You Are Here: Home » దైవత్వం » సాహిత్యం » లక్ష్మీ స్వరూపులు

లక్ష్మీ స్వరూపులు

లక్ష్మీ స్వరూపులు

ఈ యాంత్రిక యుగంలో ‘మార్పు’ అనేది సర్వ సాధారణమైపోయింది. ఆ మార్పు కూడ ఎంతో ఎంతో వేగవంతంగా జరిగిపోతోంది. ఈ మార్పులు మన సంసృ్కతీ సంప్రదాయాలకు గొడ్డలి పెట్టుగా మారుతుండటమే ఆందో ళన కలిగిస్తోంది. తినే తిండి దగ్గర్నుంచి కట్టుకునే బట్టల వరకు పాశ్చాత్య సంసృ్కతీ ప్రభావంతో కొట్టుకుపోతోంది మన సమాజం. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, కొన్నేళ్ళ తర్వాత మనకు మనమే ‘మనమెవరం?!’ అని ప్రశ్నించు కోవలసివస్తుందన్నది నిజం. ఉదాహరణకు లక్ష్మీ స్వరూపులుగా గోచరించే మన అమ్మాయిలలో ఎంతమంది ఇవాళ మన సంప్రదాయ దుస్తులైన పరికిణీ ఓణీలలో కనిపిస్తున్నారు? ఇక, అబ్బాయిల దగ్గర పంచెకట్టు మాట ఎత్తితే, ‘అదేమిటి?’ అన్న ప్రశ్న ఎదురయ్యే దుస్థితేగా నేటి స్థితి!లక్ష్మీ స్వరూపులు

బస్టాండులో ఓ బిడ్డ నిలబడివుండగా, అక్కడ నిలుచున్న ఇద్దరిలో ఒకరు ఆ బిడ్డని చూస్తూ ఇంకొకరితో ‘‘ఛ! లోకం మరీ చెడిపోతోంది. నేనూ అరగంట నుంచి చూస్తున్నా అక్కడ నిలబడ్డది ఆడా! మగా?! అని తెలసిచావడం లేదు. ఏం డ్రస్సులో ఏం పాడో… అయినా ఇదేం మాయదారి ఫ్యాషన్లు?!’’ అంటూ గొణిగాడు.అతడి గొణుగుడును అడ్డుకున్న అవతలి వ్యక్తీ, ‘‘అది అమ్యాయే!’’ అని జవాబివ్వడం జరిగింది.‘‘అరె, సారీ! నేనేదో నోటితుత్తరలో వాగాను. మీరు ఆ అమ్మాయికి ఫాదరా;!’’
‘‘కాదు. మదర్‌!’’ఇది నేటి పరి(దు)స్థితి! వేష భాషల నుంచి సంబంధ బాంధవ్యాల వరకు అన్నీ కలుషితమైపోతున్నాయి. కళ్ళు తెరుద్దాం. కాపాడుకుందాం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top