You Are Here: Home » చిన్నారి » రేడియో ఐసోటోప్‌లు అంటే ఏమిటి?

రేడియో ఐసోటోప్‌లు అంటే ఏమిటి?

ఒకే మూలకంలోని అణువులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది. అందులోని కొన్ని మూలకాల్లో న్యూట్రాన్ల సంఖ్య ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లతో పోలిస్తే… ఉండాల్సిన వాటికంటే ఎక్కువగా ఉండటాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఒకే మూలకానికి చెందినా… వీటి సంఖ్య మారుతున్న కొద్దీ వాటి భౌతికధర్మాలు మారుతుంటాయి. రసాయనికంగా ఒకేలాంటి ధర్మాలు ఉన్నా భౌతిక ధర్మాలు వేరుగా ఉండి పరమాణువు బరువు వేర్వేరుగా ఉన్న ఒకే మూలకానికి చెందిన రూపాలను ఐసోటోప్స్ అంటారు. వీటికి ధార్మికశక్తి ఉంటే వాటిని రేడియో ఐసోటోప్‌లు అంటారు. కృత్రిమమైన రేడియో ఐసోటోప్‌లను శాస్త్రజ్ఞులు పరిశోధనశాలల్లో రూపొందిస్తుంటారు. రోగులకు వివిధరకాల వైద్య పరీక్షల కోసం వైద్యులు రేడియో ఐసోటోప్‌ల మీద ఆధారపడతారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top