You Are Here: Home » సినిమా » పాటలు » రాధిక (1949)- గోపాలకృష్ణుడు నల్లన

రాధిక (1949)- గోపాలకృష్ణుడు నల్లన

పల్లవి :
గోపాలకృష్ణుడు నల్లన
గోకులములో పాలు తెల్లన
కాళిందిలో నీళ్లు చల్లన
పాటపాడెద నీ గుండె ఝల్లన

చరణం : 1
మా చిన్ని కృష్ణయ్య లీలలు… ఆ…
మంజులమగు మురళి ఈలలు
మా కీరశారికల గోలలు
మాకు ఆనంద వారాశి ఓలలు (2)
గోపాలకృష్ణుడు నల్లన

చరణం : 2
మా ముద్దు కృష్ణుని మాటలు
మరువరాని తేనెతేటలు
॥ముద్దు॥
మా పూర్వ పుణ్యాల మూటలు
మమ్ము దరిజేర్చు తిన్నని బాటలు (2)

చిత్రం : రాధిక (1949)
రచన : సదాశివ బ్రహ్మం
సంగీతం : సాలూరి హనుమంతరావు
గానం : రావుబాలసరస్వతీదేవి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top