You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » రవీంద్రుడు మెచ్చిన రాఘవుడు

రవీంద్రుడు మెచ్చిన రాఘవుడు

పాత్రల మనస్తత్వాలను బాగా అర్థం చేసుకొని, భావ సంఘర్షణను ప్రతిబింబిస్తూ నటనకు వెలుగుబాటలు వేసిన మహా నటుడు బళ్ళారి రాఘవ. ఆధునిక ఆంధ్ర నాటక రంగం బళ్ళారి రాఘవ పుట్టుకతోనే ప్రారంభమైంది. బారెడు రాగాలు, తబలామోతలు లేకుండా భావ ప్రధానమైన అభినయంతో ప్రేక్షకులను రంజింపజేసిన వారు బళ్ళారి రాఘవ. స్ర్తీ పాత్రలు స్ర్తీలే ధరించాలని చాటిచెప్పి, విద్యాధికులైనస్ర్తీ పాత్రలను రంగస్థల మెక్కించి వాస్తవికతకు పట్టం కట్టిన విప్లవ నటుడు బళ్ళారి రాఘవ.

namస్ర్తీ పాత్రలు స్ర్తీలే ధరించాలని చాటిచెప్పి, విద్యాధికులైన స్త్త్రీలను రంగస్థల మెక్కించి వాస్తవికతకు పట్టం కట్టిన విప్లవ నటుడు బళ్ళారి రాఘవ. జాతి ప్రగతికి, మూఢాచారాల నిర్మూలనకు, నాటకరంగం అత్యంత ప్రధానమైనదని ప్రకటించి, ప్రతి పట్టణంలోనూ అన్ని హంగులూకల నాటకరంగం స్థాపించాలని ఎలుగెత్తి చాటిన నటుడు రాఘవ.బళ్ళారి రాఘవ 1880 ఆగస్టు 2వ తేదీన తాడిపత్రిలో శేషమ్మ, నరసింహచార్య దంపతులకు జన్మించారు. తండ్రి నరసింహాచార్యులు బళ్ళారి మునిసిపల్‌ హైస్కూల్‌లో తెలుగు పండితులు. ఆంధ్ర నాటక పితామహులుగా విఖ్యాతిగాంచిన ధర్మవరం రామకృష్ణ్ణమాచార్యులు రాఘవ మేనమామ.

బళ్ళారి మున్సిపల్‌ హైస్కూల్‌లో మెట్రిక్‌ పరీక్షపాసై మద్రాసు క్రిస్టియన్‌ కాలేజీలో పట్టభద్రులై లాకాలేజి నుండి బి.ఎల్‌. పట్టా అందుకున్నారు. బళ్ళారిలో న్యాయవాదిగా ఉండేవారు. మద్రాసు లోని కాలేజీలలో ఉన్నప్పుడే పెక్కు ఇంగ్లీష్‌ నాటకాలలో పాల్గొని పేరు గాంచారు. బళ్ళారిలో మేనమామవద్ద జూనియర్‌గా ఉంటూ నాటకాల్లో అభినయించేవారు. మేనమామగారు సరసవినోదినీ సభను, ఆంధ్ర చారిత్రక నాటక పితామహ కోలాచలం శ్రీనివాసరావు సుమనో రమ సభను ప్రారంభించి, ప్రదర్శనలిచ్చేవారు. రాఘవకు పౌరాణిక నాటకాల కంటే చారిత్రక, సాంఘీక నాటకాల పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేది.కోలాచలంవారి విజయనగర పతనంలో రాఘవ పఠాన్‌ రుస్తుం అభినయం అత్యద్భుతంగా ఉండేది. ఈ నాటకం హిందూ ముస్లిమ్‌ సఖ్యతకు భంగం కలిగిస్తోందని మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శనను నిషేధించింది.

Untitచాణక్య పాత్రధారిగా రాఘవ ఖండఖ్యాతి నందుకొన్నారు. నవరసాలు ఒకటి తర్వాత ఒకటి తరుముకొని వస్తున్నా యా అనిపించేదాయన నటనలో. రామదాసు పాత్రధారి గా రాఘవ భక్తి భావనను అద్భుతం గా ప్రదర్శించేవారు. నాటకంలో స్వయంగా కొన్ని సన్నివేశాలు కల్పిం చి ప్రదర్శిం చేవాడు. రచనలో సంద ర్భాన్నిబట్టి మార్పులు చేసేవాడు. జాతీయో ద్యమం ముమ్మ రంగా సాగుతున్న కాలమది. రామదాసు జైలులో వుంటూ ఆత్మసిద్ధి పొందడా నికి కారా గృహ వాసమే మొ దటి సోపానుమంటారు రామదాసుగా రాఘవ. 1919 జనవరిలో బెంగళూరులో జరిగిన ఫెస్టివల్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్‌‌స లో రాఘవ పఠాన్‌ రుస్తుమ్‌ అభినయాన్ని చూచిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రాఘవ నెంతగానో ప్రశంసించారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top