You Are Here: Home » ఇతర » రాచబాటలోనే రాచర్ల సామ్రాజ్యం

రాచబాటలోనే రాచర్ల సామ్రాజ్యం

గ్రామీణ ప్రాంతాల్లో సైతం స్ర్తీ శిశుసంక్షేమానికి కృషిచేసిన మహిళ వీరు. ఈమె 26 ఏప్రిల్‌ 1900లో రాజ్యలకమ్మ, గోపరాజు వెంకట సుబ్బారావు దంపతులకు రాజమండ్రిలో జన్మించారు. వీరికి నలుగురు అక్కలు, ఇద్దరు అన్నలు, ఒక తమ్ముడు ఉన్నారు. ఆమెకు 12 ఏళ్ళ ప్రాయంలో రాచర్ల రామచంద్రరావుతో వివాహం జరిగింది. దేశభక్తుడు, సంస్కారవంతుడు, నాస్తిక కేంద్రాన్ని స్థాపించి ప్రచారం చేసిన నాస్తికులెైన గోరా, ఆమెకు అన్న, గోరా తన శక్తిమేర చెల్లెలి బాల్యవివాహాన్ని నిరోధించాలని ప్రయత్నం చేశారు. కానీ అది సాధ్యపడలేదు.

వీరికి ఒక కుమారుడు కలిగిన పిదప 18వ ఏట వెైధవ్యం ప్రాప్తించింది. అన్న గోరా గట్టి పట్టుదలతో ఆమె ఇంగ్లీషూ, తెలుగు, హిందీ పరీక్షలకు హాజరెైనారు.ఆ తరువాత వీరికి రాష్టభ్రాష విశారద, హిందీ ప్రచారక శిక్షణ ముగించు కున్నారు. అన్న గోరా ఈమెకు దేశాభిమానం, సేవాభావం, రాజకీయ పరిచయం, సంస్కరణాభిలాష ఇత్యాదివి నూరి పోసేవారు. వీరు స్వయంగా గాంధీజీ వద్ద కొంతకాలం ఉన్నారు. అందువల్లే కాబోలు ఒకసారి క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొంటారా అని గోరా ప్రశ్నించినపడు చెల్లెలు వీరితోపాటు భార్య సరస్వతి గోరా, చివరకు 17 ఏళ్ళ మేనకోడలు కుమారి మనోరమతో సహా అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు.

49-Raఒకసారి సీతారామమ్మ, రాజేశ్వరి, వేంకటసుబ్బమ్మ మరికొందరు కలసి విజయవాడలో జాతీయగీతాలు ఆలపిస్తూ, నినాదాలు చేస్తూ ఊరేగింపులు జరిపి శాసనోల్లంఘనం చేశారు. ఆ కారణంగా 13 ఏప్రిల్‌ 1944లో వీరందరికీ ఆరుమాసాలు జెైలుశిక్ష విధించి రాయవేలూరు జెైలుకుపంపి ‘సి’క్లాసులో ఉంచారు.వీరితోపాటు అమృతమ్మ, సావిత్రి, అమ్మాళ్‌, ఎర్నేని లీలావతి, రాధామనోహరం ఇత్యాదివారు జెైల్లో ఉన్నారు. ఇది ఇలా ఉండగా 22 ఫిబ్రవరి 1944న కస్తూర్బా గాంధీ మరణించారు. కస్తూర్బా గాంధీ జాతీయ స్మారక నిధి పేరిట దేశవ్యాప్తంగా విరాళాలు పోగుచేశారు. గ్రామీణ ప్రాంత స్ర్తీ, శిశు సంక్షేమం కోసం ఈ విరాళాలను బాపూజీ ప్రత్యేకించారు. పల్లెలకు వెళ్ళి నిర్మాణాత్మకంగా ఒక క్రమపద్ధతిలో సేవా కార్యక్రమాలు కొనసాగించడానికి ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రరాష్ట్రం నుండి వీరితోపాటు దుర్గాబాయమ్మ సరళాదేవి, విద్యాదేవితో కలసి మొత్తం ఎనిమిది మంది శిక్షణ నిమిత్తం1945 జూలెైలో సేవాగ్రాంకు బయలుదేరారు.

ఇక్కడ వెైద్యశాల, గోశాల, వంటశాల, చరఖాశాల ఇత్యాది అనేక శాఖలున్నాయి.గాంధీజీ స్వయంగా పూనుకుని విద్యార్థుల క్రమశిక్షణ, ఆరోగ్యం, శ్రమశక్తి, పరిశుభ్రత వంటి వాటిపెై ఆసక్తిగా గమనించేవారు. వీలున్నపుడల్లా ఆయన హాస్టల్‌ విభాగాన్ని సందర్శించేవారు. ఆశ్రమంలో కొన్ని నియమ నిబంధనలు పాటించేవారు. ఎవరికీ ఎటువంటి ఆహారం తినే అలవాటున్నా అటువంటి అలవాట్లను మూటగట్టి ప్రక్కన పెట్టవలసిందే. జొన్నరొట్టె, పపకూరల వంటి సామాన్య భోజనం తిని అక్కడివారు గడిపేవారు. ఇంతటి క్రమశిక్షణతోపాటు శరీర కష్టం, సాదాసీదా భోజనం అవాటులేని అనేకమంది నీరసపడిపోయేవారు. వీరి ఆశ్రమ జీవితంలో అనేక విషయాలు నేర్చుకున్నారు. అందువల్లనే తన గురుతుల్యుడెైన ఆర్యనాయకం ప్రశంసలందు కున్నారు. ఒకసారి గాంధీజీ ఆశ్రమంలో తిరిగేటపడు ఒక చిన్న ఏకు ముక్క కనిపించింది. జీవితంలో ఏ చిన్న వస్తువునెైనా పనికిరావని అజాగ్రత్తగా వ్యవహరించరాదని ఆ చిన్న ఏకుముక్క ఉపయోగాన్ని విశదీకరించారు.

ఆయన సమయం దొరికినపడల్లా బ్రిటిషూ రాజకీయ దృక్పథం నుండి అరంగుళం దూదిపింజ వరకు సమస్త విషయాలు ఆశ్రమంలో చర్చించేవారు. వీరు హిందీలో పట్టా పుచ్చుకోవడంతో ప్రతిశబ్దాన్నీ ఆకళింపు చేసుకొనేవారు. ఆశ్రమంలో శిక్షణ పూర్తిచేసుకుని కార్యరంగంలోకి దూకారు.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో గాంధీజీ శిష్యూలెైన బ్రహ్మజోశ్యుల సుహ్మ్రణ్యం దేశసేవకు తగిన వాలంటీర్లను తయారు చేయడానికి గౌతమీ సత్యాగ్రహాశ్రమాన్ని స్థాపించారు. సీతానగరం రాజమండ్రికి 14 మైళ్ళ దూరాన ఉంది. గాంధీజీ కస్తూర్బాజీ తో కలసి 8 మే 1929న ఒకసారి, మళ్ళీ తిరిగి 26 డిశంబరు 1933న మరోసారి ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. సుబ్రహ్మణ్యం మరణంతో పోలీసుల దురాగతాలు పెరిగిపోయి ఆశ్రమం చెల్లాచెదురయి పోయింది. ఆశ్రమానికి తిరిగి పూర్వవెైభవం తేవడానికి బాపూ కస్తూర్బా ్టస్ట్రు వారు తమ కార్యకలాపాలు ఇక్కడ చేపట్టారు. ఫలితంగా వీరు సీతానగరం చేరుకున్నారు.

కేవలం విద్యారంగంలోనే కాక ఆరోగ్యరంగంలో కూడా వీరు ప్రవేశించారు. పెద్ద ఆసుప్త్రులలో శిక్షణనిప్పించి ప్రసూతి సేవికలను అనేకమందిని తయారుచేశారు. ఏ మ్త్రాం వసతులు లేని కుగ్రామానికి ఎంతో సహాయం అందించారు. పసిపిల్లలకోసం బాలవిహార్‌ పేరుతో బాలసేవికల శిక్షణ ఆరంభమైనవి. ఆంధ్రప్రదేశ్‌లోని సీతానగరం ఆశ్రమంలో కస్తూర్బా గాంధీ స్మారక జాతీయ ్టస్ట్రు ఆధ్వర్యంలో తేనెపరిశ్రమ, అంబర్‌ చరఖా శిశు శరణాలయం, ప్రసూతి శిశు సంక్షేమ వెైద్యకేంద్రం ఒకటేమిటి ఇలా వివిధ రంగాలలో అభ్యున్నతికి అమూల్యమైన కృషి జరిగింది. ఈ నేపథ్యంలో ఆశ్రమంలో వీరు చేసిన కృషి ప్రశంసనీయమైనది. ఏవిభాగం ఆమెకు అప్పగించినా చాలా సమర్థవంతంగా నిర్వహించేవారు. వీరు మన రాష్ట్రానికి చేసిన సేవ ఎన్నటికీ మరువరానిది. ఆమె ఆశయాలను ఆచరిస్తే ఆత్మవిశ్వాసంతో ప్రగతి పథంలో పయనించవచ్చు.

– షేక్‌ అబ్దుల్‌ హకీం జాని

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top