You Are Here: Home » సినిమా » పాటలు » రాజకుమారుడు (1999)- ఎప్పుడెప్పుడు వలపు చప్పుడు

రాజకుమారుడు (1999)- ఎప్పుడెప్పుడు వలపు చప్పుడు

పల్లవి :

ఎప్పుడెప్పుడు వలపు చప్పుడు
మోజుపడ్డ కన్నె ఈడు
మోక్షమెప్పుడు
అప్పుడప్పుడు జరిగినప్పుడు
తొందరమ్మ పైట పందిరేసినప్పుడు
గుండె గుప్పెడు గుట్టు విప్పడు
గొంతు విప్పలేని గోలవుంది బోలెడు
పిల్ల వేలెడు సోకు సోలెడు
చీకటేళ కోరుతుంది చిలకకొట్టుడు

చరణం : 1

నడుమా చేతికి రాదు
నడిచి చెంతకు రాదు
గడిచేదెట్టా ఓ పొద్దు
అడిగే అల్లరివాడు
పడుచుపిల్లకే తోడు
మెడనే మీటేస్తాడు
న్యూజిలాండ్‌లో నూజివీడులా
లవ్స్రాల బారసాల
జరుగు జోరులో
బాలచంద్రుడు నేల ఇంద్రుడు
కసికొద్దీ రసమంతా కాజేస్తాడు

చరణం : 2

తడిసే ఒంటిని చూడు
ఇగిరే వన్నెలు చూడు
రగిలే ఈడుని చల్లార్చు
కనుల పాపల జోడి
కలిసే చూపుల వేడి
తెలిపే వలపుల నాడి
జీన్స్‌లాండ్‌లో జేమ్స్‌బాండ్‌లా
ట్యూన్స్ పాడి గిల్లుతాడు
బుల్లికృష్ణుడు
పడుచు గోపిక పంచదారిక
కొనతీపి తినిపించేదేనాడింక

చిత్రం : రాజకుమారుడు (1999)
రచన : వేటూరి, సంగీతం : మణిశర్మ
గానం : ఎస్.పి,బాలు, సుజాత

‘నీడ’ సినిమాతో బాలనటుడిగా 1979లో వెండితెరకు పరిచయమయ్యాడు మహేష్‌బాబు. బాలనటుడిగా తొమ్మిది సినిమాలలో నటించాడు. తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘రాజకుమారుడు’ చిత్రంతోకథానాయకుడిగా తెరంగేట్రం చేశాడు.

– నిర్వహణ : నాగేష్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top