You Are Here: Home » సినిమా » రెబెల్ విశేషాలు

రెబెల్ విశేషాలు


రెబెల్ విశేషాలు 
రెబెల్ విశేషాలు

‘డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’వంటి సూపర్‌హిట్స్‌ ఇచ్చిన యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా మాస్‌, డాన్‌, కాంచన వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాతలు జె.భగవాన్‌, జె.పుల్లారావు నిర్మిస్తున్న భారీ చిత్రం ‘రెబల్‌’ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

ఈ చిత్రం గురించి నిర్మాతలు జె.భగవాన్‌, జె.పుల్లారావు మాట్లాడుతూ – ”రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఈ చిత్రంలోని ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ని 15 రోజులపాటు శంషాబాద్‌లో చిత్రీకరించాం. 25 లక్షల రూపాయలతో భారీ సెట్‌ వేసి, ఆ సెట్‌లో 20 అడుగుల కాళీమాత విగ్రహాన్ని ప్రతిష్టించి చిత్రంలోని ప్రధాన తారాగణం రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు, యంగ్‌రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, దీక్షాసేథ్‌, ప్రభ, ముఖేష్‌ రుషి, సుప్రీత్‌లతోపాటు 100 మంది ఫైటర్స్‌, 1000 మంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొనగా ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ని భారీ ఎత్తున చిత్రీకరించాం. టెక్నికల్‌గా కూడా చాలా హై స్టాండర్డ్స్‌లో వుండే ఈ ఎపిసోడ్‌ ఈ చిత్రంలో ఓ హైలైట్‌ అవుతుంది. ఈనెల 16 నుండి రామోజీ ఫిల్మ్‌సిటీలో షెడ్యూల్‌ స్టార్ట్‌ అవుతుంది. 29 నుండి 15 రోజులపాటు క్లైమాక్స్‌ సన్నివేశాల్ని పెద్ద లెవల్‌లో ప్లాన్‌ చేశాం. దాని తర్వాత రెండు పాటల్ని ఫారిన్‌లో, ఓ పాటని భారీ సెట్స్‌లో చిత్రీకరించడంతో ఏప్రిల్‌ నెలాఖరుకు షఉటింగ్‌ పూర్తవుతుంది. 40 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభాస్‌ కెరీర్‌లోనే హై బడ్జెట్‌ ఫిలింగా రూపొందుతున్న ‘రెబల్‌’ చిత్రాన్ని జూన్‌ రెండోవారంలో రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ప్రభాస్‌, లారెన్స్‌ కాంబినేషన్‌లో ‘రెబల్‌’ సెన్సేషనల్‌ హిట్‌ అవుతుంది” అన్నారు.

యంగ్‌రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సరసన తమన్నా, దీక్షాసేథ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ప్రభ, ముఖేష్‌ రుషి, ప్రదీప్‌ రావత్‌, సుప్రీత్‌, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ, కోవై సరళ, నలుగురు బాంబే విలన్స్‌ ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి మాటలు: ‘డార్లింగ్‌’ స్వామి, ఫొటోగ్రఫి: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, నిర్మాతలు: జె.భగవాన్‌, .పుల్లారావు, కథ- స్క్రీన్‌ప్లే-సంగీతం-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్‌

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top