You Are Here: Home » ఇతర » రసజ్ఞ కళాకారుడు రయీస్

రసజ్ఞ కళాకారుడు రయీస్

హైదరాబాదు నడిబొడ్డున ఉన్న నాంపల్లిలోనే 1977 ఆగస్టు 16న పుట్టిన రరుూస్‌ అహ్మద్‌ నగరంలో పరిస్థితులు, సంస్కృతి మారినా పుట్టి పెరిగిన వాతావరణాన్ని మరువలేదు. ఆ సంస్కృతిని తన మనసు నిండే, మనసులోంచి కుంచెనిండా నింపుకుని ఎన్నో కళాఖండాల్ని సృష్టించారు. బీజం మెులెకత్తి, మెుగ్గతొడిగి వికసించి, పరిణతి సాధించడం అనే ప్రక్రియ వివిధ దశల్లో సాగుతోంది. అలా వివిధ దశల్లో చిత్రకళపట్ల అపారమైన శ్రద్ధాసక్తులతో అనంతమైన తపనతో సాధనతో ముందుకు నడుస్తూ వచ్చిన యువకుడు సయ్యద్‌ రరుూస్‌ అహ్మద్‌.

Untitaపబ్లిక్‌ గార్డెన్స్‌లోని బాలభవన్‌ను 2వ తరగతిలోనే చూశారు రరుూస్‌. చిత్రకారునిగా ఎదిగే లక్ష్యంతోనే బాలభవన్‌ మెట్లెక్కానని నేటికీ చెప్పుకుంటా రాయన. ప్రశాంతంగా కళను అభ్యసించడం కోసం తన సమయాన్నంతా వెచ్చించేవారు. అక్కడ ఆయనకు గురువు తోట వైకుంఠం తారసిల్లారు. ఆయన ఆనాడూ, ఈనాడూ గొప్ప చిత్రకారుడు. అలాంటి ద్రోణాచార్యుడే గురువుగా దొరికితే తపన వున్న ఎవరైనా అర్జునునిగా ఎదగక ఏం చేస్తాడు? రరుూస్‌ విషయంలో అదే జరిగింది. ఒకవైపు ఎక్కడ పోటీ వుంటే అక్కడికి తన చిత్రలేఖనాలను పంపుతూండేవారు. కొన్ని చోట్ల బహుమతులు వచ్చేవి. చిత్రకళపై కొడుకు చూపుతున్న మక్కువకు మురిసిన తల్లి ఈ రంగంలోనే కొనసాగమని ప్రోత్సహిచింది. బాలభవన్‌ స్థాయిలో ఉత్తమ చిత్రకారునిగా బహుమతి పొందిన నాడు ఆనందం, గర్వం తొణికిసలాడాయి. ఇంటర్‌ పూర్తయింది.

ఇక నీవు ఎక్కవలసిన మెట్టు బిఎఫ్‌ఏలో చేరడం.. నడువు అన్నారు గురువు వైకుంఠం. రరుూస్‌కు జెఎన్‌టియులో ఫైనార్ట్‌‌స కళాశాలలో కవితా దేవ్‌స్కర్‌ ప్రోత్సాహం కూడా తోడయింది. 2002లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎం.ఎఫ్‌ఏలో చేరారు. అక్కడ లక్ష్మాగౌడ్‌ పర్యవేక్షణ లో, క్రమశిక్షణతోకూడిన శిక్షణ లభించింది. లక్ష్మాగౌడ్‌ దేశ వ్యాప్తంగా వున్న కొద్దిమంది గొప్ప చిత్రకారుల్లో ఒకరు. కళను ఇప్పటికీ ఒక విద్యార్థికున్నంత శ్రద్ధతో ఆరాధించే కళాకారుడు. చిన్నప్పటినుంచీ చిత్రకళలో తనదైన ఊహాశక్తితో కృషి చేస్తున్న రరుూస్‌ అహ్మద్‌కు గుర్తింపుకూడా అ స్థాయిలో అంది వచ్చింది. హైదరాబాద్‌, ముంబయి, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ నగరాల్లో సగటున ఏదికొకటి చొప్పున 9 ఏళ్ళలో 9 వన్‌మాన్‌ షోలు నిర్వహించారు.

ఇది ఒక రకంగా రికార్డే. అతని సమకాలికులు, స్థితిపరులు కూడా ఇలా వాసిలోనూ, రాశిలోనూ గణనీయమన రీతిలో కళాఖండాలను సృష్టించలేదని చెప్పవచ్చు. దక్షిణాఫ్రికాలో భారతీయ సమకాలీన చిత్రకారుల ప్రదర్శనలో స్థానం దక్కించుకున్నారు. డమాస్కస్‌ (సిరియా)లో ఢిల్లీకి చెందిన జాతీయ లలిత కళా అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ గ్రూపు ప్రదర్శనలో, దుబాయిలో మజ్లిస్‌ గ్యాలరీలో జరిగిన ప్రదర్శనలో, జపాన్‌లో జరిగిన ప్రదర్శనలో రరుూస్‌ కళాఖండాలు ప్రదర్శితమయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో 20 గ్రూపు ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top