You Are Here: Home » చిన్నారి » రమణీయ రవివర్మ చిత్రాలు

రమణీయ రవివర్మ చిత్రాలు

Un69రాజా రవివర్మ 1848, ఏప్రిల్‌ 29న జన్మించారు. యువ రాజుగా వైభోగాలమధ్య గడిపారు. త్రివేండ్రంకు ఉత్తరంగా 40 కి.మీ. దూరాన ఉన్న కిల్లిమనూర్‌లో జీవిత ప్రథమ దశ గడిచింది. సాంప్రాదయబద్ధునిగా ఒద్దికగా పెరిగి పెద్దవాడౌతున్నాడు. భాగవత శ్రవణము, సాత్విక భారతీయ సంగీతము,సంస్కృత అభ్యా సము, రాజ కుటుంబీకులతో కలిసి తరచుగా చూసే కథాకళీ నృత్యాలు- ఇలాటి వాతావరణంలో ఎలాటి మానసిక ఒత్తిడులు లేకుండా కాలం గడిపేవాడు రవి వర్మ. రాజరాజవర్మ మేనమామ తంజావూర్‌ పద్ధతిలో కృషి చేసిన వర్ధమాన పెయింటర్‌. రవివర్మ తల్లి పేరు ఉమా అంభాబాయి తంపు రాత్రి.ఆమె ఒక కవయిత్రి అలాగే రవివర్మ తండ్రి వేదాలు అభ్యసించిన సంస్కృత పండితుడు. ఇలాటి సుహృద్భావ కళా వాతావరణం రవివర్మకు సమకూడిన నేపథ్యంలో ఆతని అభిరుచులు చివుళ్ళు తొడగసాగాయి. రంగుల లోకాన్ని తెరపైన ఆవిష్కరించ గల శక్తి రవివర్మలో ఉన్నదని గమనిం చిన మామ, ఆ క్రమంలో రవివర్మను ప్రోత్సహిస్తూ వచ్చారు.

ఒకరసారి మద్రాసు పట్టణము(చెన్నై)లో 1873లో గవర్నర్‌ లలితకళా ప్రదర్శన జరిగింది. రవివర్మ వేసిన చిత్రానికి బంగారు పతకం లభించింది.రవివర్మలో ఆసక్తి, ఉత్సాహములు హిమశృంగతుల్యమైనాయి. గోల్డ్‌ మెడల్‌ అతని కళా ప్రపంచానికి సింహ ద్వారమైనదని చెప్పవచ్చును.1874 నుండి 1875 వరకు అవిశ్రాంత చిత్రలేఖన నిర్మాత అయ్యాడు రవివర్మ.రాజా రవివర్మ ఆధునిక భారతీయ చిత్రకళా వైతాళికుడు అంటూ ఒ.సి. గంగూలీ ఆదిగా ఎందరో కళావిమర్శకులు ప్రస్తుతించారు. ఒ.సి. గంగూలీ వంటి చారిత్రక పరిశోధనా విమర్శకులకు రాజా రవివర్మ కదలికలు నూతనోత్తేజాన్ని కలిగించిన సరికొత్త ఔషధం అయింది. రాజా రవివర్మ 1906 లో కీర్తిశేషులైనారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top