You Are Here: Home » సినిమా » పాటలు » రాఘవేంద్ర (2003)- నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం

రాఘవేంద్ర (2003)- నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం

పల్లవి :
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం
నువు నాకోసం ఇక సంతోషం
అంతొద్దు లేమ్మా ఈ స్నేహం చాలమ్మా
నువు నా బంధం ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే
తరుముతున్నది నీకేసే
తడిసి తడియని నీ కురులే
పలుకుతున్నది నా పేరే
॥స్టైలే॥

చరణం : 1
నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుందిరా
పలకకున్నా సరే నీపై మోజు కలగలేదా
అందరీ తీరుగా నేను తెలుగు కుర్రానిగా
ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమ చాలిక
నీ మగసిరి నడకలలోన
తెలియని మత్తేదో ఉందిరా
అది నన్ను తడిపి ముద్ద చేసే
పగలే కల కంటున్నావో
కలవరింతలో ఉన్నావో
ఊహ నుండి బయటకు రావమ్మా
॥స్టైలే॥

చరణం : 2
నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా
సూటిగా చెప్పనా నీలో కోపం నచ్చెరా
ప్రేమని గుడ్డిది అంటే నమ్మలేదెన్నడూ
నమ్మక తప్పదు నిన్నే చూశా ఇప్పుడు
నీ కంటి బొమ్మల విరుపు
నీచులపై కొరడా చరుపు
అది నీపై వలపే కలిపెరా
పూవంటి హృదయంలోన తేనంటిమనసే నీది
నీ ప్రేమకు ఇదిగో జోహారే
॥స్టైలే॥

చిత్రం : రాఘవేంద్ర (2003)
రచన : సుద్దాల అశోకతేజ
సంగీతం : మణిశర్మ
గానం : హరీష్ రాఘవేంద్ర, సుజాత

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top