తలవంచక తప్పలేదు. వెంటనే స్పందించిన ఐరాస జరిగిన అత్యాచారాల మీద విచారణ చేపట్టి సుమారుగా 47 మంది సైనికుల మీద చర్యలు తీసుకుంది. కానీ, ఇది కేవలం కంటితు డుపు చర్యగానే చేసినట్టు అయ్యింది. అయితే ఈ సమస్యని పరిష్కరించి లైబీరియా ప్రజలకు రక్షణ కల్పించగలవారు ఎవరూ? అనే ఆలోచనలో పడింది.

అందుకు ఒక ఆలోచనచేసి కొందరు మహిళా పోలీసు దశాల్ని లిబేరియాకు పంపాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మహిళా పోలీస్‌ దళాన్ని ఎక్కడి వారిని పంపాలి అన్న మరో సంశయానికి వచ్చిన ఐరాస భారతీయ మహిళలే అందుకు సమర్ధులని నిర్ధారణ చేయడం మన దేశ మహిళా దళాల పనితీరు ఏ స్థాయిలో ఉందో చెప్పనలవికాదు.

పేరు తెచిన దళం
blue1‘బ్లూ హెల్మెట్స్‌’ దళంగా రూపం దాల్చిన 103 మంది మహిళలు లిబేరియాలో పరిస్థితిని చక్కదిద్దడానికి సమాయత్తమయ్యాయి. పూర్తిగా నీలం రంగు యూనిఫాం ధరించి విద్రోహుల గుండెల్లో దడపుట్టించే విధంగా తయారయ్యి, మరికొన్ని మెళకువలలో మరింత శిక్షణ పొంది లైబేరియా చేరాయి. ఈ దళం అత్యాధునిక మారణాయుధాల్ని ఉపయోగించడమే కాకుండా, అనేక యుద్ధ విద్యల్లో కూడా ఆరితేరిన మహిళలున్న బృదం. కొందరు పోలీసులు దేశాధ్యక్షునికి రక్షణ కల్పింస్తూ ఉండగా, మరికొందరు వాహనాలు వినియోగించ కుండా కాలినడకన పహారా కాస్తూ లైబే రియా ప్రజలకి క్రమంగా సన్నిహితులయ్యారు. వీరి పహారా కారణంగా అత్యాచారాల శాతం గణనీయంగా తగ్గడమే కాకుండా అక్కడి మహిళలు స్వేచ్ఛగా నిర్భయంగా తిరగగలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి.

అంతేకాక విదేశీయులన్నా సైనికులన్నా ఒకరకం భయభ్రాంతులకు లోనైన అక్కడి మహిళల్లో చైతన్యాన్ని నింపారు. అందువల్ల వారికి జరిగిన దురాచారాల్ని మనసు విప్పి చెప్పుకునే అవకాశం వారికి రావడంతో అత్యాచారాలకి పాల్పడ్డ సైనికోద్యోగులు మరికొందరి మీద కేసులు నమోదుచేసారు. అసలు వీరు ఆ దేశానికి వెళ్ళిన నాలుగు రోజుల్లోనే అంతకు ముందు ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకున్న 47 కేసులేకాక మరో 120 వరకూ కేసులు నమోదుచేసారు. ఇలా తవ్వుతున్న కొద్దీ అత్యాచారాలు వెలుగులోకి రావడమే కాకుండా అందుకు సంబంధించిన సైనికోద్యోగుల మీద కుప్పలు తెప్పలుగా వందలాది కేసులు పెట్టి వారిని ఉద్యోగాల్నించి తొలగించే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి.

ప్రజల పట్ల ఆత్మీయంగా సంభాషిస్తూ, ఆక్కడి ప్రజ లతో మమేకమై, కర్తవ్యం పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ శక్తి స్వరూనిణులుగా భాసిస్తున్నారు మన మహిళా దళాలు. అంతేకాకుండా అక్కడి మహిళలకు కొన్ని ప్రతిఘటన మార్గాల్లో శిక్షణలు కూడా అందిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్నీ, ధైర్యసాహసాల్ని కూడా కలిగిస్తున్నారు.

భారతదేశంలో అత్యాచార చట్టం వేరుగా ఉన్నప్పటికీ, చట్టంతో పనిలేకుండానే కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడే పేరుతో భారతీయ తల్లిదండ్రులు తమ కూతురుని కామాంధులకే ఇచ్చి వివాహం చేసే సంఘటనలు ఇప్పటికీ ఎన్నో జరు గుతూనే ఉన్నాయి. మొరాకోలో గల చట్టాన్ని సవరించి కొత్త చట్టాన్ని తేవాలంటూ ఆయా దేశాల్లో ఎప్పటి నుండో ఉద్యమాలు సాగుతునే ఉన్నాయి.

జరిగిన ఒక సంఘటన
liberia3అన్నెం పున్నెం ఎరగని ఒక అమ్మాయిపై ఓ కామాంధుడు కన్నేశాడు. మాటేసి అత్యాచారం చేసాడు. ఆ కామాంధుడితో ఆ అమ్మాయి అభీష్టానికి విరుద్ధంగా వివాహం చేసేస్తే న్యాయం జరిగిపోతుందా.. ఆఫ్రికా దేశలోని మొరాకోలో అమీనా ఫిలాలీ అనే 16 ఏళ్ల బాలికపై ఒక కామాంధుడు అత్యాచారం చేసాడు. నిందితుడిని కఠినంగా శిక్షించి ఆమెకు న్యాయం చేయాల్సిన ఆ దేశ చట్టం మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఆ కామాంధుడితో ఆ అమ్మాయికి వివాహం చేయాలని చెప్పింది. అతడితో వివాహం ఇష్టం లేదని ఆ అమ్మాయి అందుకు వ్యతిరేకించింది. దాన్ని పట్టించుకోకుండా బంధువులంతా కలిసి బలవంతంగా వివాహ వేదిక దగ్గరకు లాక్కెళ్లి పెళ్లి తంతు నిర్వహించారు. ఆ అమ్మాయిపై చేయి కూడా చేసుకున్నారు.

అసలే కామాంధుడి అఘాయిత్యంతో తేరుకోలేని స్థితిలో ఉన్న ఆ అమ్మాయికి న్యాయం చేసే పేరిట చట్టం చేతిలో జరిగిన పరా భవమిది. వివాహమయిన తెల్లారే ఆ అమ్మాయి విషం తిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘోరం వెలుగులోకి వచ్చిన వెంటనే మహిళా సంఘాలు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. ఆ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమానికి తెరతీసాయి. ఆ దేశ చట్ట ప్రకారం, రేప్‌ బాధితురాలికి న్యాయం చేయడమంటే, ఆమెను అత్యాచారం చేసిన వ్యక్తికిచ్చి పెళ్లిచేయడమే. దీన్ని ఆసరా చేసుకుని పలువురు తమకిష్టం వచ్చిన అమ్మాయిల్ని అత్యాచారం చేయడం, ఆ తర్వాత ఆ దేశ చటప్రకారం వివాహం చేసుకోవడం మామూలయిపోయింది. ఒక్క మొరాకోలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఇదే తరహా చట్టాలున్నాయి.

liberia5కేవలం రెండున్నర నెలల వ్యవధిలోనే ఈ దళం ఆ దేశ ప్రజల ఆదరాభిమానాలు సాధించగలిగారు. అలాగే కేవలం 103 మంది మన మహిళలు లిబేరియా దేశ శాంతి భద్రతల్ని పరిరక్షించడం ప్రపంచదేశాలకే ఒక అద్భుతంగా అనిపిస్తోంది. దీనితో కర్తవ్య నిర్వహణలో పురుషుల కన్నా, మహిళలే ఎక్కువ ప్రావీణ్యాన్నీ, నిజాయితీని చూపుతున్నారన్న వాస్తవం తేటతెల్లమయ్యింది. ప్రపందేశాల్లో చాలామంది మహిళలు ఎదుర్కుంటున్న సమస్య లైంగిక సమస్యలే. ఈ విషయం పట్ల అనేక దేశాలు కలవరపడుతున్నా, తగిన చర్యలు తీసుకునే మార్గంలో పయనిస్తున్నాయి.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top