You Are Here: Home » ఇతర » రూ.900 కోట్ల వ్యయంతో హైలైట్‌ సిటీ బిల్డర్స్‌ భారీ టౌన్‌షిప్‌

రూ.900 కోట్ల వ్యయంతో హైలైట్‌ సిటీ బిల్డర్స్‌ భారీ టౌన్‌షిప్‌

వినియోగదారుల కోసం 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నివాస, వాణిజ్య, ఆఫీసు, రిటైల్‌ (చిల్లర వ్యాపార) పట్టణ టౌన్‌షిప్‌ను నిర్మిస్తున్నట్లు హైలైట్‌ సిటీ బిల్డర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సులేమాన్‌ తెలిపారు. రూ.900 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భవన సముదాయంలో ఒక షాపింగ్‌ మాల్‌, 400 విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు, 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ భవనం, 3 వేల కార్లను నిలిపేందుకు స్థలం, 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైలైట్‌ మాల్‌ నిర్మిస్తున్నట్లు తెలియజేశారు.

HiLitaఇందులో 60వేల చదరపు అడుగులలో హైపర్‌ మార్కెట్‌, 1,20,000 చదరపు అడుగులలో డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌, 35 వేల చదరపు అడుగులలో గేమింగ్‌ జోన్‌ తదితర నిర్మాణాలు చేపడుతున్నట్లు ఎండీ వివరిం చారు. హైలైట్‌ మాల్‌లో 200 రిటైల్‌ షాపులు, హోటల్‌తోపాటు 8 స్క్రీన్‌ల మల్టీప్లెక్స్‌ నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ నూతన తరహా నిర్మాణ ప్రాజెక్టులు దేశ నిర్మాణ రంగ స్వరూపాన్నే మార్చేస్తాయని తెలిపారు . ఈ తరహా ప్రాజెక్టులు అతి త్వరలోనే దేశ భవిష్యత్‌ నిర్మాణరంగ ప్రాజెక్టులుగా అవరించనున్నా యని పేర్కొన్నారు.

మిశ్రమ వినియోగం కోసం భూమి అభివృద్ధి ప్రాజెక్టులు త్వరలో రానున్నాయని ఇందులో షాపింగ్‌, గృహ వసతి, వాణిజ్య సముదాయతోపాటు అన్ని వసతులు ఒకే దగ్గర అందుబాటులో ఉండే అవకాశముం టుందన్నారు. అన్ని వసతులు ఒకే చోట ఉంటే ప్రయాణ భారం తగ్గుతుందన్నారు. అందువల్ల ఈ కొత్త విధానం ఒక వరం లాంటిదన్నారు. ఈ మిశ్రమ వినియోగంతో పట్టణ శివార్లు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top