You Are Here: Home » ఇతర » లావొక్కింతయు మంచిదే..కానీ

లావొక్కింతయు మంచిదే..కానీ

tumbలావు పెరుగుతున్నామని వెయిట్‌ పెరుగుతుందనో లేదా శరీరంలో కొలాస్ట్రాల్‌ ఎక్కువగా పెరుగుతుందన్న భయంతోనో చాలామంది మహిళలు కొవ్వు పదార్థాలు ఏ మాత్రం లేనటువంటి ఆహారం తీసుకుంటుంటారు. అయితే కొవ్వు పదార్థాలు లేని ఆహారం తీసుకుంటే ప్రమాదం ముంచుకొచ్చినట్టేనని పలువురు ఆహార నిపుణులు అంటున్నారు.

కొవ్వు లేని ఆహారం తీసుకుంటే లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయని, అందుకే కొవ్వు పదర్థాలు ఉ న్న ఆహారాన్ని తీసుకోవడం అవసరమని ఆహార నిపుణులు అంటున్నారు.

ఊబకాయం భయంతో ఎంతోమంది మహి ళలు పోషక పదార్థాలను కూడా తీసుకోవడం మాని సెైజ్‌ జీరోలపెై మోజు పడుతున్నారు. అయితే సెై జ్‌ జీరో కావాలనుకున్నప్పటికీ శరీరానికి కొవ్వు పదార్థాలు తప్పనిసరిగా అవసరం అనే కోణాన్ని ఆహార నిపుణులు ముందకు తీసు కువచ్చారు.

ఈ విషయంలో అవగాహన కల్పించడం కోసం పాశ్చాత్య న్యూట్రీషియసిస్ట్‌ ఈస్తర్‌ బ్ల మ్‌ పెద్ద పుస్తమే రాశారు. మానవ శరీరానికి కొవ్వు పదా ర్థాలు ఎంతగా ఉపయోగప డుతాయో వివరిస్తూ సీక్రెట్స్‌ ఆఫ్‌ గార్జెస్‌, హండ్రెడ్స్‌ ఆఫ వేస్‌ టు లివ్‌ వెల్‌ వెైల్‌ లివింగ్‌ అనే పుస్తకం రాశారు. రకరకాల కారణాలతో కొవ్వు పదార్ధాలను మహిళలు పూర్తిగా ఆపి వేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా మహిళలు కోవ్వు పదార్థాలు తీసు కోవడం పూర్తిగా నిలిపి వేస్తే వారి హార్మోన్లు అసమతుల్యానికి గురవుతాయని వెైద్యులు ఈస్తర్‌ బ్లమ్‌ హెచ్చరించారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top