You Are Here: Home » సినిమా » పాటలు » లక్ష్మీ కళ్యాణం (2007)- అలిగావా చిట్టి చిలకా దిగవా నేలవంక

లక్ష్మీ కళ్యాణం (2007)- అలిగావా చిట్టి చిలకా దిగవా నేలవంక

పల్లవి :
అలిగావా చిట్టి చిలకా దిగవా నేలవంక
అడిగేశా ఉండలేక చాల్లే బెట్టు చేయక

ఔననుకో గోరువంకా
అలుసిచ్చాను గనుక
జరిగిందే తెలుసుకోక
నాపై నిందలేయక
నీకేమి ఊసుపోక నాదే నేరమనక
నిజమంతే వాదించక… ఆ…

చరణం : 1
ఓ కన్ను మూసి చూస్తున్నట్టు ఉంది
నా ఒంటి నడక నాకే నచ్చకుంది
నాతోనే నాకు గొడవైనట్టు ఉంది
నా నుంచి నేనే వేరైనట్టు ఉంది
ఊరుకోలేను చేరుకోలేను
మనసిలా ఎందుకుంది
మూగనేంకాను మాటకాలేను
ఏమిటౌతున్నది

చరణం : 2
నాతోట పువ్వే నాపై కోపమంటే
ఈ ప్రాణమింక ఉన్నా లేనిదంతే
నాలోని సగమే నాకే దూరముంటే
ఏ సందడైనా మనసే నవ్వదంతే
చిలిపి జగడాన్ని పెంచుకున్నాను
నేస్తమా తప్పు నాదే
చెలిమి విరహాన చేదు చూశాను
పంతమా ఆగవే…

చిత్రం : లక్ష్మీ కళ్యాణం (2007)
రచన : రామజోగయ్యశాస్ర్తి
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
గానం : నిహాల్, ప్రణవి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top