You Are Here: Home » చిన్నారి » రాకెట్ రూపకర్త ఎవరు?

రాకెట్ రూపకర్త ఎవరు?

అంతరిక్షం గురించి ఆసక్తి చూపించని వారు ఉండరు. ఒకప్పుడు చాలా అరుదైనవిగా అన్పించిన రాకెట్లు ప్రస్తుతం తరుచు అంతరిక్షలోకి దూసువెళ్తునే ఉన్నాయి. ఈ రోజుల్లో అంతరిక్షయానం వింతలా కాకుండా ఒక సాధారణ విషయంలా అనిపిస్తుంది. కానీ కొన్ని దశాబ్దాల క్రితం అంతరిక్షంలోకి వెళ్లడం అనేది కేవలం ఊహల్లోనే జరిగేది. అంతరిక్షయానాన్ని నిజం చేసినవి గోడార్డ్ పరిశోధనలు. ఆయన 1882 అక్టోబర్ 5వ తేదీన జన్మించారు. నిప్పు వల్ల వస్తువులు పైకి ఎలా ఎగురుతాయోనని ఆశ్చర్యపోయేవాడు.

నిప్పున ఉపయోగించి, రాకెట్లు తయారు చెయ్యవచ్చని, వాటితో చంద్రుడిపైకి కూడా వెళ్ల వచ్చని 32 ఏళ్ల వయసులోనే గోడార్డ్ ప్రతిపాదించాడు. ఆయన 1915వ సంవత్సరంలోనే శూన్యంలో కూడా రాకెట్ ఎగరగలదని నిరూపించాడు. అంతరిక్ష పరిశోధనా చరిత్రలో మార్చి 26, 1926 ఒక అద్భుతమైన రోజు. ఆరోజే గోడార్డ్ ద్రవ ఇంధనంతో రాకెట్ తయారు చేసి పరీక్షించాడు. ఆ రాకెట్ భూమి పైన 41 అడుగుల ఎత్తుకి ఎరిగింది. ఆ ప్రయోగమే ఈనాటి రాకెట్లకు పునాది. రాకెట్ల పరిశోధనే పునాదిగా ఉన్న గోడార్డ్ మిసైళ్లు కూడా రూపొందించాడు. కానీ చంద్రుడి పైకి రాకెట్‌ని పంపాలన్న తన కల నిజం కాకముందే గోడార్డ్ మరణించాడు. గొంతు క్యాన్సర్‌తో 1959 ఆగస్టు 10వ తేదీన ఆయన చనిపోయాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top