You Are Here: Home » ఇతర » రియల్‌ అసెట్‌

రియల్‌ అసెట్‌

మెట్రో కారిడార్‌ అత్యధిక ప్రీమియంను అందించడమే కాకుండా కారిడార్‌ వెంబడి మరిన్ని నిర్మాణాలు చేపట్టేలా బిల్డర్లకు అవకాశమిస్తూ అధిక ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌ఎస్‌ఐ) ను సైతం అందిస్తుందన్నది స్థిరాస్తి నిపుణుల ఉవాచ.

దక్షిణాదిలోని ప్రముఖ మెట్రో నగరం బెంగ ళూరులో ప్రస్తుతం కొనసాగుతున్న పలు కీలక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులే ఈ ప్రాంత స్థిరాస్తి రంగా నికి ఊపిరిగా మారాయి. ముఖ్యంగా వీటిలోని మెట్రో కారిడార్‌ ప్రాజెక్టు అన్నిటిలోకి ఆకర్షణీయంగా నిలిచి గత ఆరునెలల కాలంలో దాదాపుగా రూ. 4,500 కోట్ల మేర పెట్టుబడుల్ని ఆకర్షించింది. ఈ మెట్రో ప్రాజెక్ట్‌ వేగవంతమై సంబంధిత కార్యకలా పాలు ఊపందుకునే క్రమంలో ఈ పెట్టుబడులు మరింత పుంజుకుంటాయని నిపుణులు పేర్కొంటు న్నారు. ఈ మెట్రో కారిడార్‌ పరిధిలో పెట్టే పెట్టుబడులు భవి ష్యత్తులో కచ్చితంగా రెట్టింపు లాభాల్ని తీసుకు వస్తా యన్న నమ్మకంతో చిన్న, పెద్ద, కొత్త, పాత డెవలపర్లం తా వారి సొమ్మును ఇక్కడే పెట్టుబడులు పెడుతున్నా రు. నిర్మాణపరంగా నగరంలో ఇప్పుడు అత్యంత సౌలభ్యంగా వినియోగించుకునే వీలున్న ప్రదేశం మెట్రో కారిడార్‌ కాగా, దీనికి జోనల్‌ నియంత్రణ లేమీ వర్తించకపోవడం విశేషం.

ఫలితంగా బిల్డర్‌ ఎవరైనప్పటికీ ఎలాంటి అడ్డంకులూ లేకుండా రెసిడెన్షియల్‌, రిటైల్‌ లేదా కమర్షియల్‌ ప్రాజెక్ట్‌ దేనినైనా చేపట్టవచ్చని, పైగా ఈ కారిడార్‌ అత్యధిక ప్రీమియంను అందించడమే కాకుండా కారిడార్‌ వెం బడి మరిన్ని నిర్మాణాలు చేపట్టేలా బిల్డర్లకు అవకాశ మిస్తూ అధిక ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌ఎస్‌ఐ)ను సైతం అందిస్తుందన్నది స్థిరాస్తి నిపుణుల ఉవాచ.ఇక మెట్రో కార్యకలాపాలు ప్రారంభం కావడమేమిటి కారిడార్‌ పనులు సైతం గణనీయంగా పురోగమిస్తా యని, పెట్టుబడికి మించిన ప్రతిఫలం ఖాయమన్న నమ్మకంతో డెవలపర్లు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతున్నారని నిపుణులు స్పష్టం చేశారు.

ఈ ప్రాజె క్టు వల్ల ప్రాంతాల మధ్య పూర్తిస్థాయి అనుసంధానం సాధ్యం కాలేదన్న విమర్శలు వినిపిస్తున్న ప్పటికీ ఈ కారిడార్‌ వెంబడి రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులు ప్రారం భమై పురోగమిస్తున్న క్రమంలో ఈ సమస్య సమసి పోతుందంటున్నారు.వచ్చే ఆరునెలల కాలంలో బెంగళూరు నగరంలోని మొత్తం రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడుల్లో 80 శాతానికి పైగా ఈ కారిడార్‌ ఆకర్షిస్తుందని ఢంకా భజాయించి చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పెట్టుబడి రియల్‌ అసెట్‌గా మారుతుందని, పెట్టిన పెట్టుబడికి స్వల్ప కాలంలోనే రెట్టింపు మొత్తం చేతికి వస్తుందని రియల్‌ ఎస్టేటు వ్యాపారులు, ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దేశానికి చెందిన పలు పెద్ద కంపెనీలు ఈ ప్రాంతంపై దృష్టి సారించడం విశేషం.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top