You Are Here: Home » చిన్నారి » కవితలు » లక్ష్యం

లక్ష్యం

తుపాకి దెబ్బకు
చందమామ రాలిపడదు
ఉరితాడు నీడకు
ఇన బింబం మరుగు పడదు
పుస్తకాలను నిషేధిస్తే
అక్షరాలు మూగబోవు
సముద్రం చాలా పెద్దది
గొళ్ళెం పెట్టి తాళం వేయడానికి

దేశంలోని మొత్తం జైళ్ళూ సరిపోవు
నరికేసిన కొమ్మల కన్నా
ఇగురేసే చెట్లే ఎక్కువ
పట్టుకోవడానికి చుట్టుముడితే
కొండలన్నీ నిప్పులవుతాయి
అడవి నిద్ర పోని కన్న తల్లి
రెక్కల కింద బిడ్డల్ని దాచుకుంటుంది
కవిత్వం విన్నవాళ్ళు

asharajuఅమృతం తాగినట్టు కళ్ళు తెరుస్తారు
ఎన్ని మరణాల లెక్కలు చూపెట్టినా
గెలుపు మీది లక్ష్యాన్ని మార్చుకోరు
జరుగుతున్న సంగ్రామంలో
నీ ఓటమి ఎప్పుడో రాసి ఉంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top