You Are Here: Home » చిన్నారి » రాయల్ డిసీజ్ అంటే ఏమిటి ?

రాయల్ డిసీజ్ అంటే ఏమిటి ?

మనుషుల్లో జన్యులోపాల వల్ల కొన్ని వ్యాధులు తలెత్తుతుంటాయి. అలాంటి వాటిల్లో హీమోఫీలియా ఒకటి. ఈ వ్యాధి వచ్చిన వారిలో రక్తం గడ్డ కట్టదు. రక్తం గడ్డకట్టడానికి అవసరమైన థాంబ్రోప్లాస్టిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేకమైన జన్యువు మన శరీరంలో ఎక్స్ క్రోమోజోమ్‌లో ఉంటుంది.

కొంతమందిలో ఈ జన్యువు లోపిస్తుంది. ఈ జన్యులోపం ఉన్నవారికి గాయాలైనపుడు రక్తం గడ్డకట్టకుండా కారిపోతూనే ఉంటుంది. చివరకు ఇది మరణానికి దారితీస్తుంది. ఈ వ్యాధి సాధారణంగా అనువంశికంగా వస్తుంది. ఆడవారి కన్నా మగవారికే ఎక్కువగా వస్తుంది. హీమోఫీలియాని వైద్య శాస్త్రవేత్తలు మొదట యూరప్‌లోని రాజవంశీయులలో గుర్తించారు. అందుకే హీమోఫీలియాని రాయల్ డిసీజ్ అని కూడా పిలుస్తారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top