You Are Here: Home » ఇతర » రాముడి పాలనా పటిమ

రాముడి పాలనా పటిమ

ramaశ్రీ రామరాజ్యంలో నీళ్లలో పడి చనిపోయినవారు లేరు. పెద్ద గాడ్పులతో ప్రజలు పీడించబడలేదు. దొంగలు లేరు. ఆకలికి-జ్వరానికి తపించినవారు లేరు. నగరాలలో, గ్రామాలలో, నివసించే జనులు ధన- దాన్యాలు విస్తారంగా కలిగి, భోగభాగ్యాలతో కృతయు గంలో లాగా మిక్కిలి సుఖమనుభవించారు. శ్రీరాముడు అనేక అశ్వమేధ యాగాలను, యజ్ఞాలను చేసి, బ్రాహ్మ ణులకు లెక్కపెట్ట లేనన్ని ఆవులను, ధనాన్ని దానమిచ్చి, తన సుఖాన్ని వదులు కోనైనా ప్రజలకు సుఖం కలిగేటట్లు ధర్మ పద్ధతిలో రాజ్యపాలన గావించి, వైకుంఠ లోకానికి పోయాడు. శ్రీరామచంద్రమూర్తి, రాజ్య హీను లై నానా దేశాలలో తిరుగుతున్న పూర్వ రాజుల వంశాల వారిని పిలిపించి, వారి పెద్దల రాజ్యాన్ని వారికిచ్చి, వారం తా స్వధర్మాన్ని వీడకుండా కాపాడాడు.

బ్రాహ్మణ- క్షత్రి య-వైశ్య-శూద్రులనే నాలుగు వర్ణాల వారిని చక్కగా పరిపాలించాడు. స్వధర్మానుష్ఠానమే మోక్షకారణ మనీ, పరధర్మానుష్ఠానం పతనకారణమనీ తెలియచేశాడు. పదకొండువేల సంవత్సరాలు ఇలా రాజ్యాన్ని పాలించి విష్ణు లోకానికి చేరుకుంటాడు శ్రీరామచంద్రమూర్తి.రామాయణం పరిశుద్ధంగా చదివేవారికి, వినేవారికి మూడు విధాలైన సమస్త పాపాలు హరించి పోయి, ఏ మాత్రం ఆలస్యం లేకుండా మోక్ష ఫలం కలుగుతుంది. అంతశక్తి దీనికుండటానికి కారణం, ఇది వేద స్వరూపమై, వేదార్థాన్నే బోధిస్తుంది కాబట్టి. అంతేకాదు, సంసార సాగరాన్ని తరింపచేస్తుంది కూడా.

ఇది వినే వారు-చదివేవారు, అంతమాత్రాన సన్యాసులు కానవ సరం లేదు. ఆయుస్సు పెరిగి, కొడుకులు-కూతుళ్లతో, మనుమలు-ఇష్ట బంధువులతో అనుభవించి, మరణిం చిన తర్వాత మోక్షాన్ని-బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. పరిమితి చెప్పనలవికాని మహత్త్వమున్న రుూ రామా యణ గ్రంథాన్ని శాస్త్ర ప్రకారం చదివినా, ఇతరులు చదవగా విన్నా, అర్థ విచారం చేసినా, బ్రాహ్మణుడికి వేద వేదాంగాలు అధ్యయనం చేస్తే ఎలాంటి ఫలం కలుగు తుందో అలాంటిదే కలుగుతుంది. క్షత్రియుడికి సర్వాధి పత్యం కలుగుతుంది. వైశ్యుడికి వ్యాపార లాభం కలుగు తుంది. శూద్రుడికి అపారమైన గొప్పతనం లభిస్తుంది.

కాబట్టి నాలుగువర్ణాలవారు, స్ర్తీ-పురుషులు, దీన్ని చదవాలి-వినాలి. విషయ చింతన చేయాలి. వినేవారుంటే చదివి వినిపించాలి. చదివేవారుంటే వినాలి. ఈ రెండూ జరగని కాలముంటే, విన్నదానిని- కన్నదానిని, విశేషంగా మననం చేయాలి. ఏదోవిధంగా మనస్సు దీనిపై నిలపాలి. అందుకే-ఇందుకే రాముడు దేవుడయ్యాడు. మూఢత్వంతో చిన్న విషయాలను, గోరంతను కొండంతగా చేసినట్లు చేసి, తమ అజ్ఞానాన్ని ప్రదర్శించి, తామేదో గొప్పవారిమన్న భావనకు రావడం మంచిది కాదు.
– వనం జ్వాలా నరసింహారావు

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top