You Are Here: Home » సఖి » సీరియల్స్ » రియల్‌ హీరోయిన్‌

రియల్‌ హీరోయిన్‌

Rasamayi‘‘నిజంగా మీకు నేను నచ్చానా?’’ అర్ధరాత్రి.. ఆకాశంలో చుక్కలన్నీ వెలుగు ముగ్గులేస్తు న్న వేళ..తనని గట్టిగా కావలించుకుని పక్కనే పడు కున్న మొగుడ్ని లేపి మరీ ఆ ప్రశ్న ఆడిగింది సృజన. ‘‘ఏంటి సృజా… ఇపుడా ఈ డౌట్‌?’’ ‘‘ఇపుడు కాక… ఇంకెపుడు? ఇపుడే నా క్వశ్చన్‌కి ఆన్సరివ్వండి.. నిజంగా నేను మీకు నచ్చానా?’’ ‘‘నచ్చావ్‌. ఎంత నచ్చావంటే.. ఇంత ’’ అంటూ రెండు చెతుల్లో ఆమెని బిగియారా కౌగిలించుకున్నా డు భరద్వాజ్‌. ఆమె కళ్లలో కళ్ళు పెట్టి చూస్తూ… ‘‘ఇవే.. ఈ కళ్లే మొదటిచూపులోనే నాకు గాలం వేసాయి. ఈ చూపులే చురకత్తుల్లా గుచ్చి మరి గుండెని గాయం చేసాయి. సంపెంగ లాంటి నాసిక…గులాబీలు పూసే చెక్కిళ్లు…అన్నీ అన్నీ తెగ నచ్చేసాయి ’’ అంటూ కవిత్వం చెప్పడం మొదలెట్టాడు భరద్వాజ్‌.

ఔను మరి, అందాల అపరంజి సృజనని చూడగానే భరద్వాజ ముందు ‘దేవీదాస్‌’ అవుతారు. ఆ తర్వాత కవి కాళిదాసూ అవుతాడు. ఆమెని ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ముద్దుల్తో ముద్రలేస్తున్నాడత ను. అతడు ముద్దు పెట్టినచోటల్లా… తగిలిన తడి ఎంగిలి ఇంత అగ్గి రాజేస్తోంది.
అతి దగ్గరగా అతడు వదుల్తున్న వేడి ఊపిరికి ఆమె శరీరం హాయిరాగాలు పాడే వేణువే అవు తోంది. గాలి కూడా చొరరాని ఆ కౌగిలిబంధంలో ఇమిడిపోవడం… కొంచెం కష్టంగా… ఇంకొంచెం ఇష్టంగా ఉంది సృజనకి. అయినా పట్టు విడవకుం డా… ఇందాక అడిగిందే మళ్లీ మళ్లీ అడుగుతోంది సృజన. ‘‘నేనంటే ఎంత ఇష్టమో చెప్పండి…’’

‘‘చెప్తున్నానుకదా..’’ అంటూ చటుక్కన ఎర్రెర్రని పెదాలు చిట్లేలా… రక్తం చిమ్మేలా గాటేస్తూ… కాట ేస్తూ అన్నాడు… ‘‘నువ్వంటే నా ప్రాణం… నీ మెడ వొంపులో తలబాదుకుని చచ్చిపోయేంత ఇష్టం. నిజం సృజూ… నన్ను నమ్ము..’’ అంటూ ఆమె చుబుకాన్ని చుంబించాడు భరద్వాజ్‌.
ఆ తర్వాత… ఆమె చాతీపై చెయ్యేసి అడ్డంగా ఉన్న పైటని పక్కకి తొలగించాడు.
అప్పటి దాకా పంజరంలో ఉన్న పరువాలకి స్వేచ్చ దొరికినట్లయి… కొత్తగా రెక్కలొచ్చిన జంటపావురా ల్లా అవి అమితోత్సాహంతో ముందుకు ఉరికొస్తున్నాయి.
‘‘సృజూ…నువ్వెంత నచ్చకపోతే నీ ఇల్లు వెతక్కుంటూ వస్తానా? నీ మెళ్లో తాళికట్టి నా సొంతం చేసుకుంటానా? నీకు తెలీదా… నేను ‘ఊ…’ అంటే చాలు… ఆంధ్రదేశంలో కోటిమంది ఆడపిల్లలు క్యూ కడ్తారు…’’
‘‘అదే… అదే నా భయం. అందుకే, మళ్లీ మళ్లీ మరీ మరీ అడుగుతున్నా. ఇలాంటి మొగుడు ఎవళ్ళకీ రాకూడదు. ఎందుకంటే, మా ఆయన చుక్కల్లో చంద్రుడు. వంటిమీదకి వయసొచ్చిన ప్రతి ఆడపిల్లా కంటిమీద కునుకులేకుండా మిమ్మ ల్నే కోరుకుంటుందాయె… అదే నా భయం..’’ అంటోంది సృజన.

‘‘వాళ్లు కోరుకుంటే సరా… నేను సై అనాలిగా…’’
‘‘మీరు సై అనకుండా… సైన్‌ చేయకుండా ఆ హోర్డింగ్‌లు వెలుస్తాయి? ఆ పోస్టర్లు పుట్టుకొస్తా యా? ప్రతి హోర్డింగ్‌లో నూ… ప్రతి పోస్టర్‌లోనూ మీరే. పబ్లిక్‌గా అమ్మాయి ల్ని వాటేసుకుంటూ, పాటేసుకుంటూ జాతర చేస్తున్నారు. తడిసిన తెల్ల చీరల్లో అందాల్ని బిగియా రా కౌగిలించుకుంటూ… ‘ఐలవ్‌యూ…’లు చెప్పే స్తున్నారు…’’ రుసరుసలా డింది సృజన.
‘‘అందుకే… అసూయ పుట్టాకే అడది పుట్టిందం టారు…’’
‘‘అదా మీ ఆన్సర్‌…? మీరు కాల్‌షీట్లు ఇస్తేనే కదా… అమ్మాయిలంతా కౌగిలించుకుంటున్నారు?’’
‘‘స్మాల్‌ కరెక్షన్‌… నేను కాల్‌షీట్లు ఇవ్వడం కాదు.. కరెన్సీనీ ప్రొడ్యూసర్లిస్తేనే… ఆ ముంబయి మోడల్స్‌ నా ఫియాన్సీలవుతున్నారు…’’ నవ్వుతూ అన్నాడు భరద్వాజ్‌.
‘‘అందుకే, థియేటర్‌కెళ్తే చాలు. సిన్మా చూపిస్తున్నారు…’’
‘‘ఔను మరి… హీరోని కదా?’’ అంటూ ఆమె మరి మాట్లాడకుండా తన పెదాల్తో ఆమెపెదాల్ని బంధించాడు భరద్వాజ్‌.
సృజన అచ్చం ఐశ్వర్యరాయ్‌లా ఉంటుంది.
అవే నీలికళ్లు… అవే పెదాలు… అదే పసిమివన్నె ఛాయ… అచ్చం అలాగే సన్నజాజి తీవెలా సన్న సన్నగా… అందంగా ఉంటుంది సృజన.
‘‘నన్ను చూస్తే ఐశ్వర్యని చూడలేదనే బెంగ మాకెవ్వ రికీ లేదా’’ ఆటపట్టించేవాళ్లు డిగ్రీలో కోస్టూడెంట్స్‌.
‘‘డైరక్టర్‌ శంకర్‌ సిన్మాల్లో ట్రయ్‌ చేస్తే… రోబో హీరోయిన్‌వి నువ్వే అయి ఉండేదానివి…’’ అనేవాళ్లు వాళ్లంతా నువ్వుతూ.
నవ్వేసి ఊరుకునేది సృజన. అయితే, ఒంటరిగా ఉన్నపుడు ఫ్రెండ్స్‌ మాటలు మాటిమాటికి గుర్తుకు రాగా… నిలువెత్తు అద్దం ముందు నిల్చుంటే… అద్దంలో సుందరి ఐశ్వర్యలాగే కనిిపించి ఆశ్వర్యపో యేది ఆమె కూడా. సృజన కాలేజినుంచి ఎపుడూ ఇంటికి ఒంటరిగా రాలేదు. కారణం… ఆమె వెనుక ఎపుడూ పదిమంది బాడీగార్డ్స్‌ ఉండేవాళ్లు.
ఆమె నవ్వునీ… నడకనీ… వంపుల్నీ… వయారాల్ని పొగుడుతూ ఆ రోమియోలు ఇంటిదాకా తోడొచ్చే వాళ్లు. ఒక్కోసారి తనగురించే వాళ్లలో వాళ్లు కొటు కునేవాళ్ళన్న సంగతి తన వెనక నడిచొచ్చే మగాళ్ల సంఖ్య తగ్గినపుడే ఆమెకి అర్థమయ్యేది. ఆ ఒక్కడూ ఆవేళ ఏ గవర్నమెంటాస్పత్రిలోనో చేరి చికిత్స పొం దుతన్నట్టు…వాళ్ల మాటల ద్వారానే తెలుసుకునేది.
తమతమ హీరోయిజం నిరూపించకునేందుకు వాళ్లలో వాళ్లు తిట్టుకోవడం… కొట్టుకోవడం ఆఖరికి ఆస్పత్రిపాలవడం… అన్నీ తెలుసుకుని కించిత్‌ గర్వపడేది.
అయితే… రోడ్‌ సైడ్‌ రోమియోల హీరోయిజానికే సంబరపడే సృజన రీల్‌హీరో తనని లవ్‌ చేస్తాడని ఏనాడూ కలలో కూడా అనుకోలేదు.
అనుకోనిది జరగడమే జీవితం కదా!
ఓ రోజు-
తమ కాలేజీలోనే షూటింగ్‌ జరుగుతోందని తెలిసి సృజన ఆశ్చర్యపోయింది.
అందులో హీరో భరద్వాజ్‌.
అప్పటికే ఒకట్రెండు సూపర్‌ డూపర్‌ హిట్‌లిచ్చిన హీరోగా… భరద్వాజ్‌కి మంచిపేరే ఉంది. కిన్నెర హీరోయిన్‌. లేటెస్ట్‌గా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాలో స్టూడెంట్‌గా యాక్ట్‌చేస్తోంది. నేచుర ల్‌గా ఉండాలనీ…కాలేజ్‌స్టూడెంట్స్‌ని క్లాసులేనే ఉంచారు. వాళ్లలో సృజన కూడా ఉంది.
‘‘సిన్మాల్లో ట్రై చేయమంటే… నువ్వెలాగోచేయవ్‌… అందుకే, నీ కోసమే ఈ యూనిట్‌ ఇక్కడికి వచ్చి నట్టుంది’’ సృజన ఫ్రెండ్‌ సృజనతో అందామాటల్ని.
‘‘చూడు.. నువ్వే హీరోయిన్‌లా ఉన్నావు…. ఆ కిన్నెర కన్నా…!’’ ఇంకో ఫ్రెండ్‌ అంటోందో లేదో… డైరక్టర్‌ నన్ను సృజన పై పడింది.
సృజన తడబాటుపడింది.
‘‘మీరోసారి రండి!’’ పిలిచాడు డైరక్టర్‌ సృజనని.
‘‘వెళ్లు.. వెళ్లు..’’ ఫ్రెండ్సంతా ముందుకు తోసారు.
దాంతో, తడబడ్తున్న అడుగుల్తోనే డైరక్టర్‌ దగ్గరకి వెళ్లింది సృజన.
‘‘సూపర్బ్‌… నువ్వు ఇండస్ట్రీకి వస్తే హీరోయిన్లంతా తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే. అస్సలిక్కడ తెలుగు హీరోయిన్లేరి? జికినీస్‌తో వచ్చే ముంబాయి మోడ ల్సేగా మన హీరోయిన్లు…’’ అన్నాడు డైరక్టర్‌.
ఆ తర్వాత… హీరోయిన్‌ కిన్నెరని పిలిచి… నీ పక్కన ఈ అమ్మాయి కూచుంటుంది…’’ ఇంట్ర డ్యూస్‌ చేస్తూ చెప్పాడు డైరక్టర్‌.
‘‘ఓకేసర్‌…’ అంది కిన్నెర.
ఆ తర్వాత… ఆమె సృజనకి షేక్‌హ్యాండ్‌ ఇస్తూ ఆత్మీయంగా కలిసిపోయి కబుర్లు చెప్పసాగింది.
‘సైలెన్స్‌’ గట్టిగా అరిచాడు డైరక్టర్‌.
సూది కిందపడ్తే విన్పించేంత నిశ్శబ్ధంగా ఉన్న జనాలంతా… డైరెక్టర్‌ అరుపుకి ఒక్కసారిగా హడలిపోయారు.
హీరోయిన్‌ కిన్నెరకి హీరో ‘ఐవ్‌యూ…’ చెప్పే సీన్‌ చిత్రీకరిస్తున్నారు.
హీరో భరద్వాజ్‌ చేతిలో గులాబీ పువ్వుంది.
‘‘స్టార్ట్‌ కెమెరా… యాక్షన్‌…’’ డైరక్టర్‌ అనేసరికి భరద్వాజ్‌ నెమ్మదిగా క్లాస్‌రూంలోకి వస్తున్నాడు.
అడుగులు తడబడ్తున్నట్టు…అతను నెమ్మదిగా నడుస్తున్నాడు. కిన్నెర అతనివేపే చూస్తూ సిగ్గుల మొగ్గే అవుతోంది. దగ్గరగా… అమె దగ్గరగా వచ్చాడు భరద్వాజ్‌. కిన్నెర పక్కనే సృజన కూడా ఉంది. ఆమె డైరక్టర్‌ సూచించినట్లు చిర్నవ్వులు చిందిస్తోంది. భరద్వాజ్‌ గూలాబీ ఇచ్చాడు. అయితే, అది కిన్నెరకి కాదు…పక్కనే ఉన్న సృజనకి.
సెవన్టీ ఎంఎం సిన్మాల్లో కనిపించే ఆరాధ్య కథానా యకుడు కళ్లెదుట నిలిచి…‘ఐవ్‌యూ…’ ఎర్రె ర్రని గూలాబీ అందించేసరికి… సృజన మారు మాట్లాడకుండా… అందిపుచ్చుకుంది. ఈ ఇన్సిడెం ట్‌తో చిర్రెత్తుకొచ్చిన డైరెక్టర్‌- ‘కట్‌’ అంటూ గట్టిగా అరిచాడు.
ఇటు సృజన… అటు కిన్నెర భయంభయంగా చూసారు డైరక్టర్‌ వంక.
మరేం భయం అక్కర్లేదన్నట్టు సృజన వంక నవ్వుతూ చూసాడు భరద్వాజ్‌.
‘మల్లీశ్వరి…’ సిన్మా చూస్తోంది సృజన రాణివాసం తీసుకెళ్లేందుకు రాజుగారు రావడం… వెళ్లనని భానుమతి మొండికేయడం… సీన్‌ అది,
సరిగ్గా, అపుడే… ఆమె ఇంటిముందు ఓ పడవ కారు ఆగింది. ఆ కారు చూసి ఇరుగుపొరుగు చిన్నారులు చుట్టూ గుమికూడారు.
ఆ హడావుడేంటో ఆ కార్లోంచి భరద్వాజ్‌ దిగాడు. ఆరడుగుల పొడవైన సిన్మా హీరో… కారు దిగి లో పలికి వస్తుంటే సృజన ఓ క్షణం అవాక్కే అయింది.
‘‘హలో…సృజన గారూ! నేను భరద్వాజని… లోనికి రావచ్చా? అడుగుతున్నాడు.
ఆ మాటలకి తేరుకున్న సృజన… ‘‘రండి… రండి!’’ అని లోనికి వెల్‌కమ్‌ చెప్పింది.
‘‘మమ్మీ డాడీ లేరా?’’
‘‘లేరు… అలా బయటకి ఇందాకే వెళ్లారు…’’ అంటూనే… పక్కింటి పిల్లవాడ్ని పిలిచి… ‘‘ఒరేయ్‌… చిట్టీ! రామాలయానికి వెళ్లి… అమ్మనీ నాన్ననీ కొంచెం పిలవ్వా…?’’ అంది గొంతు తడారి పోతుండగా.
‘‘ఫర్వాలేదు. వాళ్లని నెమ్మదిగా రానీ. ఈలోపు మనం మనం మాట్లాడుకుందాం…’’ కళ్లతోనే నవ్వుతూ అన్నాడు భరద్వాజ్‌.
‘‘ఇంటిని వెతుక్కుంటూ ఇతడెందుకొచ్చాడా… అనే కదా మీ డౌట్‌?’’
‘‘అరే, మనసులోది చదివేస్తున్నాడే…’’ తత్తరపడిం ది సృజన. భరద్వాజ్‌ లోపలకి వచ్చి సోఫాలో కూచున్నాడు.
‘‘సృజనగారూ…’’ ఏదో చెప్పాలనిపిస్తున్నా చెప్ప లేని పరిస్థితిని అతను ఎదుర్కొంటున్నట్టు అనిపిం చింది సృజనకి.
‘‘ఏంటో… ఇక్కడ వారంరోజులే షూటింగ్‌ చేసా రు. ఇంకొంత కాలం షూటింగ్‌ చేస్తే ఎంత బాగుం డేదనిపించింది నాకు…కానీ, నెక్స్‌ట్‌ షెడ్యూల్‌ అరకులో వేసారు… అక్కడ నాకేం తోచలేదు…’’
సృజన మాట్లాడలేదు. కొద్ది గ్యాప్‌ తర్వాత భరద్వా జే అన్నాడు…-‘‘అక్కడ సృజన లేదు కదా… అందు కే, అరకులో నాకు తోచలేదు…’’ ఆ మాటలకి ఒక్కసారి ఉలిక్కిపడింది సృజన.అతనేం మాట్లాడుతున్నాడో అర్థమై కానట్టుంది.

‘‘సిన్మాల్లో ఇటువంటి సీన్లలో యాక్టింగ్‌ ఇరగదీసే వాణ్ణి. ఎందుకంటే, ఓ వేపు కెమెరామేన్‌, మరోవేపు అసిస్టెంట్‌ డైరక్టర్స్‌, డైరక్టర్‌…ఓహ్‌, మనచుట్టూ గుంపు ఉండేది. చివరాఖరికి… ఓ అమ్మాయికి ‘ఐలవ్‌ యూ’ చెప్పాలన్నా బెరుకూ భయం ఉండేవి కావు. రైటర్‌ సీన్‌ రాసేవాడు. ఎదురుగా లిప్‌స్టిక్‌ పెదాల్తో ఇంత మేకప్‌ వేసుకుని స్టార్‌ హీరో యిన్‌ నిల్చుండేది. ‘ఐలవ్‌ యూ…’ ఎలా చెప్పాలో డైరక్టరే చెప్పేవాడు. ఇక, నేనో సింపుల్‌గా వాళ్లు చెప్పేట్టు చెప్పేసేవాణ్ణి. తీరా, థియేటర్లో ఆ సీన్‌ చూ స్తే సూపర్బ్‌ అనిపించేది… అయినా, అదంతా ప్లాస్టి క్‌ పువ్వులకు అత్తరు రాసిన సీన్లే. నిజం కాదు గా’’ చెప్తున్నాడు భరద్వాజ్‌. వింటోంది సృజన.

‘‘ఆ సీన్లన్నీ ఆర్టిఫిషియల్‌ సీన్లు, ఒరిజనల్‌ కానేకా దు. ఎందుకంటే లక్షల్లో రెమ్యూనరేషన్‌ తీసుకుం టున్న హీరోయిన్‌… హీరోతో ఐలవ్‌ యూ చెప్పిం చుకోవడం కోసమే అన్నట్టు వెయిట్‌ చేస్తుంటుంది. అలాగే, కోట్లలో పారితోషికం తీసుకుంటున్న హీరో కూడా… గులాబీపువ్వుతో ఎవరో రైటర్‌ రాసిన నాలుగు మాటల్ని వప్పచెప్పేసి…డైరక్టర్‌ చేత ‘కట్‌’ అనిపిస్తాడు. మరి ఇక్కడో..?’’ అతడేం చెప్తాడో గ్రహించిన సృజన గుండె వేగంగా కొట్టుకుంటోం ది. ముచ్చెమటలు పోస్తుంటే వణికోపోతోంది.
‘‘అక్కడ ఐలవ్‌యూ డైలాగ్‌ కేవలం పెదాల్తో పలికితే… నిజంగా, ఇలాంటి సన్నివేశాల్లో అదే మాట మనసుతో చెప్పాల్సి ఉంటుంది.

గుండెలో లోతుల్లోంచి ఆ మాట… ఆరే, గొంతు దాటి పెదవి దాటననీ మొరాయిస్తుంటే…’’ అన్నాడు భరద్వాజ్‌. ‘‘మమ్మీడాడీ వచ్చాక మాట్లాడుకుందాం…’’ అంది ఎలాగో గొంతు పెగల్చుకుని సృజన.
‘‘వాళ్లూ వస్తారు. అంతదాకా ముందు మనం మాట్లాడుకుందాం. మామూలుగా కాదు… మనసు విప్పి. చెప్పు, సృజనా! నేన్నీకు నచ్చానా?’’ అడుగుతున్నాడు.‘‘నేను మీ ఫాన్‌ని… రిలీజైన మీ సిన్మాలన్నీ కంపల్సరీ చూస్తా…’’ఆ జవాబుకి నీరుగారిపోయాడు భరద్వాజ్‌. ‘‘నేనడుగుతోంది నా సిన్మాల గురించి కాదు… నా గురించి నేనంటే నీకిష్టమేనా?’’ ‘‘ఇష్టమే..’’ అన్నట్లు నిలువుగా తలూపింది సృజన.‘‘నాకూనూ. నిజం చెప్పనా…

ఆరోజు షూటింగ్‌ గులాబీ నీకే ఎందుకిచ్చానో తెలుసా?’’‘‘పొరబడి… తడబడి…’’ ‘‘మనసుపడి… నిజం… సృజనా! ఫస్ట్‌ లవ్‌ అంటారే. అది నిన్ను చూసాకే నాకు కలిగింది. ఎన్నో సిన్మాల్లో ఫస్ట్‌ లవ్‌ గురించి పేజీలకు పేజీలు ఉపన్యాసా లిచ్చినా… అచ్చమైన అనుభూతి మాత్రం ఆరోజే కలిగింది. అదీ, నిన్ను చూసా కే… నే సూటిగా అడుగుతున్నా.. నన్ను పెళ్లిచేసుకోవా….ప్లీజ్‌’’ అతనడుగుతు న్నాడు బేలగా. సరిగ్గా అపుడే వచ్చారు సృజన అమ్మా నాన్న తెరమీద కనిపించే హీరో ఇలా ఇంటికోచ్చేసరికి… ఉబ్బితబ్బిబ్బియి పోయారు వాళ్లు ఇక, వీధిలో హడావుడి చెప్పనవసరం లేదు.
జనాలంతా ఇంటిముందు గుమికూడారు.
‘అభిమాన హీరో భరద్వాజ్‌ జిందాబాద్‌…’ అనే వాళ్ల కేకలు… అరుపులు ఇంట్లోకి జొరపడకుండా ముందు జాగ్రత్తగా… తలుపులు బిడాయించి మరీ… మాటలు సాగాయి. ఓ రకంగా అవే సృజనకి జరిగిన తొలి ‘పెళ్లిచూపులు’’!

ఆ తర్వాత వారానికే…. ఆకాశమంత పందిరి… భూదేవి అంత అరుగు… రంగురంగుల విద్యుత్‌ దీప తోరణాల అలంకరణలు… వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల రాకతో… అంగరంగవైభవంగా పెళ్లి తంతు జరిగింది. రిసెప్షన్‌ వేడుకలో… భరద్వాజ్‌ పక్కన జోడి కట్టిన హీరోయిన్లు ఒక్కొక్కరుగా వచ్చి… షేక్‌హ్యాండ్‌ ఇచ్చి…. మరీ కంగ్రాట్స్‌ చెప్తుంటే… సృజన వాళ్ల కళ్లలో అసూయనే చూసింది. ఆ తర్వాత భరద్వాజషూటింగ్‌కి ఊటీవెళ్లినా… పాటల పిక్చరైజేషన్‌కి అబ్రాడ్‌ వెళ్లినా సృజనకి నిదరుండేది కాదు. అర్ధరాత్రివేళ ఎవరో లేపినట్లు ఒక్కసారిగి లేచి… ఈవేళలో ఇపుడు మొగుడేం చేస్తున్నాడో… అని ఊహించకునేది. ీహరోయిన్లు కిన్నెర, స్వప్నమాధురి… ఇలా ఎవరో ఒకరు…భర్త పక్కన జోడీగా కనిపించి ఆమెలో కలవరం లేపేవాళ్లు.

– పి.వి.డి.ఎస్‌. ప్రకాష్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top