You Are Here: Home » సినిమా » పాటలు » రోబో (2010)- ఎగ్గ్‌లో సిలికాన్ చేర్చి

రోబో (2010)- ఎగ్గ్‌లో సిలికాన్ చేర్చి

ఓ మరమనిషి మాలోకి రా… (2)
ఎగ్గ్‌లో సిలికాన్ చేర్చి
తీగలతో తినిపించి
హార్డడిస్క్‌లో మెమొరీ కూర్చి
చెడిపోని దేహంతో చనిపోని ప్రాణంతో
ఆరోజ్ఞానం నీకే నేర్పితే విజ్ఞానం
తెలిపే ప్రయత్నం
॥మరమనిషి॥

మార్గం చూపుతూ
మనిషిని బాగు చెయ్
మమతే నేర్పుతూ జగమే మార్చు
ప్రాణికోటికి మంచి కోరుకో
నిజాయితీని ఎన్నడు వీడకు
యంత్రుడ యంత్రుడ యంత్రుడ
నా యంత్రుడ (2)
నా తెలివి ఇంతే కదా
నీ జ్ఞానం ఎంతో కదా
నా భాషలు ఆరు సరి
సృష్టించావ్ నూరు మరి
ఊపిరితిత్తులు ఉండవులే
గుండె బాధ లేదసలే
జిత్తుల మనిషి అల్పుడులే
యంత్రము ఓడదులే
గర్భంలో జనించేది అన్నీ గతించు
మేథలో పుట్టినచో మృత్యువే లేదు
ఇదిగో నా యంత్రుడు
మృత్యుంజయుడు (2)
నే మరో భూబ్రహ్మనులే
నీవే నా పుత్రుడివి
మగాడు కన్న మగవాడా
నీ పేరిక యంత్రుడులే…
॥మరమనిషి॥

నేనొక మేథో భాష
ఎందుకన డం నా శ్వాస
రోదసి వలే నా నయనం
నే రేపటి విజ్ఞానం
నీ కండలు రక్త గతం
నా గుండెలు వస్తు శతం
నీ జన్మం ఒకటి కదా
నా జన్మలు వేలు కదా
రోబో రోబో పలు భాషలు వస్తే ఏం
నా పితృభాష తెలుగు కదా
రోబో రోబో లోకం గెలిచొస్తే ఏం
సృష్టికర్తకు ఎపుడూ దాసుడే…
॥మరమనిషి॥

చిత్రం : రోబో (2010)
రచన : సుద్దాల అశోక్‌తే జ
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : బాలు. డి.శ్రీనివాస్,
ఖతీజా రెహమాన్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top