You Are Here: Home » ఇతర » రచ్చ… రచ్చ

రచ్చ… రచ్చ

swipaబజ్జెట్‌ ప్రండ్లీ టాబ్లెట్‌ పీసీల అమ్మకాలు దేశీయ మార్కెట్లో జోరందుకుంటున్న నేపథ్యంలో దేశీయ టాబ్లెట్‌ తయారీ కంపెనీల మధ్య పోటీ వాతావరణం నెలకుంది. నేటి ట్రెండ్‌ అభిరుచలకు అనుగుణంగా వీటి రూపకల్పన ఉంటోంది. తక్కువ ధర శ్రేణుల్లో లభ్యమవుతున్న ఈ పోర్టబుల్‌ పీసీలలో సిమ్‌కార్డ్‌ స్లాట్‌, 3జీ వంటి ఫీచర్లు అనివార్యమయ్యాయి. తాజాగా కాలిఫోర్నియా సంస్థ స్వైప్‌ టెలికామ్‌ ఆండ్రాయిడ్‌ ఐసీఎస్‌ ఆధారితంగా స్పందించే డ్యూయల్‌ సిమ్‌ స్వైప్‌ టాబ్లెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.12వేలు, మరోవైపు కార్బన్‌ మొబైల్స్‌ 3జీ సిమ్‌కార్డ్‌ సపోర్టింగ్‌ ఫీచర్‌తో కూడిన ‘‘అగ్ని’’ టాబ్లెట్‌ను ఆవిష్కరిం చింది. ఈ డివైజ్‌ ఆండ్రాయిడ్‌ ఐసీఎస్‌ ఆధారితంగా స్పందిస్తుంది.

ఈ రెండు గ్యాడ్జెట్‌ల స్పెసిఫికే షన్‌లపై తులనాత్మక అంచనా ఇలా ఉన్నాయి. స్వైప్‌ టాబ్లెట్‌లో 7 అంగుళాల హైడెఫినిషన్‌ కెపాసిటివ్‌ టచ్‌స్రీన్‌ ఉంటే…. కార్బన్‌ అగ్నిలో 7 అంగుళాల కెపాసిటివ్‌ టచ్‌స్క్రీన్‌ ఉంది. ఆపరేటింగ్‌ విషయానికి వస్తే రెండింటిలోనూ ఆండ్రాయిడ్‌ 4.0 ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌ ప్లాట్‌ఫామ్‌ తో పనిచేస్తాయి. ప్రాసెసర్‌ విషయంలో మాత్రం కొంత తేడా ఉంది. స్వైప్‌లో 1.5 గిగాెహడ్జ్‌ ప్రాసెసర్‌ ఉంట్‌ కార్బన్‌ అగ్నిలో మాత్రం 1 గిగా హెడ్జ్‌ క్వాల్కమ్‌ ప్రాసెసర్‌ అమర్చారు. స్టోరేజి విషయంలో స్వైప్‌లో 8 జీబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 1 జీబి ర్యామ్‌, మెమరీని 32 జీబికి పెంచుకుని అవకాశం ఉంటే….. కార్బన్‌ అగ్నిలో 4 జీబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 512ఎంబీ ర్యామ్‌, మెమరీని 32జీబికి పెంచుకునే అవకాశం ఉంది. స్వైప్‌ టాబ్లెట్‌ ధర రూ.11,999లు ఉంటే కార్బన్‌ అగ్ని ధర మాత్రం రూ.10వేలు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top