You Are Here: Home » ఇతర » లాస్యానికి కావాలి హాస్యం

లాస్యానికి కావాలి హాస్యం

శారీరక మానసిక భావోద్వేగాల సారమే ‘రసాలు’. తాంత్రిక సంప్రదాయం ప్రకారం మన ప్రాథమిక భావోద్వేగాలు తొమ్మిది రకాలు. అవే నవరసాలు. అవి శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరమూ, భయానకమూ, బీభత్సమూ, అద్భుతమూ ఇంకా శాంతం. హాస్యం అనేది జీవితంలో ఒక ప్రధాన రసం. హాస్యం అంటే వినోదం కలిగించి నవ్వు పుట్టించే లక్షణం కలిగిన ఒక భావా నుభవం. జీవితంలోని అందాన్ని అద్భుతాన్ని చూపించే పరికరం. సహజమైన ఆనందం స్వచ్ఛమైన హాస్యమే నిజమైన ఆనందం. కారణం అవసరం లేకుండా అంతరాంతరాంల్లోంచి వచ్చే ఆనందమే హాస్యం. మనిషిలోని బాధని, విషాదాన్ని, భయాన్ని, కోపాన్ని పోగొట్టే అత్యంత శక్తివంతమైన ఆయుధం హాస్యం.

Untit32హాస్యం యూనివర్సల్‌ లాంగ్వేజ్‌. అన్ని బేధాలు తొలిగించి మానవులందరినీ ఒకటిగా చేసే శక్తి కేవలం హాస్యానికే ఉంది. తరతమ బేధాలు, వయోబేధాలు, పండిత పామర బేధాలు, స్త్రీ, పురుషబేధాలు అన్నింటినీ తొలగించి అందరినీ ఒక్క తాటిపైకి లాగే శక్తి కేవలం హాస్యానిదే. నిరంతరం సాగే మానసి ఆలోచనా ప్రవాహాన్ని, మానసిక ఒత్తిడిని తొలగించి అందరినీ ఒక్క తాటిపైకి లాగే శక్తి కేవలం హాస్యానికే ఉంది. ‘‘నవ్వులు’’ మనల్ని ఎంతో సజీవంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సృజనాత్మకంగా, ప్రశాంతంగా ఉంచుతుంది. మనస్పూర్తిగా హాయిగా, గట్టిగా నవ్వగలిగే వారు తమ చుట్టూ ఉన్న వారందరినీ నవ్వించ గలరు. అందుకే హాస్యాన్ని ‘‘కాంటేజియస్‌ ఎమోషన్‌ అండ్‌ ఎ నాచురల్‌ డివరషన్‌’’ అని అంటారు. తన చుట్టూ ఉన్న వారిని నవ్వించగలగే వాడికే స్వర్గానికి అర్హత ఉంది అని మతగ్రంథాలు చెబుతున్నాయి.

ఏదైనా ఒక విషయాన్ని ఎంత ముఖ్యమైనదైనా, భక్తిపరమైనదైనా, లేక వేదాం త పరమైనదైనా సరే అదే పనిగా చెప్తే ఎవ్వరూ వినరు. ‘అబ్బ సుత్తి కొడుతు న్నాడురా బాబూ’ అంటారు. అదే హాస్యాన్ని మేళవించి జోకులతో చేర్చి చెబితే ఎన్ని గంటలైనా తెలియకుండా కూచుని వింటారు..ఆనందిస్తారు. అందుకే ఏవైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో హాస్య సన్నివేశాల్ని మేళవిస్తారు. ఇప్పుడే ఆ కార్యక్రమం రక్తి కడుతుంది. అదే హాస్యానికున్న శక్తి. అందుకే జోకులు లేని పత్రికలు లేవు. హాస్య సన్నివేశాలు లేని సినిమా లేదు. చారిత్రక, పౌరాణిక సినిమాలు తీసేటప్పుడు కథలో కలిసిపోయేట ట్లుగా హాస్యం పండిచడం కోసం కొన్ని పాత్రలని హాస్యానికనుగుణంగా మలచుకోవడం జరుగుతుంది.

వికటకవి వినోదం
హాస్యం రెండు విధాలుగా పండుతుంది. తెలివితేటల్లోంచి, మూర్ఖత్వంలోంచి తెలివైనవారు తమ వాక్చాతు ర్యంతో, చమత్కారంతో హాస్యాన్ని పండిస్తారు. ఈ కోవకి చెందిన వాడు తెనాలి రామకృష్ణ. శ్రీకృష్ణదేవ రాయల పేరు చెబితే చాలు ముందుగా మనకు గుర్తుకువచ్చేది మాత్రం తెనాలి రామకృష్ణే. అం దుకే వారి చమత్కారాలు తరతరాలుగా మన పెద్దల నుంచి వారసత్వంగా వస్తున్నాయి. ఎవరైనా మనల్ని అవమాన పరచాలని పరుషమైన మాటల్తో మనసు గాయపరిచినా, సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఉన్న వాళ్లు తిరిగి వారి వాక్చాతుర్యంతో హాస్యపు పూత పూసి చక్కని గట్టి రిటార్డు ఇచ్చి వాళ్లపై కసి తీర్చుకుంటారు. రణరంగంగా మారే పరిస్థితిని కూడా చక్కగా హాయిగా తప్పించగలుగుతారు. ‘‘ఒకతను తన ఇంట్లో సంగీతం పాడుకుం టున్నాడట హార్మోనియం వాయించుకుంటూ…అతని ప్రక్కింటాయన ఆయనని అవమాన పరచాలను కున్నాడు.. అవకాశం దొరికిందని గబగబా పరుగెత్తుకుంటూ వచ్చి…

‘‘అయ్యో మీరు పాడుతున్నారా…ఎవరో పిల్లాడు ఏడుస్తున్నాడుకొని వచ్చా’ అన్నాడు. దానికి ఆయన చాలా నింపాదిగా….‘‘ఇంకా నా పాటకి ఇప్ప టిదాకా ఏ గాడిదా రాలేదేమిటబ్బా అనుకున్నాను’ అని ఫెడీమ్మని జవాబి చ్చాడు. అందుకే సెన్స్‌ఆఫ్‌హ్యుమర్‌ ఉన్నవాళ్లు నవ్వుతూ హాయిగా, ఆనందం గా, ఆరోగ్యంగా జీవించగలరు. ఎంతటి విషయమైన మనసులోకి తీసుకోరు.

పసివాడని హాస్యం
చిన్న పిల్లల అమాయకపు మాటలు, చేష్టలు మనకు నవ్వు పుట్టిస్తాయి. ఎంత టి కర్కోటకులనైనా నవ్వించగలరు పిల్లలు. అందుకే పిల్లలున్న ఇల్లు నవ్వుల తో కేరింతలతో నిండి ఉంటుంది. ఇంగ్షీ ఇప్పడంత వాడుకలోలేని రోజుల్లో ఓ పిల్లాడిని హౌ ఓల్డ్‌ ఆర్‌ యు? అని ప్రశ్నిస్తే వాడు ఠక్కున ‘హౌ ఓల్డ్‌ ఆర్‌ యు అనేవాడు’ అలాంటి అల్లరి పిడుగుల చేష్టలనే ‘‘బుడుగు’’లో చూపిం చారు మన ముళ్ళపూడి వారు. అలాంటిదే ‘‘డెన్నిస్‌ ది మీనేస్‌’’ పేరుతో ప్రఖ్యా తిగాంచిన కామిక్‌గా వెలిసింది. దీని సీరిస్‌ను దాదాపు వెయ్యి దినపత్రికల్లో, నలభై ఎనిమిది దేశాల్లో, 19 భాషల్లో ప్రచురితమౌతోంది.

చరిత్రలో హాస్యం
అక్బరు చక్రవర్తి అక్బరు పేరు వినగానే గుర్తుకువచ్చే వ్యక్తి పేరు మాత్రం భీర్‌బల్‌. ఐదు శతాబ్దాలు గా అన్ని తరాల వారినీ నవ్విస్తూ గిలిగింతలు పెడు తున్నాయి. ఆయన చతురోక్తులు. వారి మాతృభాష ఏదైనప్పటికీ, వారి చతు రోక్తులను ప్రపంచంలోని అనేక భాషల వాళ్లు వారి వారి భాషల్లో చదువుకుని ఆనందిస్తున్నా రంటే అది హాస్యం గొప్పతనమే.

హాస్యాహారం
మన పెద్దలు మనకంటే ఆరోగ్యంగా ఉంటారు. కారణం వాళ్ల తిండే. చాలా బల మైన ఆహారం తీసుకునే వారు. ఇప్పుడేముందీ..అంతా కల్తీనే కదా బలం ఎక్కడిదీ అని పెదవి విరుస్తారు నేటితరం వారు. పూర్వం కుటుంబంలోని వ్యక్తులందరూ కలిసి మెలసి ఉంటూ, పండుగలకి హాయిగా నవ్వుకుంటూ, ఒకళ్ల మీద ఒకళ్లు చతురోక్తులు విసురుకుంటూ జీవితాన్ని ఆనందంమయంగా గడిపేవాళ్లు. వదినా మరదళ్ల హాస్యాలు, బావా బావమరుదుల చమత్కారాలు, బావా మరదళ్ల సరసాలు. అప్పుడవి కానరావడమేలేదు. ఒళ్లు వంచి పొలాల్లో కాయకష్టం చేసుకునే స్త్రీలు కూడా ఒకరిపై ఒకరు సరసోక్తులు విసురుకుంటూ పనిచేస్తారు. అందుకే వారికి కష్టం తెలీదు. ఇప్పుడు యాంత్రికంగా బతకడానికి ఇష్టపడి అలవాటైపోతున్నారు. చిన్నపిల్లాడు సగటున రోజుకి 300సార్లు నవ్వితే… పెద్దవాళ్లు సగటున రోజుకు 15సార్లు మాత్రమే నవ్వుతారు. వీటికి ఒత్తిడే కారణమా? మనం ముసలివాళ్లమయ్యామని నవ్వడం ఆపేయం.. నవ్వడం ఆపేసినందువల్లే నిజంగా ముసలివాళ్లమౌతున్నాం.

హ్యూమర్‌ ఈజ్‌ ఎ యూనివర్సల్‌ లాంగ్వేజ్‌
Laugaఏదైనా విషయానికి కొంత చతురత జోడించి, అర్థవంతంగా జనానికి చెప్పగలిగే వాడే హాస్యగాడు. సినిమాల్లో తమ నటన ద్వారా హాస్యాన్ని పండిస్తారు. హాస్య నటులు అలాగే తమ రచనల ద్వారా హాస్యాన్ని అంది స్తారు రచయితలు. ప్రపం చంలోని మూలనున్న అన్ని దేశాలలోని ప్రజలను తనివితీరా నవ్వించి, అందరి హృదయాలలో స్థిరనివాసం ఏర్పరుచుకుని, అందరి ప్రసంశలు అందుకుని అందరికీ ప్రీతిపాత్రుడైన ఏకైక నటుడు చార్లీ చాప్లిన్‌. సినీ మధ్యయుగంలో హాస్యగాళ్ల జతగా వాసికెక్కిన వారు లారెల్‌ అండ్‌ హార్టీ. మిస్టర్‌ బీన్‌గా సుప్రసిద్ధ మైన వాడు రోవన్‌ అత్కిన్‌సన్‌. హిందీ సినీరంగంలో మొహమూద్‌, జానీవాకర్‌, అనుపయ్‌ఖేర్‌, జగ్‌దీప్‌, జానీలీవర్‌ హాస్యచక్రవర్తులు ఉన్నారు. కానీ అందరి లోకి కీర్తినార్జించినవాడు హిందీ చిత్ర విధూషకుడు మొహమూద్‌.

తెలుగులో…
మన తెలుగులో చక్కటి హాస్యాన్ని పండించి మన మనస్సులలో చెరగని ముద్ర వేసిన ప్రఖ్యాత హాస్య కళాకారులు ఎందరో ఉన్నారు. వారిలో రేలంగి, రమణా రెడ్డి, చలం,రాజబాబు, పద్మనాభం, అల్లురామ లింగయ్య మొదలైనవారు గణనీ యులు. అలాగే కళాకారిణుల్లో సూర్యకాంతం, గిరిజ, గీతాంజలి, రమాప్రభ లెక్కింపతగ్గవారు. దేశ సినీ చర్త్రిలో ‘‘పద్మశ్రీ’’ అందుకున్న మొట్టమొదటి హాస్య కళాకారుడు మన రేలంగి. హాస్య రచయితల్లో ఎన్నతగ్గవారు మునిమాణిక్యం, చిలకమర్తి లక్ష్మీనరసింహం చెప్పుకోతగ్గవారు. ఈ తరంలో జంథ్యాల, గొల్ల పూడి మారుతీరావు, రావికొండలరావు, నాగభూషణంగార్లని చెప్పుకోవచ్చు.

నవ్వు పరమౌషధం
హాస్యం సైడ్‌ రియాక్షన్స్‌, సైడ్‌ ఎఫెక్స్‌‌స లేని మహత్తరమైన దివ్యౌషధం. కడుపార నవ్వడం ‘‘ఇన్‌టర్నల్‌ జాగింగ్‌’’కి సమానం. ఇది మన శరీరంలో ఉండే అవయ వాలని ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది. శారీరక వ్యాయామం చేయలేని వారికి నవ్వు వారి గుండెని కండిషన్‌లో ఉంచుతోంది. నవ్వు రక్తపోటుని అరిక డుతుంది. కడుపారా నవ్వితే ఊపిరితిత్తులు ఖాళీ అయి అవి తీసుకోగలిగే గాలి కంటే ఎక్కు ప్రాణశక్తిని తీసుకుంటాయి. ఎంఫిసియా, ఊపిరితిత్తులకి సంబం ధించిన జబ్బులతో బాధపడే రోగులకి ఈ నవ్వు చాలా అవసరం.

లాఫింగ్‌ థెరఫీ
మనదేశం నలుమూలలా ఆసుప్త్రులల్లో రోగుల ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఫార్మల్‌ అండ్గ అన్‌ ఫార్మల్‌ లాఫింగ్‌ థెరపీ ప్రోగ్రామ్స్‌ని ప్రవేశపెడుతున్నారు. మనదగ్గర లాఫింగ్‌ క్లబ్స్‌ సర్వసాధారణమైపోతున్నాయి. లాఫింగ్‌ క్లబ్స్‌లోని సభ్యులు కేవ లం నవ్వడంకోసమే కలుసుకుంటారు. అయితే ఇప్పటి నుంచి మన ఆసుప త్రిలో రోగుల్ని చూడడానికి వెళ్లేటప్పుడు పూలకి బదులు చక్కని హాస్యపుస్తకాలో, జోక్స్‌ ఉన్న కార్డుతలో ఇచ్చి వారిని మనస్పూర్తిగా చక్కగా నవ్వించి వద్దాం.

నవ్వు నాలుగు విధాల చేటు
Laugaaమరి నవ్వు వల్ల ఇన్ని లాభాలు ఉంటే ‘‘నవ్వు నాలుగు విధాల చేటు’’ అని ఎందుకన్నారు మన పెద్దలు. వారేమీ తెలివి తక్కువ వారు కాదు. నవ్వు ఎప్పుడూ అసందర్భంగా, వెకిలిగా, ఎదుటివారిని కించపరిచేదిగా ఉండకూడదు. అదిగో అటువంటి, నవ్వే ప్రమాదం. ఎదుటి వారి అసహాయతపై నవ్వ కూడదు. సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ మనలో పెరిగే కొద్దీ మనలో క్రియాత్మ కత పెరుగుతుంది. మంచి కమ్యూనికేటర్‌గా మారతాము. దీంతో స్నేహితులు పెరుగుతారు. ఎటువంటి ఛాలెంజ్‌లైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది. అకస్మాత్తుగా వచ్చిపడే ప్రమాదాల్ని లేదా కష్టాల్ని తేలికగా హ్యాండిల్‌ చేసే శక్తిని ప్రసాదిస్తుంది. ఎంతటి కష్టానైనా నవ్వు తూ భరించే శక్తినిస్తుంది. భగవంతుడు ప్రసాదించిన వరం మన జీవితం. ఈ జీవితంలో ప్రతిరోజూ ముఖ్యమైనదే. నిరుపయోగంగా వేస్టు అయిన రోజేది అంటే…మనస్పూర్తిగా నవ్వలేని రోజే.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top