You Are Here: Home » సినిమా » పాటలు » రోబో (2010)- ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే

రోబో (2010)- ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే

ఇనుములో ఓ హృదయం మొలిచెనే
ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే

పూజించే యంత్రుడు
పూవాసనకొచ్చాడు
మరమనిషి వింతోడు
మన్మధుడై వచ్చాడు
సూర్యునికే అందని అందం
చూడాలనుకున్నాడు
కాలాలే ఎన్నడు చూడని
ప్రేమే మనదన్నాడు
ఐ రోబో నీ చెవిలో
ఐ లవ్ యూ కోరేదా (2)
ఐ యామ్ సూపర్ గర్ల్
ప్రేమించే రాపర్ గర్ల్ (2)
వెన్నెల్లో అందాలే నీవేలే నీవేలే
నీ నీలి కన్నుల్లో విద్యుత్తే దొంగిలిస్తా
నా నీలి పన్నులతో నీతోనే నవ్విస్తా
నా ఇంజన్ గుండెల్ని నీ సేవకు అర్పిస్తా
నీ నిద్రరాత్రిలో నా స్విచ్ ఆపేస్తా
ఏనాడు ఏ పొద్దూ
నీవాడే బొమ్మే అవుతా

మెమొరీలో నీ సుకుమారం
విడిగా దాచుకుంటానే
షట్‌డౌన్ నే చెయ్యను పో
రోజంతా చూస్తానే
సెన్సార్లన్నీ అరిగేదాకా నీలో
అన్నీ చదివానే
నీవల్లే నా నియమం హద్దులు
అన్నీ మరిచానే
ఎంగిలి లేని దొంగముద్దు
వద్దనకుండా తీసుకోవా
రక్తం లేని లోహం గుండె
వద్దు పోరా అంటావా
జీవశాస్త్ర భాషల్లోన యంత్రుణ్ణే ఓ చెలీ
తారాలోకం భాషల్లోన
చంద్రుణ్ణే నా సఖీ
చావేలేని శాపం పొంది
భువి పైకి వచ్చానే
నా ప్రేమ పూవల్లే వాడిపోదు అంటానే
హే రోబో మస్కా వద్దు…
నువు దూ దూ దూరం పో…
నువు కాళ్లకు బంధం వేయకు పో…
ప్రేమ కోరే రోబో
నీ అవసరం లేదు పో పో…

చిత్రం : రోబో (2010)
రచన : సుద్దాల అశోక్‌తేజ
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : రెహమాన్, సుజన్నే, కాష్ ఎన్ క్రిస్సీ

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top